ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జూలు విదిల్చింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది.
ఈ విజయంతో ఆర్సీబీ తమ రన్‌రేట్‌ను భారీగా మెరుగుపరుచుకుని పాయింట్ల పట్టికలో ఐదో స్ధానానికి చేరుకుంది. దీంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగుపడ్డాయి.
ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే?
ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 12 పాయింట్లతో ఐదో స్ధానంలో కొనసాగుతోంది. ఆ జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధిస్తే సీఎస్‌కేతో పాయింట్ల పరంగా సమమవుతోంది. ఆర్సీబీ విజయంతో పాటు తమ రన్‌రేట్‌ను కూడా మెరుగు పరుచుకోవాలి.
ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేస్తే 18 పరుగుల తేడాతో విజయం సాధించాలి. అదే ఛేజింగ్‌లో అయితే 18.1 ఓవర్లలోనే మ్యాచ్‌ను ఫినిష్ చేయాలి. ఈ క్రమంలో సీఎస్‌కే(+0.528) కంటే ఆర్సీబీ మెరుగైన రన్‌రేట్(+0.387) సాధించి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తోంది. అంతేకాకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఓడాలి.
Comments
Please login to add a commentAdd a comment