ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీపై కాసుల వర్షం కురిసింది. మహ్మద్ షమీని రూ. 10 కోట్ల భారీ ధరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన షమీ కోసం తొలుత కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీ పడ్డాయి.
అయితే ఆఖరికి కేకేఆర్, సీఎస్‌కే పోటీ నుంచి తప్పుకోవడంతో ఈ స్టార్ బౌలర్‌ను ఎస్‌ఆర్‌హెచ్ సొంతం చేసుకుంది. కాగా షమీ గతంలో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే అతడిని ఈ మెగా వేలానికి ముందు గుజరాత్ రిటైన్ చేసుకోలేదు.
ఈ మెగా వేలంలో అతడిని తిరిగి సొంతం చేసుకోవడానికి ఆర్టీమ్ ఆప్షన్ ఉన్నప్పటకి గుజరాత్ సముఖత చూపలేదు. దీంతో అతడు సన్‌రైజర్స్ సొంతంమయ్యాడు. ఇక దాదాపు ఏడాది తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన షమీ అదరగొడుతున్నాడు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment