ఢిల్లీ : అఫ్గానిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్, లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ బ్యాటింగ్‌ను కాఫీ చేయడానికి ప్రయత్నించాడు. అదేంటి రషీద్ స్మిత్ బ్యాటింగ్‌ను కాఫీ చేయడం ఏంటని అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం. అసలు విషయానికి వస్తే నిన్న(మంగళవారం) ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. కాగా అతని బర్త్‌డే సందర్భంగా పలువురు ఆటగాళ్లు అతనికి బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రషీద్ ఖాన్ కూడా తనదైన స్టైల్లో స్మిత్‌కు విషెస్ తెలిపాడు. అచ్చం స్మిత్ తరహాలో బ్యాట్ పట్టుకొని అతన్ని కాఫీ చేయడానికి ప్రయత్నించాడు. అతనికి విసిరిన బంతులను అచ్చం స్మిత్ తరహాలో కొట్టేందుకు ప్రయత్నించాడు. కాగా ఈ వీడియోను సన్‌రైజర్స్ టీం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ' స్మిత్ బర్త్‌డే సందర్భంగా అతన్ని ఆకట్టుకోవడానికి రషీద్ అతని బ్యాటింగ్ స్టైల్‌ను ప్రయత్నించాడు. ఈరోజు నువ్వు(స్మిత్) సంతోషంగా ఉండాలి.. ఫ్రమ్ ఆరెంజ్ ఆర్మీ..' అంటూ క్యాప్షన్ జత చేశారు.(40 ఏళ్లకు ఇంకా ఏడాదే బ్రదర్: విరాట్)
కాగా రషీద్ ఖాన్ 2015లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగ్రేటం చేశాడు. ఇప్పటివరకు అఫ్గానిస్తాన్ తరపున 71 వన్డేలాడి 4.16 ఎకానమీతో 133 వికెట్లు తీశాడు. అలాగే తన తొలి టెస్టును భారత్ మీద ఆడడం ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన రషీద్ 4 టెస్టుల్లో 23 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్‌లో 2017లో వేలంలోకి వచ్చిన రషీద్ ఖాన్‌ను సన్‌రైజర్స్ యాజమాన్యం రూ. 4 కోట్లకు దక్కించుకుంది. కాగా 2019లో రూ. 9 కోట్లకు మళ్లీ సన్‌రైజర్స్ యాజమాన్యమే రిటైన్ చేసుకుంది. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 46 మ్యాచులాడిన రషీద్ 55 వికెట్లు తీశాడు.(హార్దిక్ మాటల్లో ఆంతర్యం ఏమిటి?)
Comments
Please login to add a commentAdd a comment