ఢిల్లీ: కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ సన్‌రైజన్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు సిక్సులు బాదాడు. ఇందులో మూడు సిక్సులు (100, 105, 106) వంద మీటర్లు దాటాయి. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఒకే మ్యాచ్‌లో మూడు సిక్సులు వంద మీటర్లు బాదిన ఆటగాడు అతడే. అంతేకాదు ఈ సీజన్‌లో భారీ సిక్సు (106 మీటర్లు) అతడి పేరుపైనే ఉంది. కాగా ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ నిర్దేశించిన 201 పరుగుల భారి లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ బ్యాట్స్‌మెన్స్ ఘోరంగా విఫలమయ్యారు. పూరన్ ఒక్కడే 77 (37) అద్భుతంగా ఆడాడు. మరే బ్యాట్స్‌మెన్ నుంచి అతడికి మద్దతు లభించకపోవడంతో ఒంటరి పోరాటం చేశాడు. ఫలితంగా హైదరాబాద్ చేతిలో 69 పరుగుల తేడాతో పంజాబ్ ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment