విజయానందంలో పఠాన్
కోల్‌కతా : సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ సమిష్టి ప్రదర్శనతో మట్టికరిపించింది. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్.. ఆతిథ్య కోల్‌కతాను అటు బౌలింగ్.. ఇటు ఫీల్డింగ్‌తో 138 పరుగులకే కట్టడి చేసింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌లో క్రిస్‌లిన్ 49( 34 బంతులు,7 ఫోర్లు,1 సిక్సు), దినేశ్ కార్తీక్ 29(27 బంతుల్లో 2 ఫోర్లు,1 సిక్సు), రానా 18(14 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సు)లు మినహా మిగతా ఆటగాళ్లు సింగిల్‌డిజిట్‌కే పరిమితమయ్యారు.
విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్..
ఇక 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆరేంజ్ ఆర్మీకి ఓపెనర్లు శుభారంభం అందించారు. ఓపెనర్ సాహా వరుస ఫోర్లతో విరుచుకుపడగా.. ధావన్ నెమ్మదిగా ఆడాడు. జట్టు స్కోరు 39 వద్ద సాహా 24(15 బంతుల్లో 5 ఫోర్లు) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే ధావన్(7) సైతం నరైన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ కాగా.. మనీష్ పాండే (4) కుల్దీప్ బౌలింగ్‌లో ఎల్డీడబ్ల్యూ అయి నిరాశపరిచాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన షకీబ్ అల్ హసన్‌తో కెప్టెన్ విలియమ్సన్ బాధ్యాతాయుతంగా ఆడాడు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 13.2 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసుకుంది. ఈ దశలో షకీబ్ అల్ హసన్ 27(21బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సు)ను చావ్లా బౌల్డ్ చేసాడు. ఈ తరుణంలో 43 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్సుతో అర్థ సెంచరీ పూర్తిచేసుకున్న విలియమ్సన్‌ను జాన్సన్ బోల్తా కొట్టించాడు. అయితే లక్ష్యం చిన్నది కావడంతో సన్‌రైజర్స్‌పై అంత ప్రభావం పడలేదు. క్రీజులోకి వచ్చిన యూసఫ్ పఠాన్17(7 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్సు), దీపక్ హుడా(5)తో కలిసి లక్ష్యాన్ని పూర్తి చేసాడు. పఠాన్ సిక్సుతో మ్యాచ్‌ను ముగించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment