Breadcrumb
నిప్పులు చెరిగిన ఉమ్రాన్.. సన్‌రైజర్స్ ఖాతాలో నాలుగో విజయం
Published Sun, Apr 17 2022 3:11 PM | Last Updated on Sun, Apr 17 2022 7:13 PM
Live Updates
IPL 2022: పంజాబ్ వర్సెస్ సన్‌రైజర్స్ లైవ్ అప్డేట్స్
నిప్పులు చెరిగిన ఉమ్రాన్.. సన్‌రైజర్స్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం
152 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేరుకుంది. మరో 7 బంతులు మిగిలి ఉండగానే కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ బ్యాటర్లు అభిషేక్ శర్మ (31), రాహుల్ త్రిపాఠి (34), పూరన్ (35 నాటౌట్), మార్క్రమ్ (35 నాటౌట్) తలో చేయి వేసి సన్‌రైజర్స్‌ను గెలిపించారు. ఈ విజయంతో సన్‌రైజర్స్ సీజన్లో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఉమ్రాన్ మాలిక్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో లివింగ్‌స్టోన్ (60) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు.
లక్ష్యం దిశగా సాగుతున్న సన్‌రైజర్స్
152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్ లక్ష్యం దిశగా సాగుతుంది. 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసి, లీగ్‌లో వరుసగా నాలుగో విజయం దిశగా పయనిస్తుంది. పూరన్ (20), మార్క్రమ్ (17) క్రీజ్‌లో ఉన్నారు. సన్‌రైజర్స్ మరో 30 బంతుల్లో 41 పరుగులు చేయాల్సి ఉంది.
అభిషేక్ శర్మ ఔట్
లక్ష్యం దిశగా సాగుతున్న సన్‌రైజర్స్‌ను రాహుల్ చాహర్ దెబ్బకొడుతున్నాడు. తొలుత డేంజరెస్ తిప్రాఠిని బోల్తా కొట్టించిన చాహర్.. తాజాగా అభిషేక్ శర్మ (25 బంతుల్లో 31) పెవిలియన్‌కు పంపాడు.
డేంజరెస్ త్రిపాఠి ఔట్
కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన రాహుల్ త్రిపాఠి ఈ మ్యాచ్‌లోనూ అలాగే విజృంభించేలా కనిపించాడు. అయితే రాహుల్ చాహర్.. త్రిపాఠి (22 బంతుల్లో 34; 4 ఫోర్లు, సిక్స్) జోరుకు బ్రేకులు వేశాడు. చాహర్ బౌలింగ్‌లో షారుక్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి త్రిపాఠి పెవిలియన్ బాట పట్టాడు. 9 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 64/2. క్రీజ్‌లో అభిషేక్ శర్మ (21), మార్క్రమ్ ఉన్నారు.
ఆచితూచి ఆడుతున్న సన్‌రైజర్స్
ఆరంభంలోనే విలియమ్పన్ వికెట్ పడటంతో సన్‌రైజర్స్ ఆచితూచి ఆడుతుంది. వన్‌డౌన్‌లో వచ్చిన రాహుల్ త్రిపాఠి (17 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 27) మరోసారి బ్యాట్ ఝులిపిస్తుండగా, అభిషేక్ శర్మ (16 బంతుల్లో 18) నిదానంగా ఆడుతున్నాడు. ఫలితంగా సన్‌రైజర్స్ 7 ఓవర్ల తర్వాత వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది.
ఎస్ఆర్హెచ్ను దెబ్బేసిన రబాడ.. విలియమ్సన్ ఔట్
పంజాబ్ బౌలర్ రబాడ్ సన్‌రైజర్స్‌ను ఆదిలోనే దెబ్బేశాడు. నాలుగో ఓవర్ తొలి బంతికి ధవన్‌కు క్యాచ్ ఇచ్చి కేన్ మామ (9 బంతుల్లో 3) పెవిలియన్ బాట పట్టాడు. ఫలితంగా 14 పరుగుల వద్దే సన్‌రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి ఉన్నారు.
నిప్పులు చెరిగిన ఉమ్రాన్.. 151 పరుగులకే చాపచుట్టేసిన పంజాబ్
ఉమ్రాన్ మాలిక్ (4/28) నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడటంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 151 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఆఖరి ఓవర్లో ఉమ్రాన్ ఏకంగా 3 వికెట్లు తీసి ఒక్కటంటే ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఆఖరి బంతికి అర్షదీప్ కూడా రనౌట్ కావడంతో ఈ ఓవర్లో పంజాబ్ మొత్తం 4 వికెట్లు కోల్పోయి ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది.
ఆరో వికెట్ కోల్పోయిన పంజాబ్
భారీ షాట్లతో అదరగొడుతున్న లివింగ్‌స్టోన్ (60) ఎట్టకేలకు ఔటయ్యాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి లివింగ్‌స్టోన్ పెవిలియన్ బాట పట్టాడు.19 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 151/6. క్రీజ్‌లో ఓడియన్ స్మిత్, రబాడ ఉన్నారు.
షారుక్ ఖాన్ ఔట్
భారీ షాట్లు ఆడుతున్న షారుక్ ఖాన్ (26) 17వ ఓవర్ తొలి బంతికి ఔటయ్యాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి షారుక్ పెవిలియన్‌కు చేరాడు. ఫలితంగా పంజాబ్ 132 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో లివింగ్‌స్టోన్ (54), ఓడియన్ స్మిత్ ఉన్నారు.
గేర్ మార్చిన పంజాబ్
ఆరంభంలో వరుస వికెట్లు కోల్పోవడంతో నిదానంగా ఆడిన పంజాబ్ 11వ ఓవర్ తర్వాత గేర్ మార్చింది. లివింగ్‌స్టోన్ (45), షారుక్ ఖాన్ (23) చెత్త బంతులను బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఫలితంగా పంజాబ్ స్కోర్ 14 ఓవర్ల తర్వాత 114/4గా ఉంది.
నాలుగో వికెట్ డౌన్
ఉమ్రాన్ మాలిక్ భీకరమైన పేస్‌తో సంధించిన బంతికి జితేశ్ శర్మ (11) ఔటయ్యాడు. 145కిమీ వేగంతో వేసిన షార్ట్ పిచ్ బంతిని పుల్ షాట్ ఆడే క్రమంలో జితేశ్.. ఉమ్రాన్‌కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. 9 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 62/4. క్రీజ్‌లో లివింగ్‌స్టోన్ (17), షారుక్ ఖాన్ ఉన్నారు.
కష్టాల్లో పంజాబ్
ఇన్నింగ్స్ ఆరంభం నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతున్న పంజాబ్.. 7వ ఓవర్లోనూ వికెట్ కోల్పోయింది. సుచిత్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో(12) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తొలుత బౌలర్ అప్పీల్‌కు అంపైర్ ఔట్‌గా ప్రకటించగా, బెయిర్‌స్టో రివ్యూకి వెళ్లాడు. అయినా డెసిషన్ బెయిర్‌స్టోకు అనుకూలంగా రాలేదు. 7 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 51/3. క్రీజ్‌లో లివింగ్‌స్టోన్(15), జితేశ్ శర్మ (2) ఉన్నారు.
పంజాబ్ రెండో వికెట్ డౌన్
5వ ఓవర్లో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. వరుసగా రెండు బౌండరీలు బాదిన ప్రభ్‌సిమ్రన్ (14).. నటరాజన్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ పూరన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. విలియమ్సన్ చాకచక్యంగా రివ్యూ తీసుకుని మరీ ప్రభ్‌సిమ్రన్‌ను పెవిలియన్‌కు పంపాడు. 5 ఓవర్ల తర్వాత పంజాబ్ కింగ్స్ స్కోర్ 33/2. క్రీజ్‌లో బెయిర్‌స్టో (11), లివింగ్‌స్టోన్ ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఆదిలోనే చుక్కెదురైంది. తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధవన్ (8) 3వ ఓవర్లోనే పెవిలియన్‌కు చేరాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో జన్సెన్కు సునాయాసమైన క్యాచ్ ఇచ్చి ధవన్ వెనుదిరిగాడు. ఫలితంగా 10 పరుగుల వద్దే పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో ప్రభ్‌సిమ్రన్, బెయిర్‌స్టో ఉన్నారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్
ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా డీవై పాటిల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే శిఖర్ ధవన్ అతని స్థానంలో టాస్కు వచ్చాడు.
తుది జట్లు:
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధవన్, బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రన్, లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, ఓడియన్ స్మిత్, రబాడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్షదీప్ సింగ్
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్, పూరన్, శశాంక్ సింగ్, జగదీష సుచిత్, భువనేశ్వర్ కుమార్, జన్సెన్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్
Related News By Category
Related News By Tags
-
లివింగ్‌స్టోన్ విధ్వంసం.. చివరి పోరులో పంజాబ్ చేతిలో చిత్తైన సన్‌రైజర్స్
ముంబై: ఎనిమిది జట్లు పాల్గొన్న గత ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎనిమిదో స్థానం... పది జట్లు పాల్గొన్న ఈసారి ఐపీఎల్‌లోనూ అదే స్థానం...అంతే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్! మరోసారి అభిమానులను తీవ్...
-
ధవన్, రబాడలను ఊరిస్తున్న భారీ రికార్డులు
ఐపీఎల్ 2022 సీజన్ ఇవాళ (మే 22) చిట్టచివరి లీగ్ మ్యాచ్ జరుగనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా సన్‌రైజర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారై, సన్‌రైజర్స్, పంజాబ్ జట్లు ...
-
నితీశ్ ‘షో’
ముల్లన్పూర్: ఐపీఎల్లో ఇప్పటి వరకు ఇంట గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు రచ్చ గెలిచింది. పంజాబ్ గడ్డపై ఆంధ్ర బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి (37 బంతుల్లో 64; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు బ్య...
-
ఐపీఎల్ 2023 ముందు.. ఆ ముగ్గురికి గుడ్‌బై చెప్పనున్న పంజాబ్ కింగ్స్ ..!
ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్ ప్రయాణం లీగ్ దశలోనే ముగిసిన సంగతి తెలిసిందే. నూతన సారథిగా బాధ్యతలు చేపట్టిన మయాంక్ అగర్వాల్ జట్టును నడిపించడంలో విఫలమ్యాడు. ఈ ఏడాది సీజన్లో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 7 వి...
-
'కెప్టెన్సీ భారం మంచి బ్యాటర్‌ను చంపేసింది'
ఐపీఎల్ 2022 సీజన్ కొందరు టీమిండియా ఆటగాళ్లకు పూర్వ వైభవం తీసుకొస్తే.. మరికొందరికి మాత్రం చేదు అనుభవం మిగిల్చింది. యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా లాంటి క్రికెటర్లు ఫామ్ కోల్పోయ...
Comments
Please login to add a commentAdd a comment