అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించారు. ఫలితంగా భీకర ఫామ్‌లో ఉండిన సన్‌రైజర్స్‌కు శృంగభంగం ఎదురైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా.. గుజరాత్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. డేవిడ్ మిల్లర్ సిక్సర్ బాది మ్యాచ్ ముగించాడు.
సన్‌రైజర్స్ దూకుడుకు ఆడ్డుకట్ట వేసిన గుజరాత్ బౌలర్లు..
సూపర్ ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ బ్యాటర్లకు ఈ మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లు అడ్డుకట్ట వేశారు. గుజరాత్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి సన్‌రైజర్స్‌ను నామమాత్రపు స్కోర్‌కే పరిమితం చేశారు. మోహిత్ శర్మ 3, ఒమర్‌జాయ్, ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు.
తొలి రెండు మ్యాచ్‌ల్లో 200 పరుగుల మార్కును క్రాస్ చేసిన సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. మయాంక్ అగర్వాల్ 16, హెడ్ 19, అభిషేక్ శర్మ 29, మార్క్రమ్ 17, క్లాసెన్ 24, షాబాజ్ అహ్మద్ 22, అబ్దుల్ సమద్ 29, వాషింగ్టన్ సుందర్ డకౌటయ్యారు.
ఆడుతూపాడుతూ..
163 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఆది నుంచి నిలకడగా ఆడిన గుజరాత్ బ్యాటర్లు ఒక్కో పరుగు పేర్చుకుంటూ విజయం దిశగా సాగారు. సాహా (25), గిల్ (36), సాయి సుదర్శన్ (45), డేవిడ్ మిల్లర్ (44 నాటౌట్), విజయ్ శంకర్ (14 నాటౌట్) తలో చేయి వేసి గుజరాత్‌ను గెలిపించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో షాబాజ్ అహ్మద్, మార్కండే, కమిన్స్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment