సాక్షి, హైదరాబాద్ : డెత్‌ఓవర్ స్పెషలిస్ట్, సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడుతూ 100 వికెట్లు పడగొట్టాడు. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను ఔట్ చేసి భువీ ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇక ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇది 100వ మ్యాచ్ కావడం విశేషం. ఈ విషయాన్ని తెలియజేస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, ఐపీఎల్ తమ అధికారిక ట్వీటర్‌లో భువీకి అభినందనలు తెలియజేశాయి. ఇక భువనేశ్వర్‌పై అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
‘స్వింగ్ కింగ్‌కు సెల్యూట్.. 100వ మ్యాచ్ 100 వికెట్ శభాష్ భువీ’ అంటూ కొనియాడుతున్నారు. ఇక ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 109 మ్యాచ్‌లు ఆడిన భువీ..125 వికెట్లు పడగొట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కన్నా ముందు.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పుణెవారియర్స్ జట్లకు అతను ప్రాతినిథ్యం వహించాడు. దురదృష్టవశాత్తు సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. 15 పరుగులకే చివరి 8 వికెట్లు కోల్పోయి మరో 13 బంతులు మిగిలి ఉండగానే అనూహ్యంగా ఆలౌట్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment