
భువనేశ్వర్, నుపుర్, శిఖర్ ధావన్, జోరావర్
సాక్షి, హైదరాబాద్ : టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ముద్దుల కొడుకు జోరావర్ అందరికి సుపరిచితమే. ఈ సీజన్ ఐపీఎల్ తండ్రితో పాటే ఉంటూ ఈ బుడ్డోడు మైదానంలో తెగ సందడి చేశాడు కూడా. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా ప్రాతినిథ్యం వహించడంతో జోరావర్‌తో అతనికి మంచి అనుబంధమే ఉంది. ఈ క్రమంలో వారి మధ్య జరిగిన ఓ చిలిపి సన్నివేశాన్ని భువనేశ్వర్ ఇటీవల ధావన్‌తో కలిసి పాల్గొన్న ‘వాట్ ద డక్ 3’ షోలో పంచుకున్నాడు.
‘ధావన్ కుమారుడు జోరావర్ సూపర్ యాక్టివ్. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయి ఆడుకుంటాడు. జట్టులో ఏ ఆటగాడిని చూసినా భయపడడు. ఒకసారి జరోవర్ నుపుర్(భువనేశ్వర్ భార్య)తో ఆడుకుంటున్నాడు. నేను అతడ్ని ఆటపట్టిద్దామని ఆమె నా భార్య అని కొంచెం గట్టిగా అరిచాను. ఆ వెంటనే జోరావర్ ‘ఆమె నా భార్య. ఆదివారం మాత్రమే నీకు భార్య’ అని గట్టిగా బదులిచ్చాడు. ఆ మాటకు మేమంతా చాలా సేపు నవ్వుకున్నాం’ అని భువీ నవ్వుతూ ఆ సంఘటనను గుర్తు చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment