courtesy : IPL Twitter
ఢిల్లీ: డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ పదవి నుంచి తొలగించడపై ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్‌పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా సోషల్‌మీడియలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీమ్స్.. ట్రోల్సోతో రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో కివీస్ మాజీ క్రికెటర్.. కామెంటేటర్ సైమన్ డౌల్ స్పందించాడు.
'వార్నర్ విషయంలో ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణయం నాకు అసంతృప్తిని కలిగించింది. మనీష్ పాండేను జట్టు నుంచి తప్పించడంపై వార్నర్ ప్రశ్నించాడు. జట్టులో ఫాంలో ఉన్న ఆటగాడిని పక్కకు తప్పిస్తే ఏ కెప్టెన్ అయినా అలాగే రియాక్ట్ అవుతాడు. మ్యాచ్ ఓడిపోయిన బాధలో తనను తానే తప్పుబట్టుకుంటూ మనీష్ ప్రస్థావన తెచ్చాడు. అది సెలక్టర్లకు నచ్చలేదు. పైగా ఎస్‌ఆర్‌హెచ్ కోచ్ టామ్ మూడీకి .. వార్నర్‌కు పొసగడంలేదు.
మనీష్ పాండేపై వార్నర్ చేసిన వ్యాఖ్యలు పరిగణలోకి తీసుకొని జట్టులో నుంచి ఎలాగైనా తప్పించాలనే ఇలా చేసుంటారు. తమకు నచ్చిన విధంగా కామెంట్స్ చేసినందుకు వార్నర్‌ను కెప్టెన్సీ పదవి నుంచి తొలగించారు. అయితే టామ్ మూడీ ఎస్‌ఆర్‌హెచ్ కోచ్‌గా పక్కకు తప్పుకున్న తర్వాత ట్రెవర్ బోలిస్ కోచ్‌గా వచ్చాడు. అతనితో మంచి అనుబంధం కొనసాగించిన వార్నర్.. టామ్ మూడీ డైరెక్టర్ స్థానంలో మళ్లీ వచ్చినా అదే రిలేషన్‌షిప్‌ను మెయింటేన్ చేయలేకపోయాడు. దీంతో పాటు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం.. ఐదు పరాజయాలు మూటగట్టుకున్న ఎస్‌ఆర్‌హెచ్‌కు పరోక్షంగా వార్నర్‌ను కెప్టెన్సీ పదవి నుంచి తొలగించే అవకాశం వచ్చింది.''అంటూ చెప్పుకొచ్చాడు. ఇక వార్నర్ స్థానంలో కేన్ విలియమ్సన్ కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. నేడు రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
చదవండి: వార్నర్‌కు ఇంత అవమానమా.. ఇదేం బాలేదు
Comments
Please login to add a commentAdd a comment