IPL 2023, LSG Vs MI: Mohsin Khan Terrific Final Over Hands LSG 5-Run Win Over MI - Sakshi
Sakshi News home page

Mohsin Khan: లక్నో విజయం.. ఒక్క ఓవర్‌తో హీరో అయిపోయాడు

Published Tue, May 16 2023 11:50 PM | Last Updated on Wed, May 17 2023 8:30 AM

Mohsin Khan-Bowled Last Over-Given-Just 6 Runs Crucial Win-LSG Vs MI - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో మరో థ్రిల్లింగ్‌ మ్యాచ్‌ జరిగింది. ముంబై ఇండియన్స్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ ఆద్యంతం ఉత్కంఠను కలిగించింది. టిమ్‌ డేవిడ్‌ 18 బంతుల్లో 30 పరుగులతో సంచలన ఇన్నింగ్స్‌తో ముంబైని గెలిపిస్తాడనుకున్నారు. ఈ తరుణంలో ఒక్క ఓవర్‌తో అంతా తారుమారు చేసి హీరో అయ్యాడు లక్నో బౌలర్‌ మోసిన్‌ ఖాన్‌.

మోసిన్‌ ఖాన్‌ బౌలింగ్‌ రావడానికి ముందు నవీన్‌ ఉల్‌ హక్‌ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో 18 పరుగులు వచ్చాయి. దీంతో చివరి ఓవర్‌లో ముంబై విజయానికి 6 బంతుల్లో 11 పరుగులు అవసరమయ్యాయి. ఇక ముంబై విజయం లాంచనమే అనుకున్న తరుణంలో మోసిన్‌ ఖాన్‌ అద్బుత యార్కర్లతో చెలరేగాడు.

11 పరుగులు అవసరమైన దశలో అద్బుత యార్కర్లతో కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చుకొని లక్నోకు సంచలన విజయాన్ని కట్టబెట్టాడు. ఈ విజయంతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ప్లేఆఫ్‌ ఆశలు సజీవంగా ఉన్నాయి. చివరి మ్యాచ్‌లో గెలిస్తే లక్నో ప్లేఆఫ్‌లో అడుగుపెట్టడం ఖాయం.

చదవండి: ప్రతీసారి మనది కాదు సూర్య.. జాగ్రత్తగా ఆడాల్సింది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement