David Warner Instagram Story Goes Viral After SRH Captaincy Replace With Kane - Sakshi
Sakshi News home page

వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ వైరల్‌

Published Sun, May 2 2021 2:07 PM | Last Updated on Sun, May 2 2021 8:02 PM

IPL 2021: David Warners Instagram Story Goes Viral - Sakshi

Photo Courtesy: IPL Twitter

హైదరాబాద్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఇంకా సగం కూడా పూర్తి కాకుండానే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్సీ పదవి నుంచి డేవిడ్‌ వార్నర్‌ను తప్పించారు. సన్‌రైజర్స్‌ వైఫల్యాలకు వార్నర్‌ను బాధ్యుడ్ని చేస్తూ అతని సారథ్య పగ్గాలను మధ్యలోనే తొలగించారు. ఓవరాల్‌గా జట్టు ప్రదర్శన పేలవంగా ఉండి వరుస పరాజయాలను చూస్తున్న ఆరెంజ్‌ ఆర్మీలో వార్నర్‌ కెప్టెన్‌గా తప్పించి కేన్‌ విలియమ్సన్‌కు ఆ బాధ్యతలు అప్పచెప్పారు. 

విలియమ్సన్‌కు కెప్టెన్సీ ఇవ్వడాన్ని ఎవరూ తప్పుబట్టకపోయినా ఇలా అర్థాంతరంగా తప్పించడం అభిమానులకు మింగుడు పడటం లేదు. గత సీజన్‌లో కేకేఆర్‌ కెప్టెన్‌గా కొనసాగిన దినేశ్‌ కార్తీక్‌ కూడా ఇలానే మధ్యలో తన పదవి నుంచి తప్పుకున్నాడు. అప్పుడు కార్తీక్‌ స్వయంగా తప్పుకున్నానని ప్రకటించడంతో పెద్దగా వివాదం చెలరేగలేదు. కానీ వార్నర్‌ విషయంలో సన్‌రైజర్స్‌ కాస్త దూకుడుగానే వ్యవహరించిందనే చెప్పాలి. ఒక ప్లేయర్‌గా ఐపీఎల్‌లో మంచి రికార్డులు ఉన్న వార్నర్‌ను తప్పించడం వెనుక కొంతమంది హస్తం ఉందని సోషల్‌ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. 

ఇదిలా ఉంచితే, వార్నర్‌ను సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా తప్పించిన తర్వాత ఈ లెఫ్ట్‌హ్యాండర్‌ గతంలో పోస్ట్‌ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలు వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌ల జరగపోవడాన్ని ప్రస్తావిస్తూ చేసిన ఇన్‌స్టా పోస్ట్‌ ఒకటి ఇప్పుడు వైరల్‌ అయ్యింది.  ఆపై వార్నర్‌ రూపానికి తన పెయింటింగ్‌తో అద్భుతంగా చిత్రీకరించిన ఒక అభిమానికి థాంక్స్‌ చెప్పిన పోస్ట్‌  కూడా ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 

ఇక్కడ చదవండి: ఆ బంతిని కూడా ఫోర్‌ కొడితే ఇంకేం చేస్తాం!
భారీ హిట్టర్లు ఉంటే ఇలానే ఉంటుంది: ధోని


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement