
Courtesy: IPL Twitter
Jagadeesha Suchith Stunning Catch: ఐపీఎల్ 2021లో వరుస అపజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆప్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. అయితే శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ జగదీశ సుచిత్ స్టన్నింగ్ క్యాచ్‌తో అభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు.
మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేసిన జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో దీపక్ హుడా మిడాన్ దిశగా కొట్టిన షాట్‌ను మెరుపు వేగంతో గాల్లోకి ఎగురుతూ సుచిత్ సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్ పట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.
చదవండి: హోల్డర్ మెరిసినా... సన్‌రైజర్స్ అవుట్
— Sardar Khan (@SardarK07004661) September 25, 2021