play off race
-
ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ ఛాన్స్ . అలా జరిగితేనే?
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జూలు విదిల్చింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ తమ రన్‌రేట్‌ను భారీగా మెరుగుపరుచుకుని పాయింట్ల పట్టికలో ఐదో స్ధానానికి చేరుకుంది. దీంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగుపడ్డాయి.ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే?ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 12 పాయింట్లతో ఐదో స్ధానంలో కొనసాగుతోంది. ఆ జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధిస్తే సీఎస్కేతో పాయింట్ల పరంగా సమమవుతోంది. ఆర్సీబీ విజయంతో పాటు తమ రన్‌రేట్‌ను కూడా మెరుగు పరుచుకోవాలి. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేస్తే 18 పరుగుల తేడాతో విజయం సాధించాలి. అదే ఛేజింగ్‌లో అయితే 18.1 ఓవర్లలోనే మ్యాచ్‌ను ఫినిష్ చేయాలి. ఈ క్రమంలో సీఎస్కే(+0.528) కంటే ఆర్సీబీ మెరుగైన రన్‌రేట్(+0.387) సాధించి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తోంది. అంతేకాకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఓడాలి. -
IPL 2024: ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా..?
ఐపీఎల్ 2024 సీజన్లో అత్యంత కీలక దశ నడుస్తుంది. లీగ్ మొత్తంలో 70 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. 54 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కేకేఆర్ టాప్‌లో కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలు (16 పాయింట్లు, 1.453 రన్‌రేట్) సాధించి అగ్రస్థానంలో నిలిచింది.కేకేఆర్ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ (10 మ్యాచ్‌ల్లో 8 విజయాలు 16 పాయింట్లు 0.622 రన్‌రేట్), సీఎస్కే (11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు 12 పాయింట్లు 0.700 రన్‌రేట్), సన్‌రైజర్స్ (10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు 12 పాయింట్లు 0.072 రన్‌రేట్), లక్నో (11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు 12 పాయింట్లు -0.371 రన్‌రేట్), ఢిల్లీ (11 మ్యాచ్‌ల్లో 5 విజయాలు 10 పాయింట్లు -0.442 రన్‌రేట్), ఆర్సీబీ (11 మ్యాచ్‌ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -0.049 రన్‌రేట్), పంజాబ్ (11 మ్యాచ్‌ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -0.187 రన్‌రేట్), గుజరాత్ (11 మ్యాచ్‌ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -1.320 రన్‌రేట్), ముంబై ఇండియన్స్ (11 మ్యాచ్‌ల్లో 3 విజయాలు 6 పాయింట్లు -0.356 రన్‌రేట్) వరుసగా రెండు నుంచి పది స్థానాల్లో ఉన్నాయి.ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇలా..ప్రస్తుతమున్న పరిస్థితులను బట్టి ఏ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఎలా ఉన్నాయనే అంశంపై ఓ లుక్కేద్దాం. ప్రస్తుతానికి ఏ జట్టూ అధికారికంగా లీగ్ నుంచి ఎలిమినేట్ కానప్పటికీ.. ముంబై మాత్రం నిష్క్రమించే జట్ల జాబితాలో ముందువరుసలో ఉంది. ఈ జట్టు తదుపరి ఆడబోయే మూడు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించినా ప్లే ఆఫ్స్‌కు చేరదు. ఈ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు సున్నా అని చెప్పాలి.ప్లే ఆఫ్స్ ఛాన్స్‌లు దాదాపుగా గల్లంతు చేసుకున్న జట్ల జాబితాలో ముంబై తర్వాతి స్థానంలో గుజరాత్ ఉంది. ఈ జట్టు కూడా తదుపరి ఆడే మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే ఇలా జరిగి మిగతా జట్లు తమతమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓడితే సమీకరణలు మారతాయి. ఈ జట్టుకు మినుకుమినుకు మంటూ ఒక్క శాతం ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి.ఇక ముంబై, గుజరాత్ తర్వాత ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించేందుకు రెడీగా ఉన్న జట్ల జాబితాలో పంజాబ్, ఆర్సీబీ ఉన్నాయి. ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప ఈ జట్లు కూడా ప్లే ఆఫ్స్‌కు చేరలేవు. పంజాబ్‌కు 2 శాతం, ఆర్సీబీకి 3 శాతం ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. మిగతా జట్ల విషయానికొస్తే.. రాజస్థాన్, కేకేఆర్ జట్లు ఫైనల్ ఫోర్ బెర్త్‌లు దాదాపుగా ఖరారు చేసుకోగా.. సన్‌రైజర్స్, సీఎస్కే, లక్నో మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఢిల్లీకి సైతం ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నా ఆ జట్టుకు కేవలం 12 శాతం ఛాన్స్‌లు మాత్రమే ఉన్నాయి. కేకేఆర్‌కు 99, రాజస్థాన్‌కు 98 శాతం ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉండగా.. సన్‌రైజర్స్‌కు 75, సీఎస్కేకు 60, లక్నోకు 50 శాతం అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి అత్యద్భుతాలు జరగకపోతే పై సమీకరణలన్నీ యధాతథంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. -
కోహ్లీ అరుదైన రికార్డు ఫైనల్ కు అడుగు దూరంలో ఆర్సీబీ
-
లక్నో విజయం.. ఒక్క ఓవర్‌తో హీరో అయిపోయాడు
ఐపీఎల్ 16వ సీజన్లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్‌జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠను కలిగించింది. టిమ్ డేవిడ్ 18 బంతుల్లో 30 పరుగులతో సంచలన ఇన్నింగ్స్‌తో ముంబైని గెలిపిస్తాడనుకున్నారు. ఈ తరుణంలో ఒక్క ఓవర్‌తో అంతా తారుమారు చేసి హీరో అయ్యాడు లక్నో బౌలర్ మోసిన్ ఖాన్. మోసిన్ ఖాన్ బౌలింగ్ రావడానికి ముందు నవీన్ ఉల్ హక్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. దీంతో చివరి ఓవర్లో ముంబై విజయానికి 6 బంతుల్లో 11 పరుగులు అవసరమయ్యాయి. ఇక ముంబై విజయం లాంచనమే అనుకున్న తరుణంలో మోసిన్ ఖాన్ అద్బుత యార్కర్లతో చెలరేగాడు. 11 పరుగులు అవసరమైన దశలో అద్బుత యార్కర్లతో కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చుకొని లక్నోకు సంచలన విజయాన్ని కట్టబెట్టాడు. ఈ విజయంతో లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉన్నాయి. చివరి మ్యాచ్‌లో గెలిస్తే లక్నో ప్లేఆఫ్‌లో అడుగుపెట్టడం ఖాయం. Naveen Ul Haq tried everything to loose the match but Mohsin Khan and Cameron Green had another plans for LSG 😂#LSGvMI #MohsinKhan#LSG #camerongreen #naveenulhaq #GautamGambhirpic.twitter.com/ppr1AZvz5j — VK18Forever (Fan Page) (@VKianForever) May 16, 2023 చదవండి: ప్రతీసారి మనది కాదు సూర్య.. జాగ్రత్తగా ఆడాల్సింది! -
గుజరాత్ ఇప్పటికే; పోటీలో ఏడుజట్లు.. ప్లేఆఫ్స్‌కు వెళ్లేదెవరు?
ఐపీఎల్ 2023 సీజన్ తుది అంకానికి చేరుకుంది. గతేడాది ఛాంపియన్స్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ సోమవారం ఎస్ఆర్హెచ్పై విజయంతో ప్లేఆఫ్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్, ఎస్ఆర్హెచ్లు అధికారికంగా ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాయి. ఇక మిగిలిన మూడు స్థానాల కోసం ఏడు జట్లు పోటీ పడుతున్నాయి. దీంతో చివరి 8 లీగ్ మ్యాచ్‌లు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఛాన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చెన్నై సూపర్ కింగ్స్ Photo: IPL Twitter మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ 13 మ్యాచ్ లు ఆడి 7 గెలిచింది. ఐదు ఓడిపోయింది. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. 15 పాయింట్లు, 0.381 నెట్ రన్‌రేట్ తో సీఎస్కే రెండో స్థానంలో ఉంది. డీసీతో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. అయితే టాప్ 2లో ఉంటుందా అన్నది మాత్రం మిగతా టీమ్స్ గెలుపోటములపై ఆధారపడి ఉంటుంది. ఇక చివరి మ్యాచ్ ఓడిపోతే సీఎస్కే ఇంటిదారి పట్టే ప్రమాదం కూడా ఉంది. మరో ఐదు జట్లు 15 పాయింట్ల కంటే ఎక్కువ సాధించే వీలు ఉండటమే దీనికి కారణం. అయినా అన్ని మ్యాచ్ ల ఫలితాలు సీఎస్కేకు అనుకూలంగా వస్తే.. ఆ టీమ్ చివరి మ్యాచ్ లో ఓడినా క్వాలిఫై అవుతుంది. ముంబై ఇండియన్స్ Photo: IPL Twitter 12 మ్యాచ్ లు ఆడిన ముంబై ఇండియన్స్ ఏడు గెలిచి, ఐదు ఓడిపోయింది. 14 పాయింట్లు, -0.117 నెట్ రన్ రేట్‌తో ఆ టీమ్ మూడోస్థానంలో ఉంది. లక్నో, హైదరాబాద్ లతో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ రెండింట్లో గెలిస్తే టాప్ 2లో ముంబై క్వాలిఫై అవుతుంది. ఒకటి గెలిచి, మరొకటి ఓడితే 16 పాయింట్లతో మిగతా టీమ్స్ గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ రెండింట్లోనూ ఓడితే కష్టమే. అప్పటికీ అవకాశం ఉన్నా.. నాలుగోస్థానం కోసం మరో మూడు టీమ్స్ తో పోటీ ఉంటుంది. లక్నో సూపర్ జెయింట్స్ Photo: IPL Twitter లక్నో సూపర్ జెయింట్స్ 12 ఆడి 6 గెలిచి, ఐదు ఓడిపోయింది. ఒకటి ఫలితం తేలలేదు. 13 పాయింట్లు, 0.309 నెట్ రన్‌రేట్ తో నాలుగోస్థానంలో ఉంది. ముంబై, కేకేఆర్‌తో మ్యాచ్ లు ఉన్నాయి. ఈ రెండూ గెలిస్తేనే లక్నో ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. ఒకటి గెలిచి, మరొకటి ఓడితే నెట్ రన్‌రేట్ తో సంబంధం లేకుండా మిగతా ఫలితాలు లక్నోకు అనుకూలంగా వస్తే అర్హత సాధిస్తుంది. రెండూ ఓడితే మాత్రం ఇంటిదారి పట్టాల్సిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Photo: IPL Twitter ఆర్సీబీ 12 ఆడి, ఆరు గెలిచి, మరో ఆరు ఓడింది. 12 పాయింట్లు, 0.166 నెట్ రన్‌రేట్ తో ఐదో స్థానంలో ఉంది. సన్ రైజర్స్, జీటీతో మ్యాచ్ లు ఉన్నాయి. ఆర్ఆర్ పై భారీ విజయం ఆర్సీబీ అవకాశాలను మెరుగుపరిచింది. నెట్ రన్‌రేట్ పాజిటివ్ గా ఉండటంతో మిగిలిన రెండు మ్యాచ్ లు గెలిస్తే 16 పాయింట్లతో ఆ టీమ్ అర్హత సాధించే అవకాశాలు ఉంటాయి. ఒకటి గెలిచి మరొకటి ఓడితే మిగతా జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సిందే. రాజస్థాన్ రాయల్స్ Photo: IPL Twitter గతేడాది రన్నరప్స్ రాజస్థాన్ రాయల్స్ 13 మ్యాచ్ లలో ఆరు గెలిచి, ఏడు ఓడిపోయింది. 12 పాయింట్లు, 0.140 నెట్ రన్‌రేట్ తో ఆరోస్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ తో చివరి మ్యాచ్ ఆడనుంది. ఆర్సీబీ చేతుల్లో దారుణమైన ఓటమి ఆర్ఆర్ ప్లేఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసింది. చివరి మ్యాచ్ లో కచ్చితంగా గెలవాల్సిందే. అప్పటికీ మిగతా మ్యాచ్ ల ఫలితాలను బట్టే ఆర్ఆర్ క్వాలిఫై అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. ఆర్సీబీ, లక్నో తమ చివరి రెండు మ్యాచ్ లు ఓడటంతోపాటు సన్ రైజర్స్ తమ చివరి మ్యాచ్ లో ముంబై చేతుల్లో ఓడాలి. ఇలా జరిగితేనే ఆర్ఆర్ చివరి మ్యాచ్ గెలిస్తే అర్హత సాధిస్తుంది. ఇక ఓడితే మాత్రం ఇంటికే. పంజాబ్ కింగ్స్ Photo: IPL Twitter పంజాబ్ కింగ్స్ 12 ఆడి ఆరు గెలిచి, ఆరు ఓడింది. 12 పాయింట్లు, -0.288 నెట రన్‌రేట్ తో ఏడో స్థానంలో ఉంది. డీసీ, ఆర్ఆర్ లతో మ్యాచ్ లు ఉన్నాయి. ఈ రెండూ గెలిస్తే పంజాబ్ కింగ్స్ 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది. అయితే నెట్ రన్‌రేట్ నెగటివ్ గా ఉండటంతో భారీ విజయాలు సాధించడంతోపాటు ఇతర జట్ల నుంచి కూడా సాయం అందాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకటి ఓడినా నాలుగోస్థానం కోసం మరో నాలుగు టీమ్స్ తో పోటీ పడాల్సి వస్తుంది. మిగిలిన రెండు మ్యాచ్ లనూ పంజాబ్ కింగ్స్ ధర్మశాలలో ఆడనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ Photo: IPL Twitter కేకేఆర్ 13 మ్యాచ్ లు ఆడి ఆరు గెలిచి, ఏడు ఓడింది. 12 పాయింట్లు, -0.256 నెట్ రన్‌రేట్ తో 8వ స్థానంలో ఉంది. లక్నోతో మ్యాచ్ మిగిలి ఉంది. ఈ మ్యాచ్ లో భారీ విజయం సాధిస్తే టాప్ 4లో ముగించే ఛాన్స్ ఉంటుంది. అది కూడా చాలా తక్కువ అవకాశాలే ఉన్నాయి. లక్నో మిగిలిన రెండు మ్యాచ్ లు, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ కనీసం ఒక్కో మ్యాచ్ లో ఓడాల్సి ఉంటుంది. కేకేఆర్ నెట్ రన్ రేట్ కూడా నెగటివ్ గా ఉండటంతో ఆ టీమ్ క్వాలిఫై అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువే అని చెప్పాలి. చదవండి: మార్క్రమ్ చేసిన తప్పు.. ఆలస్యంగా వెలుగులోకి -
పంత్‌ను ఏకి పారేసిన రవిశాస్త్రి.. బ్రెయిన్ దొబ్బిందా అంటూ ఘాటు వ్యాఖ్యలు
ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక సమరంలో ఓడి, ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ పంత్ ఉదాసీనంగా వ్యవహరించి ముంబైని దగ్గరుండి మరీ గెలిపించాడని ధ్వజమెత్తాడు. టిమ్ డేవిడ్ డీఆర్ఎస్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంత్.. ఆర్సీబీకి (ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు)పరోక్షంగా సహకరించాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. Dehli Capital didn't review this against mighty Tim David and that could have cost them the play-off spot, oh dear! #MIvDC #DCvMI #IPL2022 pic.twitter.com/zv1Cu5Os2M — Ahmad Haseeb (@iamAhmadhaseeb) May 21, 2022 అవకాశమున్నా పంత్ సమీక్షను తీసుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టాడు. 2 సమీక్షలు మిగిలి ఉన్నా పంత్ కామన్ సెన్స్ ఉపయోగించలేకపోయాడని, అతని మైండ్ దొబ్బిందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ సరైన నిర్ణయం తీసుకోలేకపోతే పక్కనున్న ఆటగాళ్లైనా సలహా ఇవ్వాల్సిందని, కానీ వారు కూడా తమకేమీ పట్టలేదన్నట్లుగా వ్యవహరించారని దుయ్యబట్టాడు. ఢిల్లీ ఆటగాళ్లంతా ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ బెర్తును బంగారు పళ్లెంలో పెట్టి అందించారని అన్నాడు. కాగా, ముంబైతో జరిగిన మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ తొలి బంతికే క్యాచ్ ఔట్ కావాల్సింది. కానీ, రిషబ్ పంత్ డీఆర్ఎస్ తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించడంతో టిమ్ బయటపడ్డాడు. అనంతరం టిమ్ సుడిగాలి ఇన్నింగ్స్ (11 బంతుల్లోనే 34 పరుగులు) ఆడి ఢిల్లీ చేతుల్లోనుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ఫలితంగా ఢిల్లీ ఇంటికి, ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరాయి. చదవండి: టీమిండియాలోకి డీకే.. రీ ఎంట్రీపై ఆసక్తికర ట్వీట్ -
IPL 2022: ముంబైపై ఢిల్లీ గెలిచిందా.. ఆ నాలుగు జట్ల పని గోవిందా..!
ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్స్ సమీకరణలు రసవత్తరంగా మారాయి. నిన్న (మే 16) పంజాబ్‌ను ఢిల్లీ మట్టికరిపించడంతో సమీకరణలు మారిపోయాయి. 20 పాయింట్లు కలిగిన గుజరాత్ ప్లే ఆఫ్స్ బెర్తు కన్ఫర్మ్ చేసుకున్న ఏకైక జట్టు కాగా.. టెక్నికల్‌గా రాజస్థాన్ (16), లక్నో (16), ఢిల్లీ (14), ఆర్సీబీ (14), కేకేఆర్ (12), పంజాబ్ (12), సన్‌రైజర్స్ (10) జట్లు ప్లే ఆఫ్స్ రేసులో నిలిచాయి. షెడ్యూల్ ప్రకారం ఈ జట్లన్నీ మరో మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. సన్‌రైజర్స్ ఒక్కటే రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీటిలో రాజస్థాన్ (0.304), లక్నో (0.262) జట్లు మెరుగైన రన్‌రేట్‌తో పాటు 16 పాయింట్లు కలిగి సేఫ్ సైడ్‌లో ఉండగా.. మిగతా ఐదు జట్ల మధ్య రసవత్తరమైన పోటీ నెలకొని ఉంది. ఈ ఐదు జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆర్సీబీతో సమానంగా 14 పాయింట్లు కలిగిన ఢిల్లీకే ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఆర్సీబీ (-0.323)తో పోలిస్తే ఢిల్లీ (0.255) రన్‌రేట్ మెరుగ్గా ఉండటమే ఇందుకు కారణం. - ఇవాళ (మే 17) ముంబై చేతిలో ఓడితే సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ముంబైపై సన్‌రైజర్స్ భారీ తేడాతో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. - మే18న లక్నోపై కేకేఆర్ విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ఒక వేళ ఓడిందా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. - మే 19న గుజరాత్‌పై ఆర్సీబీ భారీ తేడాతో గెలిస్తేనే రన్‌రేట్ మెరుగుపర్చుకోవడంతో పాటు 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటుంది. - మే 20న సీఎస్కేపై రాజస్థాన్ గెలిస్తే దర్జాగా ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ రాజస్థాన్ ఓ మోస్తరు తేడాతో ఓడినా మెరుగైన రన్‌రేట్ కారణంగా సేఫ్ సైడ్‌లోనే ఉంటుంది. - మే 21న ముంబైపై ఢిల్లీ భారీ తేడాతో విజయం సాధిస్తే.. మెరుగైన రన్‌రేట్ కారణంగా ఆర్సీబీని వెనక్కునెట్టి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఈ దెబ్బతో ఆర్సీబీ సహా కేకేఆర్, పంజాబ్, సన్‌రైజర్స్ జట్లు ఇంటికి చేరతాయి. ఒక వేళ ముంబై చేతిలో ఢిల్లీ ఓడితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. - ఒకవేళ ముంబైపై సన్‌రైజర్స్ గెలిచి, లక్నోపై కేకేఆర్ గెలిచి, గుజరాత్ చేతిలో ఆర్సీబీ ఓడి, ముంబై చేతిలో ఢిల్లీ ఓడితే మాత్రం మే 22న జరిగే సన్‌రైజర్స్- పంజాబ్ మ్యాచ్ కీలకంగా మారుతుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిస్తే ఢిల్లీ, ఆర్సీబీ, కేకేఆర్‌లతో సమానంగా (14 పాయింట్లు) నిలుస్తుంది. సన్‌రైజర్స్ నిష్క్రమిస్తుంది. - ఆఖరి మ్యాచ్‌తో సంబంధం లేకుండా 16 పాయింట్లతో రాజస్థాన్, లక్నోలు దర్జాగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటే.. ఢిల్లీ, పంజాబ్, ఆర్సీబీ, కేకేఆర్ జట్లలో మెరుగైన రన్‌రేట్ కలిగిన జట్టు చివరి ప్లే ఆఫ్స్ బెర్తును దక్కించుకుంటుంది. చదవండి: ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్.. ఇరు జట్లలో భారీ మార్పులు..! -
IPL 2021: ఇలా గెలిస్తే ముంబై ఇండియన్స్ లేదంటే కేకేఆర్
IPL 2021 Playoff Race.. ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్ లీగ్ పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్కే, ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరుకోగా.. మిగిలిఉన్న ఒక్కస్థానానికి ఎవరు క్వాలిఫై అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైతే ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు కేకేఆర్‌తో పాటు ముంబై ఇండియన్స్‌కు ఉంది. పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్‌కు ప్లే ఆఫ్స్ అవకాశాలు లేనప్పటికి అదృష్టంతో వెళ్లే చాన్స్ ఉంటుంది. కానీ ఆ అవకాశం ముంబై, కేకేఆర్‌లు ఇవ్వకపోవచ్చు. కేకేఆర్: Courtesy: IPL Twitter కేకేఆర్ ప్రస్తుతం 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. ఏడు ఓటములతో 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. కేకేఆర్ నెట్‌రన్‌రేట్ +0.294గా ఉంది. ఇక ఆ జట్టు తన చివరి మ్యాచ్‌ను రాజస్తాన్ రాయల్స్‌తో ఆడుతోంది. ఈ మ్యాచ్‌ను కేకేఆర్ గెలిస్తే చాలు. 14 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒకవేళ రాజస్తాన్‌తో ఓడినప్పటికి కేకేఆర్‌కు మరో అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్తో జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తప్పకుండా ఓడిపోవాలి. అలా కాకుండా ముంబై గెలిస్తే కేకేఆర్ అవకాశం కోల్పోయినట్లవుతుంది. ఇటు రాజస్తాన్ చేతిలో కేకేఆర్.. అటు ఎస్ఆర్హెచ్ చేతిలో ముంబై ఓడితే మాత్రం నెట్‌రన్‌రేట్ ఆధారంగా కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. చదవండి: MS Dhoni: సాక్షి సింగ్ సమక్షంలోనే ధోనికి లవ్ ప్రపోజ్ ముంబై ఇండియన్స్: Courtesy: IPL Twitter రాజస్తాన్ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బారీ తేడాతో గెలిచి ఒక్కసారిగా ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది. 13 మ్యాచ్‌లాడిన ముంబై 6 విజయాలు.. 7 ఓటములతో ఐదో స్థానంలో ఉంది. ముంబై నెట్‌రన్‌రేట్ -0.048గా ఉంది. ముంబై ఇండియన్స్ తన చివరి మ్యాచ్‌ను ఎస్ఆర్హెచ్తో ఆడనుంది. ఆ మ్యాచ్‌లో ముంబై 120 పరుగులకంటే ఎక్కువ బారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ ముంబై ఈ మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికి ప్లే ఆఫ్స్ అవకాశాలు అంతంత మాత్రమే. అది వీలు కాని పక్షంలో రాజస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో కేకేఆర్ ఓడిపోవాలని ముంబై కోరుకోవాలి. పంజాబ్ కింగ్స్: Courtesy: IPL Twitter ఇప్పటికైతే పంజాబ్ కింగ్స్‌కు ప్లే ఆఫ్స్ అవకాశాలు లేనట్లే. పంజాబ్ 13 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. 8 ఓటములతో 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. పంజాబ్ తన చివరి మ్యాచ్‌ను సీఎస్కేతో ఆడనుంది. సీఎస్కేపై గెలిస్తే పంజాబ్ ఖాతాలో 12 పాయింట్లు ఉంటాయి. అదే సమయంలో కేకేఆర్ రాజస్తాన్ చేతిలో.. ముంబై ఇండియన్స్ ఎస్ఆర్హెచ్ చేతిలో బారీ తేడాతో ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడు నెట్‌రన్‌రేట్ ఆధారంగా పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం సీఎస్కే లాంటి పటిష్టమైన జట్టును పంజాబ్ ఓడించడం అసాధ్యం. కానీ టి20 అంటేనే సంచలనాలకు వేదిక. మరి పంజాబ్ అదృష్టం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. చదవండి: IPL 2021: ధోని భయ్యా.. నాకు బర్త్‌డే గిఫ్ట్ ఏం లేదా రాజస్తాన్ రాయల్స్: Courtesy: IPL Twitter పంజాబ్ కింగ్స్ విషయంలో ఏదైతే జరగాలో అదే రాజస్తాన్ రాయల్స్‌కు వర్తిస్తుంది. అయితే కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లో రాజస్తాన్ బారీ తేడాతో గెలవడమే గాక.. ఎస్ఆర్హెచ్ ముంబై ఇండియన్స్‌ను బారీ తేడాతో చిత్తు చేయాలి. అప్పుడు కూడా రాజస్తాన్ ప్లేఆఫ్స్ చేరుకునే అవకాశాలు అంతంత మాత్రమే. ముంబై ఇండియన్స్ చేతిలో దారుణ పరాజయం రాజస్తాన్ అవకాశాలపై బారీ గండి పడింది. 13 మ్యాచ్‌లాడిన రాజస్తాన్ 5 విజయాలు.. 8 ఓటములతో 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. రాజస్తాన్ నెట్‌రన్‌రేట్ -0.737గా ఉంది. చదవండి: Ishan Kishan: రికార్డుతో పాటు ఫామ్‌లోకి వచ్చాడు.. సంతోషం -
స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న కేకేఆర్ ఆటగాళ్లు.. వీడియో వైరల్
KKR players in the Swimming pool: ఐపీఎల్ 2021 సెకెండ్ ఫేజ్‌లో సన్‌రైజర్స్‌పై విజయం సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవడానికి అడుగు దూరంలో నిలిచింది. ఈ క్రమం లో కేకేఆర్ ఆటగాళ్లు తమ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ను కేకేఆర్ షేర్ చేసింది. ఈ వీడియోలో ఆ జట్టు స్పిన్నర్ అకేల్ హుస్సేన్ ఏరోబిక్స్( డ్యాన్స్ ఎక్సర్ సైజ్) చేస్తుండగా సహచర ఆటగాళ్లు పూల్‌లో తనను అనుకరించారు. దీంట్లో ఆ జట్టు కోచ్ బ్రెండన్ మెకల్లమ్ కూడా పాల్గొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇప్పటి వరకు 13మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో కోలకతా నాల్గవ స్థానంలో ఉంది. ఆ జట్టు విజయాల్లో ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ , స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, గిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా కేకేఆర్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. చదవండి: క్రికెట్ జట్టు వాహనంలో చోరీ.. లబోదిబోమంటున్న ఆసీస్ క్రికెటర్ 𝙅𝙪𝙨𝙩 𝙙𝙤 𝙩𝙝𝙖𝙩 𝙋𝙖𝙖𝙣𝙞 𝙒𝙖𝙡𝙖 𝘿𝙖𝙣𝙘𝙚 😂🎶 Recovery session done quite right ✅#KKR #AmiKKR #KorboLorboJeetbo #আমিKKR #IPL2021 pic.twitter.com/O4iU9SDyio — KolkataKnightRiders (@KKRiders) October 5, 2021 -
ముంబై ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ఉంది: షేన్ బాండ్
Shane Bond Commnets On Mumbai Indians: ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ప్రస్తుత సీజన్లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తుంది. ముఖ్యంగా సెకెండ్ ఫేజ్‌లో ఆడిన 5 మ్యాచుల్లో కేవలం ఒక విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి చెందింది. ఫలితంగా డిఫెండింగ్ ఛాంపియన్ ప్లేఆఫ్ ఛాన్స్‌లు సంక్లిష్టంగా మారాయి. ఈ క్రమంలో జట్టు ఆటతీరుపై ముంబై బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ స్పందించాడు. ఐపీఎల్ 2021లో ముంబైకు ఇంకా ప్లేఆఫ్‌కు ఆర్హత సాధించే అవకాశం ఉందని బాండ్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ సెకెండ్ ఫేజ్‌లో ముంబై ఇండియన్స్ అత్యుత్తమంగా ఆడలేదని బాండ్ అంగీకరించాడు. "మేము ఐపీఎల్ మెదటి దశలో బాగా ఆడాము. మేము ప్రస్తుతం బాగా ఆడడంలేదని తెలుసు, కానీ మేము ఇంకా పోటీలో ఉన్నాము. ఏమి జరుగుతుందో మేము చూస్తాము. మేము ఐదు విజయాలు మాత్రమే సాధించాము, కానీ మా జట్టు రెండు విజయాలు సాధించగలిగితే ఫలితాలు మారవచ్చు అని మ్యాచ్ అనంతరం విలేఖేరల సమావేశంలో షేన్ బాండ్ పేర్కొన్నాడు. 145 పరుగులు సాధించింటే ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై విజయం సాధించేదని అని బాండ్ చెప్పాడు. కాగా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై 10 పాయింట్లతో 7 వ స్థానంలో ఉంది. చదవండి: CSK VS RR: ఫిలిప్స్ ఫన్నీ బ్యాటింగ్ వీడియో.. ‘నోరెళ్లబెట్టిన సామ్’’ -
ఇక చాలు... ఈసారి ముంబై అస్సలు పైకి రావొద్దు: సెహ్వాగ్
Virender Sehwag comments on Mumbai indians: ఐపీఎల్ 2021లో లీగ్ దశ ముగింపుకు చేరుకుంది. ప్లేఆఫ్ స్ధానాలను దక్కించకోవడం కోసం జట్లు మధ్య తీవ్రంగా పోటి నడుస్తోంది. కాగా గత సీజన్లో ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ ఏడాది పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఆ జట్టుపై భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఈ సీజన్లో ముంబై కాకుండా కొత్త జట్టు ఛాంపియన్‌గా అవతరించాలని ఆశిస్తున్నట్లు అతడు తెలిపాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించింన సంగతి తెలిసిందే. కాగా 18 పాయింట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్ధానంలో ఉండగా, 16 పాయింట్లతో ఆర్సీబీ మూడవ స్ధానంలో ఉంది. అయితే నాల్గవ స్థానం కోసం తీవ్రమైన పోటీ కొనసాగుతోంది. "ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలని నేను కోరుకోను. ముంబై స్ధానంలో కొత్త జట్టు అర్హత సాధించాలి. మాకు కొత్త ఛాంపియన్ కావాలి. బెంగుళూరు, ఢిల్లీ లేక పంజాబ్ టైటిల్ గెలవాలి. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. వారు ఇప్పటివరకు ఐదు టైటిల్స్ గెలుచుకున్నారు. ముంబై ఇండియన్స్ వారి మిగిలిన మ్యాచ్‌లను గెలిస్తే, వారు సులభంగా ప్లేఆఫ్‌కు చేరుకోగలరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వారి మిగిలిన మ్యాచ్‌లు గెలిస్తే వారు 16 పాయింట్లు సాధిస్తారు. కానీ అది సులభం కాదు. కొన్నిసార్లు గెలవాలని ఒత్తిడిలో కొన్ని తప్పులు చేస్తారు. ఆ తప్పులు వారి ఓటమికి దారితీస్తాయి" అని సెహ్వాగ్ క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వూలో సెహ్వాగ్ చెప్పాడు. కాగా షార్జా వేదికగా ముంబై ఇండియన్స్ నేడు ఢిల్లీతో తలపడనుంది. ప్రస్తుతం 10 పాయింట్లతో ముంబై ఆరో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: Ravi Bishnoi: నా మీద ఆ ముగ్గురి ప్రభావం గట్టిగా ఉంది.. అందుకే -
జగదీశ సుచిత్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
Jagadeesha Suchith Stunning Catch: ఐపీఎల్ 2021లో వరుస అపజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆప్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. అయితే శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ జగదీశ సుచిత్ స్టన్నింగ్ క్యాచ్‌తో అభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు. మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేసిన జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో దీపక్ హుడా మిడాన్ దిశగా కొట్టిన షాట్‌ను మెరుపు వేగంతో గాల్లోకి ఎగురుతూ సుచిత్ సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్ పట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. చదవండి: హోల్డర్ మెరిసినా... సన్‌రైజర్స్ అవుట్ pic.twitter.com/jvRijSA0pS — Sardar Khan (@SardarK07004661) September 25, 2021 -
ఒక్క ఓవర్లో 33 పరుగులు.. దెబ్బకు ప్లేఆఫ్ బెర్త్
అబుదాబి: పాకిస్తాన్ సూపర్‌లీగ్(పీఎస్ఎల్-6)లో శనివారం కరాచీ కింగ్స్, క్వెటా గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. కరాచీ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్ వరకు ఆ జట్టు స్కోరు 5 వికెట్ల నష్టానికి 136గా ఉంది. కానీ తర్వాతి ఓవర్ ముగిసేసరికి జట్టు స్కోరు 169గా మారింది. దీనికి కారణం.. కరాచీ కింగ్స్ ఆటగాడు దానిష్ ఆజిజ్ పవర్ హిట్టింగ్. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఆజిజ్ 4,6,6,6,6(నో బాల్),2,2 తో విధ్వంసం సృష్టించాడు. అతని ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. దానిష్ ఆజిజ్ (13 బంతుల్లో 45 పరుగులు; 5 సిక్సర్లు, 2 ఫోర్లు)తో టాప్ స్కోరర్‌గా నిలవగా.. షార్జీల్ ఖాన్ 45, వాల్టన్ 34* పరుగులతో అతనికి సహకరించారు. అనంతరం 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన క్వెటా గ్లాడియేటర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులకే పరిమితమై 14 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కాగా ఈ విజయంతో కరాచీ కింగ్స్ ప్లేఆఫ్ బెర్త్ ఖరారు చేసుకోగా.. గ్లాడియేటర్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్ 10 పాయింట్లతో సమానంగా ఉన్నా.. కరాచీతో పోలిస్తే నెట్ రన్‌రేట్ మెరుగ్గా లేకపోవడంతో లాహోర్ ఖలందర్స్ భారంగా టోర్నీని వీడాల్సి వచ్చింది. చదవండి: వార్న్‌కు స్పిన్ పాఠాలు.. నవ్వాపుకోలేకపోయిన సెహ్వాగ్ పీఎస్ఎల్: ఉస్మాన్ ఖవాజా మెరుపు సెంచరీ.. 11 ఏళ్ల రికార్డు బద్దలు What does @idanishaziz think of his score? @MZahed89 asked in our #AwamiPressConference #HBLPSL6 I #QGvKK I #MatchDikhao pic.twitter.com/AR2YDKtweL — PakistanSuperLeague (@thePSLt20) June 19, 2021 -
మొదటి అడుగు ముంబైదే!
మరోసారి అద్భుత ప్రదర్శన నమోదు చేసిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్–2020లో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. జోరుమీదున్న బెంగళూరుకు బుమ్రా బ్రేకులేయగా... సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఇన్నింగ్స్‌తో ముంబైని లక్ష్యఛేదనలో నిలబెట్టాడు. దాంతో ఎనిమిదో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ 16 పాయింట్లతో ఒంటరిగా టాప్ ర్యాంక్‌లోకి వెళ్లింది. అయితే మరో నాలుగు జట్లకూ 16 పాయింట్లు చేరుకునే అవకాశం ఉండటంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. అయితే అన్ని జట్లకంటే ఎంతో మెరుగైన రన్‌రేట్ కలిగిన ముంబై జట్టుకు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయినా ప్లే ఆఫ్ బెర్త్ విషయంలో ఇబ్బంది ఉండకపోవచ్చు. అబుదాబి: డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్లోనూ అదరగొడుతోంది. ఎనిమిదో గెలుపుతో ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. దేవ్‌దత్ (45 బంతుల్లో 74; 12 ఫోర్లు, 1 సిక్స్) చక్కని పోరాటం చేశాడు. జోరుగా సాగే బెంగళూరు ఇన్నింగ్స్‌ను బుమ్రా (3/14) అనూహ్యంగా కట్టడి చేశాడు. తర్వాత ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 79 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) జట్టు గెలిచేదాకా అజేయంగా నిలిచాడు. దేవ్‌దత్ పోరాటం... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు దేవ్‌దత్, జోష్ ఫిలిప్ (24 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) శుభారంభం అందించారు. బౌండరీతో ఖాతా తెరిచిన దేవ్‌దత్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. కృనాల్ మూడో ఓవర్లో వరుసగా 2 ఫోర్లు బాదాడు. తర్వాత ప్యాటిన్సన్ బౌలింగ్‌లోనూ రెండు బౌండరీలు కొట్టాడు. మరో ఓపెనర్ ఫిలిప్... బౌల్ట్ ఓవర్లో భారీ సిక్స్, ఫోర్ కొట్టడంతో పవర్ ప్లేలో (54/0) ఓవర్‌కు 9 పరుగుల రన్‌రేట్ నమోదైంది. ఇలా ధాటిగా సాగిపోతున్న బెంగళూరు జోరుకు ఫిలిప్‌ను ఔట్ చేయడం ద్వారా రాహుల్ చహర్ బ్రేక్ వేశాడు. దీంతో 71 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత కోహ్లి (9) సహా ఎవరూ నిలబడలేదు. పరుగులు జతచేయలేదు. దేవ్‌దత్ మాత్రం 30 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. డివిలియర్స్ (15), దూబే (2), మోరిస్ (4) విఫలమయ్యారు. కోహ్లి ఔట్... రన్‌రేట్ డౌన్ రాయల్ చాలెంజర్స్ ఇన్నింగ్స్ చక్కగా మొదలైంది. పరుగులు చకచకా వచ్చాయి. బౌండరీలతో రన్‌రేట్ ఊపందుకుంది. సిక్సర్లు అరకొరే అయినా వేగం ఎక్కడా తగ్గలేదు. ఇలా దేవ్‌దత్, జోష్ ఫిలిప్‌ల ఓపెనింగ్ జోడి పటిష్టమైన పునాది వేసింది. దీంతో ఒకదశలో అద్భుతంగా బెంగళూరు ఇన్నింగ్స్ సాగిపోయింది. ఫిలిప్ ఔటయినపుడు జట్టు స్కోరు 71. కోహ్లి వెనుదిరిగినపుడు వందకు చేరువైంది. 11.2 ఓవర్లలో బెంగళూరు 2 వికెట్ల నష్టానికి 95 పరుగులు. కానీ అనూహ్యంగా కోహ్లి వికెట్‌తో పాటే బెంగళూరు ఇన్నింగ్స్ పతనమైంది. పరుగుల రాక కష్టమైంది. దాంతో బెంగళూరు జట్టు చివరి 5 ఓవర్లలో 35 పరుగులే చేసింది. ‘సూర్య’ కిరణాలు బెంగళూరులాగే ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ ఆడారు. అక్కడ... ఇక్కడ... ఆడింది ఒక్కరే! సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇన్నింగ్స్ అసాంతం నిలబడి... బెంగళూరు బౌలర్లతో తలపడి జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. ఓపెనర్లు డికాక్ (18), ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) ఎంతో సేపు నిలువలేదు. పవర్ ప్లేలోనే డికాక్ ఔట్కాగా... కాసేపటికే ఇషాన్ కిషన్ వికెట్ సమర్పించుకున్నాడు. తర్వాత వచ్చిన వారిలో సౌరభ్ తివారి (5), పాండ్యా బ్రదర్స్ కృనాల్ (10), హార్దిక్ (15) పెద్దగా స్కోర్లు చేయలేదు. కానీ వీళ్లు చేసిన ఈ కాసిన్ని పరుగులకు సూర్య కుమార్ మెరుపులు జతకావడంతో లక్ష్యం ఏ దశలోనూ కష్టమవలేదు. ఆద్యంతం ధాటిగా ఆడిన అతను 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. చహల్ ఓవర్లలో సిక్స్‌లు బాదిన ప్రత్యర్థి జట్టుకు చెందిన ప్రతి బౌలర్‌ను సాధికారికంగా ఎదుర్కొన్నాడు. చేయాల్సిన పరుగుల రన్‌రేట్ పెరిగిపోకుండా జాగ్రత్తపడ్డాడు. 17వ ఓవర్ వేసిన మోరిస్ 8 పరుగులు ఇవ్వడంతో ఆఖరి మూడు ఓవర్లలో 18 బంతుల్లో 27 పరుగులుగా సమీకరణం మారింది. అయితే స్టెయిన్ 18వ ఓవర్లో యాదవ్ సిక్స్ కొట్టడం ద్వారా 11 పరుగులు రాబట్టాడు. తర్వాత ఓవర్లో సిక్స్ కొట్టిన హార్దిక్ ఔటైనప్పటికీ పొలార్డ్ 4 బాదడంతో 13 పరుగులు వచ్చాయి. దీంతో 6 బంతుల్లో 3 పరుగులు చేయాల్సిన దశలో సిరాజ్ వేసిన ఆఖరి ఓవర్ తొలి బంతినే యాదవ్ బౌండరీకి తరలించడంతో ముంబై విజయం సాధించింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: జోష్ ఫిలిప్ (స్టంప్డ్) డికాక్ (బి) రాహుల్ చహర్ 33; దేవదత్ పడిక్కల్ (సి) బౌల్ట్ (బి) బుమ్రా 74; కోహ్లి (సి) సౌరభ్ తివారీ (బి) బుమ్రా 9; డివిలియర్స్ (సి) రాహుల్ చహర్ (బి) పొలార్డ్ 15; శివమ్ దూబే (సి) సూర్యకుమార్ (బి) బుమ్రా 2; మోరిస్ (సి) ప్యాటిన్సన్ (బి) బౌల్ట్ 4; గురుకీరత్ సింగ్ (నాటౌట్) 14; వాషిం్టగ్టన్ సుందర్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–71, 2–95, 3–131, 4–134, 5–134, 6–138. బౌలింగ్: బౌల్ట్ 4–0–40–1, బుమ్రా 4–1–14–3, కృనాల్ 4–0–27–0, ప్యాటిన్సన్ 3–0–35–0, రాహుల్ చహర్ 4–0–43–1, పొలార్డ్ 1–0–5–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) గురుకీరత్ (బి) సిరాజ్ 18; ఇషాన్ కిషన్ (సి) మోరిస్ (బి) చహల్ 25; సూర్యకుమార్ (నాటౌట్) 79; సౌరభ్ తివారీ (సి) పడిక్కల్ (బి) సిరాజ్ 5; కృనాల్ (సి) మోరిస్ (బి) చహల్ 10; హార్దిక్ (సి) సిరాజ్ (బి) మోరిస్ 17; పొలార్డ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.1 ఓవర్లలో 5 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–37, 2–52, 3–72, 4–107, 5–158. బౌలింగ్: మోరిస్ 4–0–36–1, స్టెయిన్ 4–0–43–0, సుందర్ 4–0–20–0, సిరాజ్ 3.1–0–28–2, చహల్ 4–0–37–2. -
ఫస్ట్ ఆఫ్‌లో హిట్..సెకండాఫ్‌లో అట్టర్‌ఫ్లాప్
-
ఇది కచ్చితంగా ప్రత్యేకం: కోహ్లి
సాక్షి, న్యూఢిల్లీ: డూ ఆర్ డై స్థితిలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై విజయంతో ప్లే ఆఫ్ అవకాశాలను నిలుపుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కోహ్లి-డివిలియర్స్ భాగస్వామ్యం(118 పరుగులు)తో శనివారం ఫిరోజ్ షా కోట్లా మైదానంలో పరుగుల వరద పారింది. మరో ఓవర్ మిగిలి ఉండగానే డీడీపై ఆర్సీబీ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ క్రెడిట్‌ను డివిలియర్స్‌కు కట్టబెట్టాడు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్ అనంతరం తన ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లి డివిలియర్స్‌తో ఉన్న ఓ ఫోటోను ఉంచాడు. ‘ఇతనితో(డివిలియర్స్) బ్యాటింగ్ చేయటాన్ని ఆస్వాదిస్తాను. అవతలి ఎండ్‌లో ఇతగాడు ఉంటే పని చాలా సులువైపోతుంది. ఈరోజు విజయతీరాలకు చేర్చిన మరో ప్రత్యేకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాం’ అంటూ డివిలియర్స్‌పై కోహ్లి పొగడ్తలు గుప్పించాడు. డేర్ డెవిల్స్ విధించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డివిలియర్స్ (37 బంతుల్లో 72 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), కోహ్లి (40 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. గౌరవంగా భావిస్తా... ఇక మ్యాచ్ అనంతరం కోహ్లి మీడియాతో మాట్లాడుతూ... ‘ఏబీతో కలిసి క్రీజులో ఉండటం గౌరవంగా భావిస్తాను. అతనో అద్భుతమైన ఆటగాడు. నెట్ రన్‌రేట్‌ను దృష్టిలో ఉంచుకుని మేం వేగంగా మ్యాచ్‌ను ముగించాలనుకున్నాం. కానీ, పాయింట్లు కీలకం. మనం గెలిచి తీరతామని ఏబీ నాతో అన్నాడు. అందుకే చివర్లో నిదానంగా ఆడాం. మేం నెలకొల్పిన భాగస్వామ్యంలో ఇది కచ్చితంగా ప్రత్యేకం’ అని కోహ్లి తెలిపాడు. కాగా, ఈ సీజన్లో 11 మ్యాచ్‌లాడిన ఆర్సీబీకి ఇది నాలుగో విజయం మాత్రమే. ఈ ఓటమితో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించింది. ఇక ఆర్సీబీ, ప్లే ఆఫ్‌కి చేరుకోవాలంటే మిగతా మ్యాచ్‌లు తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంటుంది. మరోవైపు నెట్ రన్‌రేట్ కూడా పాయింట్ల పట్టికపై ప్రభావం చూపనుంది. Have always loved batting with this guy. Makes things simpler for the person at the other end. Today was yet another special partnership. Glad to finish on a winning note. #DDvRCB #IPL2018 @ABdeVilliers17 A post shared by Virat Kohli (@virat.kohli) on May 12, 2018 at 11:39am PDT -
రేసులో నిలిచారు
ముంబై మరో విజయం ఢిల్లీకి వరుసగా ఎనిమిదో ఓటమి హస్సీ అర్ధ సెంచరీ ముంబై: ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తమకు మిగిలిన రెండు మ్యాచ్‌లను తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ముంబై ఓ అడుగు ముందుకేసింది. మైక్ హస్సీ (33 బంతుల్లో 56; 7 ఫోర్లు; 2 సిక్సర్లు) మెరుపులకు తోడు లెండిల్ సిమ్మన్స్ (25 బంతుల్లో 35; 5 ఫోర్లు) నిలకడ తోడవ్వడంతో శుక్రవారం వాంఖడే మైదానంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌ను 15 పరుగుల తేడాతో నెగ్గింది. ఓదశలో 12 ఓవర్లలోనే 120 పరుగులు సాధించిన ముంబైని డేర్‌డెవిల్స్ బౌలర్లు కట్టడి చేసినా... ఢిల్లీ బ్యాట్స్‌మెన్ సద్వినియోగం చేసుకోలేకపోయారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు మైక్ హస్సీకి దక్కింది. అటు రాజస్థాన్ జట్టు పంజాబ్ చేతిలో ఓడిపోవడంతో ముంబైకి అవకాశాలు మిగిలాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన 19.3 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు హస్సీ, సిమ్మన్స్ వేగంగా ఆడడంతో తొలి వికెట్‌కు 87 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత రోహిత్ శర్మ (21 బంతుల్లో 30; 4 ఫోర్లు) ఒక్కడే కాస్త మెరుగ్గా ఆడాడు. మిడిల్ ఓవర్లలో ఢిల్లీ బౌలర్ల ఆధిపత్యం ముందు ముంబై తేలిపోయింది. స్పిన్నర్ తాహిర్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 158 పరుగులు చేసి ఓడింది. కెప్టెన్ పీటర్సన్ (31 బంతుల్లో 44; 6 ఫోర్లు; 1 సిక్స్) తమ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించాడు. మనోజ్ తివారి (31 బంతుల్లో 41; 5 ఫోర్లు; 1 సిక్స్), డుమిని (29 బంతుల్లో 45 నాటౌట్; 4 సిక్సర్లు) తమ ఆటతీరుతో విజయంపై కాస్త ఆశ రేకెత్తించారు. అయితే 19వ ఓవర్లో డి లాంజ్.. తివారిని అవుట్ చేయడంతో ముంబై ఊపిరి పీల్చుకుంది. డి లాంజ్‌కు రెండు వికెట్లు దక్కాయి. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సిమ్మన్స్ (సి) పార్నెల్ (బి) తాహిర్ 35; హస్సీ (రనౌట్) 56; రోహిత్ (బి) ఉనాద్కట్ 30; పొలార్డ్ (సి) కార్తీక్ (బి) ఉనాద్కట్ 11; రాయుడు (సి) విజయ్ (బి) నదీమ్ 2; తారే (సి) జాదవ్ (బి) తాహిర్ 14; హర్భజన్ (సి) విజయ్ (బి) పార్నెల్ 2; గోపాల్ (రనౌట్) 11; డి లాంజ్ (సి) కార్తీక్ (బి) తాహిర్ 1; ఓజా (రనౌట్) 2; బుమ్రా నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 173. వికెట్ల పతనం: 1-87; 2-120; 3-140; 4-141; 5-151; 6-157; 7-161; 8-168; 9-171; 10-173. బౌలింగ్: పార్నెల్ 3.3-0-26-1; కౌల్ 2-0-21-0; ఉనాద్కట్ 2-0-24-2; నదీమ్ 4-0-28-1; డుమిని 4-0-31-0; తాహిర్ 4-0-37-3. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: విజయ్ (స్టంప్డ్) తారే (బి) గోపాల్ 8; పీటర్సన్ (బి) హర్భజన్ 44; దినేశ్ కార్తీక్ (బి) డి లాంజ్ 7; తివారి (సి) హస్సీ (బి) డి లాంజ్ 41; డుమిని నాటౌట్ 45; జాదవ్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1-43; 2-59; 3-61; 4-146. బౌలింగ్: బుమ్రా 4-0-36-0; డి లాంజ్ 4-0-32-2; ఓజా 4-0-33-0; గోపాల్ 3-0-20-1; హర్భజన్ 4-0-30-1; పొలార్డ్ 1-0-4-0. -
రంజుగా ప్లే ఆఫ్ రేసు
పంజాబ్, చెన్నైలకు ఇప్పటికే అర్హత రాజస్థాన్, కోల్‌కతాలకు మెరుగైన అవకాశాలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కీలక దశకు చేరుకుంది. లీగ్‌లో 56 మ్యాచ్‌లకు గాను 48 మ్యాచ్‌లు ముగిశాయి. ఇంకా ఎనిమిది మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే ఏడో సీజన్లో ఎవరూ ఊహించని విధంగా సంచలన విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇంతకుముందే ప్లే ఆఫ్ దశకు చేరుకుంది. మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్లే ఆఫ్ బెర్తును ఖరారు చేసుకుంది. ఢిల్లీకి ఎలాంటి అవకాశాలు లేవు. ఇక మిగిలిన రెండు బెర్తుల కోసం ఐదు జట్లు పోటీపడుతున్నాయి. దీంతో ప్లే ఆఫ్ రేసు ఆసక్తికరంగా మారింది. ఆయా జట్ల ప్రస్తుత స్థితి... - సాక్షి క్రీడావిభాగం రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం: 12 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లు ఆడాల్సినవి: 23న పంజాబ్ (మొహాలీలో)తో, 25న ముంబై (వాంఖడేలో)తో ప్లే ఆఫ్ అవకాశాలు: రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒకటి నెగ్గినా రాజస్థాన్ రాయల్స్ తదుపరి దశకు సమీకరణాలతో సంబంధం లేకుండానే అర్హత సాధిస్తుంది. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ రెండు మ్యాచ్‌ల్లో ఓడితే అప్పుడు నెట్ రన్‌రేట్ కీలకమవుతుంది. రెండు మ్యాచ్‌ల్లో ఓడటం ద్వారా రాజస్థాన్ రన్‌రేట్ మరింతగా పడిపోతుంది. లేదంటే బెంగళూరు, హైదరాబాద్, ముంబై జట్లు ఒక్కో మ్యాచ్‌లో ఓడిపోవాలి. కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రస్తుతం: 12 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లు మిగిలిన మ్యాచ్‌లు: 22న బెంగళూరు (ఈడెన్‌లో)తో, 24న హైదరాబాద్ (ఈడెన్‌లో)తో ప్లే ఆఫ్ అవకాశాలు: కనీసం ఒక్క మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్ చేరుతుంది. ఒకవేళ రెండూ ఓడితే బెంగళూరు, హైదరాబాద్, ముంబై జట్లు ఒక్కో మ్యాచ్‌లో ఓడాలి. ముంబై ఇండియన్స్ ప్రస్తుతం: 12 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు మిగిలిన మ్యాచ్‌లు: 23న ఢిల్లీతో, 25న రాజస్థాన్‌తో (రెండు వాంఖడేలోనే) ప్లే ఆఫ్ అవకాశాలు: చివరి రెండు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాలి. రన్‌రేట్ కూడా మెరుగుపడాలి. అలాగే హైదరాబాద్, బెంగళూరు జట్లు తప్పనిసరిగా ఒక్కో మ్యాచ్‌లో ఓడాలి. రాజస్థాన్, కోల్‌కతాలలో ఒక జట్టు రెండు మ్యాచ్‌లు ఓడాలి. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ప్రస్తుతం: 12 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు మిగిలిన మ్యాచ్‌లు: 22న కోల్‌కతా (ఈడెన్‌లో)తో, 24న చెన్నై (బెంగళూరులో)తో ప్లే ఆఫ్ అవకాశాలు: చివరి రెండు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాలి. అదే సమయంలో తనకన్నా మెరుగైన స్థానంలో ఉన్న రాజస్థాన్, కోల్‌కతా జట్లలో ఏదైనా ఒక జట్టు తాను ఆడే రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవాలి. అదే సమయంలో హైదరాబాద్, ముంబై జట్లు ఒక్కో మ్యాచ్‌లో అయినా ఓడిపోవాలి. బెంగళూరు రన్‌రేట్ కూడా మెరుగుపడాలి. హైదరాబాద్ సన్‌రైజర్స్ ప్రస్తుతం: 12 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు మిగిలిన మ్యాచ్‌లు: 22న చెన్నై (రాంచీలో)తో, 24న కోల్‌కతా (ఈడెన్‌లో)తో ప్లే ఆఫ్ అవకాశాలు: తదుపరి దశకు చేరాలంటే మిగిలిన రెండు లీగ్ మ్యాచ్‌ల్లో గెలుపుతో పాటు రేసులో ఉన్న మిగిలిన జట్ల ఫలితాలపై సన్‌రైజర్స్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. 14 పాయింట్లు సాధించిన రాజస్థాన్, కోల్‌కతా జట్లలో ఏదైనా ఒక జట్టు తాను ఆడే రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవాలి. అదే సమయంలో బెంగళూరు, ముంబై జట్లు కచ్చితంగా ఒక్కో మ్యాచ్‌లో ఓడాలి. హైదరాబాద్ రన్‌రేట్ కూడా మెరుగుపడాలి.