సన్‌రైజర్స్‌కు డబుల్‌ ధమాకా.. జట్టులో చేరిన స్టార్‌ ఆటగాళ్లు | IPL 2021: David Warner, Kane Williamson Land In Chennai To Join Sunrisers Hyderabad Camp | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్‌కు డబుల్‌ ధమాకా..

Published Fri, Apr 2 2021 4:34 PM | Last Updated on Fri, Apr 2 2021 7:54 PM

IPL 2021: David Warner, Kane Williamson Land In Chennai To Join Sunrisers Hyderabad Camp - Sakshi

చెన్నై: ఐపీఎల్‌ 2021 కోసం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్‌, కేన్ విలియ‌మ్సన్‌లు శుక్రవారం చెన్నైలో ల్యాండయ్యారు. వీరితోపాటు ఆ జట్టు సహాయ కోచ్ బ్రాడ్ హ‌డిన్ కూడా చెన్నైకు వ‌చ్చాడు. ఈ విష‌యాన్ని స‌న్‌రైజ‌ర్స్ యాజమాన్యం త‌మ ట్విట‌ర్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. "ఈగిల్స్ ల్యాండ్ అయ్యాయి.. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌, కేన్‌ విలియమ్సన్‌, బ్రాడ్‌ హడిన్‌లకు స్వాగతం" అంటూ స‌న్‌రైజ‌ర్స్ ట్వీట్ చేసింది.

ఇదిలా ఉండగా, ఏప్రిల్‌ 9 నుంచి ప్రారంభంకానున్న 14వ ఐపీఎల్‌ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ జట్టు త‌మ తొలి ఐదు మ్యాచ్‌ల‌ను చెన్నైలోనే ఆడ‌నుంది. ఈ నెల 11న తమ తొలి మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో తలపడనుంది. ఐదు మ్యాచ్‌ల అనంతరం హైదరాబాద్‌ జట్టు..  ఢిల్లీలో నాలుగు మ్యాచ్‌లు, ఆతరువాత కోల్‌క‌తాలో మూడు, బెంగ‌ళూరులో రెండు మ్యాచ్‌లు ఆడ‌నుంది. కాగా, కొద్ది రోజుల కిందటే స్టార్‌ ఆల్‌రౌండ‌ర్ మిచెల్ మార్ష్ లీగ్‌ నుంచి వైదొలగడంతో అత‌ని స్థానంలో సన్‌రైజర్స్‌ యాజమాన్యం ఇంగ్లండ్ ఓపెన‌ర్ జేస‌న్ రాయ్‌ను తీసుకున్న విష‌యం తెలిసిందే.
చదవండి: ప్రముఖ మోడల్‌తో పంత్‌ డేటింగ్‌.. పాత గర్ల్‌ఫ్రెండ్‌తో బ్రేకప్‌..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement