ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక సమరంలో ఓడి, ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ పంత్ ఉదాసీనంగా వ్యవహరించి ముంబైని దగ్గరుండి మరీ గెలిపించాడని ధ్వజమెత్తాడు. టిమ్ డేవిడ్ డీఆర్‌ఎస్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంత్.. ఆర్సీబీకి (ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు)పరోక్షంగా సహకరించాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Dehli Capital didn't review this against mighty Tim David and that could have cost them the play-off spot, oh dear! #MIvDC #DCvMI #IPL2022 pic.twitter.com/zv1Cu5Os2M
— Ahmad Haseeb (@iamAhmadhaseeb) May 21, 2022
అవకాశమున్నా పంత్ సమీక్షను తీసుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టాడు. 2 సమీక్షలు మిగిలి ఉన్నా పంత్ కామన్ సెన్స్ ఉపయోగించలేకపోయాడని, అతని మైండ్ దొబ్బిందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ సరైన నిర్ణయం తీసుకోలేకపోతే పక్కనున్న ఆటగాళ్లైనా సలహా ఇవ్వాల్సిందని, కానీ వారు కూడా తమకేమీ పట్టలేదన్నట్లుగా వ్యవహరించారని దుయ్యబట్టాడు. ఢిల్లీ ఆటగాళ్లంతా ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ బెర్తును బంగారు పళ్లెంలో పెట్టి అందించారని అన్నాడు.
కాగా, ముంబైతో జరిగిన మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ తొలి బంతికే క్యాచ్ ఔట్ కావాల్సింది. కానీ, రిషబ్ పంత్ డీఆర్‌ఎస్ తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించడంతో టిమ్ బయటపడ్డాడు. అనంతరం టిమ్ సుడిగాలి ఇన్నింగ్స్ (11 బంతుల్లోనే 34 పరుగులు) ఆడి ఢిల్లీ చేతుల్లోనుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ఫలితంగా ఢిల్లీ ఇంటికి, ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరాయి.
చదవండి: టీమిండియాలోకి డీకే.. రీ ఎంట్రీపై ఆసక్తికర ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment