
కోల్‌కతా : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఆదివారం స్థానిక ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)- సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో కేకేఆర్ గెలిస్తే అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. 2013 నుంచి ఇప్పటివరకు ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో కేకేఆర్ ఓడిపోలేదు. దీంతో ఈ విజయపరంపరను కొనసాగించాలని కార్తీక్ సేన ఆరాటడపడుతుండగా.. ఈ రికార్డును బ్రేక్ చేయాలని సన్ రైజర్స్ ఆలోచిస్తుంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ సారథి చేజింగ్‌కే మొగ్గు చూపాడు. గాయం కారణంగా సన్‌రైజర్స్ రెగ్గులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరం కావడంతో.. పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు.
ఐపీఎల్‌లో కేకేఆర్ ప్రారంభపు మ్యాచ్ విజయాలు
2013లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం
2014లో ముంబై ఇండియన్స్‌పై 41 పరుగుల తేడాతో విజయం
2015లో ముంబై ఇండియన్స్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం
2016లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం
2017లో గుజరాత్ లయన్స్‌పై పది వికెట్ల తేడాతో ఘన విజయం
2018లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై నాలుగు వికెట్ల తేడాతో విజయం
Comments
Please login to add a commentAdd a comment