
Aakash Chopra Predicts Who Win The DCvsSRH Match: ఐపీఎల్ ఫేజ్2లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ నేడు తలపడనుంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా నేటి మ్యచ్‌లో ఎవరు విజయం సాధిస్తారన్నది అంచనా వేశాడు.ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తప్పనిసరిగా విజయం సాధిస్తుందని ఆకాష్ చోప్రా థీమా వ్యక్తం చేశాడు. సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నందున రాబోయే మ్యాచ్‌ను గెలవడానికి విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటుందని చోప్రా అభిప్రాయపడ్డాడు. ఒక వేళ ఈ మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ ఓడిపోతే వాళ్ల ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారుతాయిని చోప్రా పేర్కొన్నాడు.
"ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధిస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఢిల్లీ ఈ సీజన్‌లో అత్యత్తుమ ఫామ్‌లో ఉంది. ఈ ఏడాది లీగ్‌లో హైదరాబాద్ పేలవమైన ఫామ్ కారణంగా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఒకవేళ హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే, ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారుతాయి . కాబట్టి విజయం సాధించడానికి జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంటుంది" అని చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో వెల్లడించాడు. మరో వైపు ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌లో హైదరాబాద్ విధ్వంసక ఓపెనర్ జానీ బెయిర్‌స్టో సీజన్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ రెండవ స్థానంలో ఉండగా, హైదరాబాద్ చివరి స్ధానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment