MI Vs LSG, IPL 2023 Eliminator: Akash Madhwal's Fifer Breaks IPL Records - Sakshi
Sakshi News home page

MI VS LSG Eliminator: చరిత్ర సృష్టించిన ఆకాశ్‌ మధ్వాల్‌.. ఒక్క దెబ్బకు ఎన్ని రికార్డులో..!

Published Thu, May 25 2023 9:43 AM | Last Updated on Thu, May 25 2023 9:53 AM

IPL 2023 Eliminator MI VS LSG: Akash Madhwal With Fifer Breaks IPL Records - Sakshi

PC: IPL Twitter

లక్నో సూపర్‌ జెయింట్స్‌తో నిన్న (మే 24) జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్ గణాంకాలు (3.3-0-5-5) నమోదు చేసిన ముంబై బౌలర్‌ ఆకాశ్‌ మధ్వాల్‌.. ఈ ఒక్క ఫీట్‌తో పలు ఐపీఎల్‌ రికార్డులు బద్దలు కొట్టాడు. ఆ వివరాలేంటో చూద్దాం..

ఐపీఎల్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌

  • ఆకాశ్‌ మధ్వాల్‌ (5/5)
  • అంకిత్‌ రాజ్‌పుత్‌ (5/14, పంజాబ్‌ 2018),
  • వరుణ్‌ చక్రవర్తి (5/20, కేకేఆర్‌ 2020),
  • ఉమ్రాన్‌ మాలిక్‌ (5/25, సన్‌రైజర్స్‌ 2022)

ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌లో అత్యుత్తమ గణాంకాలు

  • ఆకాశ్‌ మధ్వాల్‌ (5/5)
  • డౌగ్‌ బొలింగర్‌ (4/13)
  • జస్ప్రీత్‌ బుమ్రా (4/14)
  • ధవల్‌ కులకర్ణి (4/14)

ఐపీఎల్‌లో అతి తక్కువ ఎకానమీతో 5 వికెట్లు

  • ఆకాశ్‌ మధ్వాల్‌ (5/5, 1.4 ఎకానమీ)
  • అనిల్‌ కుంబ్లే (5/5, 1.57, 2009)
  • జస్ప్రీత్‌ బుమ్రా (5/10, 2.50, 2022)

ఐపీఎల్‌లో అత్యుత్తమ గణాంకాలు

  • అల్జరీ జోసఫ్‌ (6/12)
  • సోహైల్‌ తన్వీర్‌ (6/14)
  • ఆడమ్‌ జంపా (6/19)
  • అనిల్‌ కుంబ్లే (5/5)
  • ఆకాశ్‌ మధ్వాల్‌ (5/5)

కాగా, నిన్నటి మ్యాచ్‌లో లక్నోపై ముంబై 81 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కామెరాన్‌ గ్రీన్‌ (23 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (20 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం లక్నో 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. స్టొయినిస్‌ (27 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా అంతా విఫలమయ్యారు. కనీసం పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయిన లక్నో 21 బంతుల ముందే కుప్పకూలింది.

చదవండి: ముంబై ఆనందం ‘ఆకాశ’మంత...


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement