హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు గుడ్ న్యూస్ లభించింది. గాయం కారణంగా టీమిండియాతో జరిగిన సిరీస్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులోలేని ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్.. ఐపీఎల్‌లో ఆడతాడో లేదో అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ.. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో రంగప్రవేశం చేసి, సెంచరీతో కదం తొక్కాడు. మార్ష్ కప్‌లో భాగంగా న్యూసౌత్ వేల్స్ తరఫున బరిలోకి దిగిన అతను.. టస్మానియా టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో అలరించడమే కాకుండా వరుసగా 87, 24, 69, 108 పరుగులు సాధించి సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇది సన్‌రైజర్స్ అభిమానులకు కచ్చితంగా గుడ్‌న్యూసనే చెప్పాలి.
కాగా, గాయం కారణంగా వార్నర్ ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమవుతాడన్న ఊహాగానాల నేపథ్యంలో అతను తిరిగి మైదానంలోకి అడుగుపెట్టడమే కాకుండా శతక్కొట్టడంతో సన్‌రైజర్స్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఐపీఎల్ మ్యాచ్‌లు ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానుండగా, సన్‌రైజర్స్ తన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ చెన్నై వేదికగా ఏప్రిల్ 11న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment