Akash Madhwal
-
హార్దిక్‌ను పట్టించుకోని ఆకాశ్.. రోహిత్ మాట విని అలా ఆఖరికి!
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్- ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ఆఖరి వరకు ఉత్కంఠ రేపింది. చివరి ఓవర్ వరకు ఇరు జట్ల మధ్య ఊగిసలాడిన విజయం ఆఖరికి ముంబై వైపు మొగ్గు చూపింది. ఫలితంగా హార్దిక్ సేన ఈ సీజన్లో ఎట్టకేలకు మూడో విజయం అందుకుంది. అయితే, గురువారం నాటి ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్లో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. కాగా చంఢీగడ్‌లోని ముల్లన్పూర్ వేదికగా సొంత మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సూర్యకుమార్ యాదవ్ అర్ధ శతకం(78) సాధించగా.. రోహిత్ శర్మ (36), తిలక్ వర్మ(18 బతుల్లో 34-నాటౌట్) రాణించడంతో ముంబై మెరుగైన స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 192 పరుగులు సాధించింది. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే చతికిలపడ్డ పంజాబ్ కింగ్స్ 14/4 స్కోరుతో తేలికగా మ్యాచ్‌ను ముంబైకి అర్పించేసుకుంటుంది అనిపించింది. కానీ పంజాబ్ హీరోలు శశాంక్ సింగ్(25 బంతుల్లో 41), అశుతోశ్ శర్మ(61) అంత తేలికగా తలవంచలేదు. ముంబైకి చెమటలు పట్టిస్తూ ఓ దశలో మ్యాచ్‌ను పంజాబ్ వైపు తిప్పేశారు. టెయిలెండర్ హర్‌ప్రీత్ బ్రార్(21) పట్టుదలగా పోరాడాడు. అయితే, హర్షల్ పటేల్(1 నాటౌట్)తో పాటు కగిసో రబడ క్రీజులో ఉన్న తరుణంలో ఆఖరి ఓవర్లో పంజాబ్ విజయ సమీకరణం 12 పరుగులుగా మారింది. ఈ క్రమంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేసర్ ఆకాశ్ మధ్వాల్ చేతికి బంతినిచ్చాడు. చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో.. తీవ్ర ఒత్తిడి నడుమ ఆకాశ్ మధ్వాల్ ఫీల్డ్ సెట్ చేసే సమయంలో మాజీ సారథి రోహిత్ శర్మ వద్దకు వెళ్లి సలహాలు తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నా పట్టించుకోని ఆకాశ్ మధ్వాల్.. రోహిత్‌తో చాలా సేపు చర్చించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. ‘మాస్టర్ మైండ్’ రోహిత్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆకాశ్ మధ్వాల్‌ను ఆది నుంచి ఎంకరేజ్ చేసింది రోహిత్ శర్మనే అంటూ గుర్తుచేస్తున్నారు. My guy, Madhwal was trying his best not to look at Hardik 😭😭😭 pic.twitter.com/DlWlHj2BV7 — ab (rohit's version) (@ydisskolaveridi) April 18, 2024 ఇక మధ్వాల్ బౌలింగ్‌లో ఫీల్డ్ సెట్ చేసే విషయంలో అలాగే జస్ప్రీత్ బుమ్రా సైతం తన వంతు సాయం అందించాడు. ఇక పంజాబ్ ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్ వేసిన మధ్వాల్ బౌలింగ్‌లో తొలి బంతి వైడ్‌గా వెళ్లగా.. రెండో బంతికి రబడ రనౌట్ కావడం(మహ్మద్ నబీ/ఇషాన్ కిషన్)తో పంజాబ్ కథ ముగిసిపోయింది. ముంబై తొమ్మిది పరుగుల తేడాతో గెలుపొంది ఊపిరి పీల్చుకుంది. During last over Akash Madhwal ignored hardik and listening to Ro and setting the Field 😂😂#RohitSharma #RohitSharma #MumbaiIndians #MumbaiIndians #MumbaiMeriJaan #IPLonJioCinema #IPL2024 #IPL #IPLOnStar #IPL2024live #IPLFanWeekOnStar #IPLUpdates #MIvsPBKS #MIvsPBKS #IPLUpdates pic.twitter.com/gcfwrduSSV — Rohit Sharma ( Pranta Mondal ) (@PrantaMondal110) April 18, 2024 An absolute rollercoaster of a game in Mullanpur comes to an end! 🎢 And it's the Mumbai Indians who emerge victorious in a nerve-wracking contest 🔥👏 Scorecard ▶️ https://t.co/m7TQkWe8xz#TATAIPL | #PBKSvMI pic.twitter.com/sLKVcBm9oy — IndianPremierLeague (@IPL) April 18, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పాతికేళ్లకు క్రికెట్ ఏంట్రీ.. ఇంజనీర్ T20 బౌలర్
-
అతడి బౌలింగ్ చూస్తుంటే నాకు షమీ గుర్తుకు వచ్చాడు: భారత మాజీ బ్యాటర్
IPL 2023- Akash Madhwal: ముంబై ఇండియన్స్ బౌలర్ ఆకాశ్ మధ్వాల్పై టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించాడు. అతడి బౌలింగ్ స్టైల్ భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీని గుర్తుకు తెచ్చిందన్నాడు. కీలక మ్యాచ్‌లో ఎంతో పరిణతి కలిగిన పేసర్లా అద్భుతంగా రాణించి ముంబైని గెలిపించాడని కొనియాడాడు. ఆకాశమే హద్దుగా ఆకాశ్ విజృంభణ ఐపీఎల్-2023 ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్- ముంబై ఇండియన్స్ బుధవారం తలపడ్డాయి. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ సేన తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అద్భుత: ఇక లక్ష్య ఛేదనకు దిగిన లక్నోకు ఆరంభంలోనే చుక్కలు చూపించాడు ఆకాశ్ మధ్వాల్. ఓపెనర్ ప్రేరక్ మన్కడ్‌ను పెవిలియన్‌కు పంపి ముంబైకి శుభారంభం అందించాడు. అదే జోరులో మరో నాలుగు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 3.3 ఓవర్లు బౌల్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు కూల్చి సంచలన ప్రదర్శనతో ముంబైని విజయతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. లక్నో మీద గెలుపుతో ఐపీఎల్-2023లో రోహిత్ సేన మరో ముందడుగు వేసింది. క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. షమీ గుర్తుకొచ్చాడు ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. ‘‘ఆకాశ్ మధ్వాల్ సరైన లైన్‌అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశాడు. అతడి బౌలింగ్ శైలి నాకు మహ్మద్ షమీని గుర్తు చేసింది. అద్భుతమైన పేసర్. ముంబైకి కాస్త ఆలస్యంగానైనా దొరికిన ఆణిముత్యం. ప్రతి మ్యాచ్‌లోనూ మెచ్యూర్‌గా బౌలింగ్ చేశాడు’’ అని ముంబై పేస్ సంచలనం ఆకాశ్‌ను కొనియాడాడు. ముంబై క్వాలిఫయర్ చేరడారికి కారణం అతడే: పఠాన్ ఇక మరో భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ సైతం.. ‘‘ఇలాంటి కీలక మ్యాచ్‌లో అన్క్యాప్డ్ ప్లేయర్ ఇంత అద్భుతంగా ఆడటం మునుపెన్నడూ చూడలేదు. గత రెండు మ్యాచ్‌లలోనే 9 వికెట్లు తీశాడు. ముంబైని క్వాలిఫయర్‌కు చేర్చిన ఘనత ఆకాశ్‌కే దక్కుతుంది’’ అని ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా ఉత్తరాఖండ్‌కు చెందిన ఆకాశ్ మధ్వాల్ ఐపీఎల్-2023 ద్వారా అరంగేట్రం చేశాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన అతడు 13 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. మే 26 నాటి క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. చదవండి: సీబీఐ డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్.. తెరమీదకు మయాంక్ అగర్వాల్ పేరు! కారణం? Ind vs Aus: ఆసీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్.. ప్రాక్టీస్ షురూ చేసిన టీమిండియా 🖐️/ 🖐️ Akash Madhwal 🤌with his first 5 wicket haul seals victory for @mipaltan in the #Eliminator 🔥#IPLonJioCinema #TATAIPL #IPL2023 #LSGvMI pic.twitter.com/MlvIYTlKev — JioCinema (@JioCinema) May 24, 2023 Madhwal lays a brick wall 🧱 in #LSG's path!#LSGvMI #IPLonJioCinema #TATAIPL | @mipaltan pic.twitter.com/bdwufzzSeX — JioCinema (@JioCinema) May 24, 2023 -
ఆర్సీబీలో నెట్‌బౌలర్‌గా ఉన్నా... ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు! కానీ ఇప్పుడు..
IPL 2023 LSG Vs MI- Akash Madhwal: ‘‘2019లో ఆర్సీబీలో నెట్ బౌలర్‌గా చేరాను. అక్కడ నాకు ఆడే అవకాశం రాలేదు. తర్వాత ముంబై ఇండియన్స్‌కు మారాను. ఇక్కడ నాకు అనేక ఛాన్స్‌లు ఇచ్చారు’’ అని ముంబై బౌలర్ ఆకాశ్ మధ్వాల్ అన్నాడు. ఎంఐ యాజమాన్యం తనకు పూర్తి మద్దతుగా నిలిచిందని పేర్కొన్నాడు. ఆర్సీబీ వదులుకుంది కాగా ఉత్తరాఖండ్‌కు చెందిన రైట్ ఆర్మ్ పేసర్ ఆకాశ్‌ను ఆర్సీబీ 2021లో కొనుగోలు చేసింది. కానీ అతడికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఈ క్రమంలో 2022 వేలంలో ఆకాశ్ మధ్వాల్ తన పేరు నమోదు చేసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఒక్క ఫ్రాంఛైజీ కూడా అతడిపై ఆసక్తి చూపకపోవడంతో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ముంబై అవకాశమిచ్చింది ఈ నేపథ్యంలో ఐపీఎల్-2022 సీజన్లో ముంబై ఇండియన్స్ రూపంలో అదృష్టం అతడి తలుపు తట్టింది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో జట్టులోకి వచ్చిన అతడికి ఆ ఎడిషన్‌లో అవకాశం ఇవ్వకపోయినప్పటికీ.. మినీ వేలం-2023కి ముందు 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది ముంబై. ఈ క్రమంలో ఐపీఎల్-2023లో పంజాబ్ కింగ్స్‌తో మొహాలీలో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు ఆకాశ్ మధ్వాల్. తొలి మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసి 37 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక సీజన్లో ఇప్పటి వరకు మొత్తంగా 7 మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కించుకున్న అతడు మొత్తంగా 13 వికెట్లు పడగొట్టాడు. . PC: IPL Twitter అత్యుత్తమ గణాంకాలతో రికార్డులు ముఖ్యంగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించి ‘ముంబై హీరో’గా అవతరించాడు. చెన్నైలో బుధవారం నాటి మ్యాచ్‌లో 3.3 ఓవర్లలో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి అత్యుత్తమ గణాంకాలతో రికార్డులు సృష్టించాడు. ఈ నేపథ్యంలో ముంబై క్వాలిఫయర్-2కు అర్హత సాధించడంలో కీలకంగా మారిన ఆకాశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. నా బలం అదే.. రోహిత్ భయ్యా అండగా నిలబడ్డాడు ఇక అద్భుత స్పెల్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా అనంతరం ఆకాశ్ మధ్వాల్ మాట్లాడుతూ.. ముంబైకి ఆడటం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. సారథి రోహిత్ శర్మకు తన సేవలు ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు కాబట్టే లక్నోతో మ్యాచ్‌లో అనుకున్న ఫలితం రాబట్టామని పేర్కొన్నాడు. ‘‘యార్కర్లు వేయడం నా బలం. ఈ విషయం గురించి రోహిత్ భాయ్‌కు బాగా తెలుసు. కెప్టెన్‌గా జట్టుకు నా సేవలు ఎప్పుడు అవసరమో కూడా తనకు బాగా తెలుసు. నెట్స్‌లో కూడా నేను కొత్త బంతితో ప్రాక్టీసు చేసేవాడిని. ప్రాక్టీస్ మ్యాచ్‌లలో కొత్త బంతితో బౌలింగ్ చేసి అనేక సార్లు వికెట్లు తీశాను. అలా నాలో ఆత్మవిశ్వాసం క్రమక్రమంగా పెరిగింది. రోహిత్ భాయ్ నాకు ప్రతిసారి న్యూ బాల్నే అందించేవాడు. భయ్యా నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాను. పూరన్ వికెట్ తీయడంలో మజా వచ్చింది నన్ను నేను నిరూపించుకున్నందుకు చాలా సంతోషంగా, మనసు తేలికగా ఉంది. రోహిత్ నాకు అన్ని విధాలా అండగా నిలబడ్డాడు’’ అని ఆకాశ్ మధ్వాల్.. ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. ఇక ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో బ్యాటర్ నికోలస్ పూరన్ వికెట్ తీయడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని ఆకాశ్ పేర్కొన్నాడు. కీలక వికెట్లు పడగొట్టి.. కాగా లక్నోతో మ్యాచ్‌లో ఆకాశ్ మధ్వాల్.. ఓపెనర్ ప్రేరక్ మన్కడ్(3), ఆయుష్ బదోని(1), నికోలస్ పూరన్ (0) రూపంలో మూడు కీలక వికెట్లు తీయడంతో పాటు.. రవి బిష్ణోయి (3), మొహ్సిన్ ఖాన్(0)లను పెవిలియన్‌కు పంపాడు. డేంజరస్ బ్యాటర్ పూరన్‌ను ఆకాశ్ డకౌట్ చేయడంతో మ్యాచ్ ముంబైకి ఫేవర్‌గా మారింది. 81 పరుగుల తేడాతో గెలుపొంది క్వాలిఫయర్-2కి రోహిత్ సేన అర్హత సాధించింది. తదుపరి మే 26న అహ్మాదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ముంబై తలపడనుంది. చదవండి: అతడు రీ ఎంట్రీ ఇస్తే సంతోషిస్తా! టీమిండియా గెలవాలని కోరుకుంటున్నా.. కానీ: దాదా 'వరల్డ్‌కప్ ఉంది.. ఇలాంటి రిస్క్‌లు వద్దు!' 🖐️/ 🖐️ Akash Madhwal 🤌with his first 5 wicket haul seals victory for @mipaltan in the #Eliminator 🔥#IPLonJioCinema #TATAIPL #IPL2023 #LSGvMI pic.twitter.com/MlvIYTlKev — JioCinema (@JioCinema) May 24, 2023 Madhwal lays a brick wall 🧱 in #LSG's path!#LSGvMI #IPLonJioCinema #TATAIPL | @mipaltan pic.twitter.com/bdwufzzSeX — JioCinema (@JioCinema) May 24, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఒక 'SKY' మరో 'స్కై'తో.. 'వదిలితే 10 వికెట్లు తీస్తావా?'
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2కు చేరడంలో జట్టు బౌలర్ ఆకాశ్ మధ్వాల్ది కీలకపాత్ర. 3.3 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆకాశ్ మధ్వాల్పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. బుమ్రా లేని లోటును తీరుస్తూ రోహిత్‌కు అత్యంత నమ్మకమైన బౌలర్‌గా మారిన ఆకాశ్ మధ్వాల్ సీజన్లో ఏడు మ్యాచ్‌లాడి 13 వికెట్లు పడగొట్టాడు. రానున్న క్వాలిఫయర్-2లో ఆకాశ్ కీలకపాత్ర వ్యవహరించే అవకాశం ఉంది. Photo: IPL Twitter ఈ విషయం పక్కనబెడితే.. మ్యాచ్ ముగిసిన అనంతరం సూర్యకుమార్ యాదవ్(SKY).. ముంబైని గెలిపించిన మరో SKY(ఆకాశ్ మధ్వాల్)ను ఫన్నీ ఇంటర్య్వూ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముందుగా ఐదు వికెట్లతో ముంబైని గెలిపించినందుకు నీకు అభినందనలు.. కానీ ఇలాగే వదిలేస్తే మ్యాచ్‌లో పది వికెట్లు తీయాలని అనుకున్నావా అని ప్రశ్నించాడు. సూర్య ప్రశ్నకు ఆకాశ్ మధ్వాల్ నవ్వుతూ.. ''కచ్చితంగా.. వదిలేస్తే ఎలా ఊరుకుంటా'' అని పేర్కొన్నాడు. ''ఆకాశ్ మధ్వాల్ తనను తాను బెస్ట్ బౌలర్‌గా నిరూపించుకునే పనిలో పడ్డాడు. అవకాశమొచ్చి ఉంటే పది వికెట్లు తీసేవాడిని అని నాతో అన్నాడు. కానీ కీలక సమయంలో ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడం సంతోషమనిపించింది. మా బౌలింగ్‌కు పెద్ద దిక్కులా నిలిచాడు.'' అంటూ సూర్య పొగడ్తలు కురిపించాడు. Photo: IPL Twitter 'రోహిత్ నిన్ను నమ్మి బంతి చేతిలో పెట్టడంపై ఎలా తీసుకున్నావని' సూర్య అడగ్గా.. ఆకాశ్ మధ్వాల్ మాట్లాడుతూ.. ''కెప్టెన్ రోహిత్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలనుకున్నా. వికెట్లు సాధించాలన్న తపనతో బౌలింగ్‌పై ఎక్కువ హార్డ్‌వర్క్ చేశా.. ఫలితం సాధించా. ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు హోటల్ రూంలోనే నా బౌలింగ్‌పై నేను, రోహిత్ భయ్యా చర్చించుకున్నాం. కండీషన్స్‌ను బట్టి బౌలింగ్ చేస్తే రిజల్ట్ ఉంటుంది. ఆ సమయంలో నా మైండ్‌సెట్ క్లియర్‌గా ఉండడంతో రోహిత్ చెప్పింది బుర్రకెక్కింది.'' అంటూ తెలిపాడు. When 𝗦𝗞𝗬 meets 𝗦𝗞𝗬 🤝😁 A fabulous five-wicket haul, splendid run-outs and @mipaltan's massive #Eliminator win summed up ft. @surya_14kumar & Akash Madhwal 👌🏻👌🏻 - By @ameyatilak Full Interview 🎥🔽 #TATAIPL | #LSGvMI https://t.co/C90qLI8IFS pic.twitter.com/ry8LleIHiq — IndianPremierLeague (@IPL) May 25, 2023 చదవండి: #MI: క్వాలిఫయర్-2లోనే ఆపండి.. ఫైనల్‌కు వచ్చిందో అంతే! -
జాఫర్‌కు దొరికిన ఆణిముత్యం.. ముంబై ట్రంప్‌కార్డ్; భలే దొరికాడు
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ ఫైనల్‌కు వెళ్లే దారిలో ఎలిమినేటర్‌ను క్లియర్ చేసి క్వాలిఫయర్-2కు చేరుకుంది. మే 26(శుక్రవారం) గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-2లో తలపడనుంది. ఆ మ్యాచ్‌లోనూ గెలిచి ఫైనల్లో సీఎస్కేను చిత్తు చేసి ఆరోసారి ఛాంపియన్‌గా నిలవాలని ఉవ్విళ్లూరుతుంది. ఇక బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ముంబై గెలుపుకు ప్రధాన కారణం ఆకాశ్ మధ్వాల్. తన సంచలన బౌలింగ్‌తో కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. రూ.20 లక్షల కనీస ధరకు మాత్రమే ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అయితే ఆకాశ్ మధ్వాల్‌ను ముంబై తమ ట్రంప్‌కార్డ్‌గా భలే ఉపయోగించుకుంది. అంతకముందు లీగ్ దశలోనూ ప్లేఆఫ్ చేరాలంటే ఎస్ఆర్హెచ్పై కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లనూ ఆకాశ్ నాలుగు వికెట్లతో మెరిశాడు. మొత్తంగా ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున ఏడు మ్యాచ్‌లాడిన ఆకాశ్ మధ్వాల్ 13 వికెట్లు తీశాడు. యార్కర్ల కింగ్ బుమ్రా లేని లోటును మధ్వాల్ తీరుస్తూ రోహిత్‌కు అత్యంత నమ్మకమైన బౌలర్‌గా ఎదిగాడు. Photo: IPL Twitter ఎలిమినేటర్ లాంటి కీలక మ్యాచ్‌లో సత్తా చాటిన మధ్వాల్ గురించి తెలుసుకోవడానికి క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆకాశ్ మధ్వాల్ గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. జాఫర్ వెలికితీసిన ఆణిముత్యం.. ఆకాశ్ 24 ఏళ్ల వయసు వచ్చే వరకూ టెన్నిస్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడటం విశేషం. అతడు ఈ స్థాయికి చేరుకోవడానికి టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కారణం. 2019లో ఉత్తరాఖండ్ తరఫున ఆడుతున్న సమయంలో మధ్వాల్ ప్రతిభను జాఫరే గుర్తించాడు. యూపీ తరఫున ఆకట్టుకునే ప్రదర్శన చేసిన మధ్వాల్.. 2022-23 దేశవాళీ సీజన్లో తమ రాష్ట్ర జట్టుకు కెప్టెన్ గానూ ఎంపికయ్యాడు. Photo: IPL Twitter ఇంజనీర్ నుంచి క్రికెటర్‌గా.. పంత్ పొరుగింట్లో నివాసం 1993 నవంబర్ 23న ఉత్తరాఖండ్‌లోని రూర్కీలోని జన్మించిన ఆకాశ్ మధ్వాల్ ఇంజినీరింగ్ చదివాడు. అంతే కాదు టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ పొరుగింట్లోనే అతడు నివసిస్తుండటం విశేషం. వీరిద్దరూ అవతార్ సింగ్ అనే కోచ్ దగ్గరే శిక్షణ పొందారు. 2019-20 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కోసం.. ఆకాశ్ ఉత్తరాఖండ్ జట్టుకు ఎంపికయ్యాడు. 2019 డిసెంబర్ 25న తొలి రంజీ మ్యాచ్ ఆడాడు. Photo: IPL Twitter ఆర్సీబీ వదిలేసింది.. ముంబై ఒడిసిపట్టింది 2021లోనే ఆకాశ్ ఐపీఎల్‌కు ఎంపికయ్యాడు. ఆర్సీబీ అతన్ని వేలంలో కొనుగోలు చేసినప్పటికీ.. ఆ సీజన్లో ఆడే అవకాశం లభించలేదు. 2022లో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. 2022 సీజన్లోనే సూర్యకుమార్ యాదవ్‌కు రీప్లేస్‌మెంట్‌గా ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు. ఐపీఎల్ 2023కి ముందు నిర్వహించిన వేలంలో రూ.20 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. Photo: IPL Twitter ఈ సీజన్లో ఇప్పటి వరకూ 7 మ్యాచ్‌లు ఆడిన మధ్వాల్ 13 వికెట్లు తీశాడు. 2021 సీజన్లోనే ఆర్సీబీ ఆకాశ్‌కు అవకాశం ఇచ్చి ఉండుంటే.. ఆ జట్టులో అతడు బుమ్రాలా ఎదిగేవాడు. కానీ బెంగళూరు అవకాశం ఇవ్వకుండా అతన్ని వదిలేసుకోగా.. ముంబై మాత్రం ఆకాశ్‌ను ఆడించి ప్రయోజనం పొందింది. 🖐️/ 🖐️ Akash Madhwal 🤌with his first 5 wicket haul seals victory for @mipaltan in the #Eliminator 🔥#IPLonJioCinema #TATAIPL #IPL2023 #LSGvMI pic.twitter.com/MlvIYTlKev — JioCinema (@JioCinema) May 24, 2023 Madhwal lays a brick wall 🧱 in #LSG's path!#LSGvMI #IPLonJioCinema #TATAIPL | @mipaltan pic.twitter.com/bdwufzzSeX — JioCinema (@JioCinema) May 24, 2023 చదవండి: #DeepakHooda: ఎవరి కర్మకు వారే బాధ్యులు! పరుగుపై పెట్టాల్సిన దృష్టి బంతిపై.. తగిన మూల్యం -
IPL 2023 Eliminator: చరిత్ర సృష్టించిన ఆకాశ్ మధ్వాల్.. ఒక్క దెబ్బకు ఎన్ని రికార్డులో..!
లక్నో సూపర్ జెయింట్స్‌తో నిన్న (మే 24) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్ గణాంకాలు (3.3-0-5-5) నమోదు చేసిన ముంబై బౌలర్ ఆకాశ్ మధ్వాల్.. ఈ ఒక్క ఫీట్‌తో పలు ఐపీఎల్ రికార్డులు బద్దలు కొట్టాడు. ఆ వివరాలేంటో చూద్దాం.. ఐపీఎల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్ ఆకాశ్ మధ్వాల్ (5/5) అంకిత్ రాజ్‌పుత్ (5/14, పంజాబ్ 2018), వరుణ్ చక్రవర్తి (5/20, కేకేఆర్ 2020), ఉమ్రాన్ మాలిక్ (5/25, సన్‌రైజర్స్ 2022) ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో అత్యుత్తమ గణాంకాలు ఆకాశ్ మధ్వాల్ (5/5) డౌగ్ బొలింగర్ (4/13) జస్ప్రీత్ బుమ్రా (4/14) ధవల్ కులకర్ణి (4/14) ఐపీఎల్లో అతి తక్కువ ఎకానమీతో 5 వికెట్లు ఆకాశ్ మధ్వాల్ (5/5, 1.4 ఎకానమీ) అనిల్ కుంబ్లే (5/5, 1.57, 2009) జస్ప్రీత్ బుమ్రా (5/10, 2.50, 2022) ఐపీఎల్లో అత్యుత్తమ గణాంకాలు అల్జరీ జోసఫ్ (6/12) సోహైల్ తన్వీర్ (6/14) ఆడమ్ జంపా (6/19) అనిల్ కుంబ్లే (5/5) ఆకాశ్ మధ్వాల్ (5/5) కాగా, నిన్నటి మ్యాచ్‌లో లక్నోపై ముంబై 81 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ (23 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (20 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం లక్నో 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. స్టొయినిస్ (27 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. కనీసం పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయిన లక్నో 21 బంతుల ముందే కుప్పకూలింది. చదవండి: ముంబై ఆనందం ‘ఆకాశ’మంత... -
సపోర్ట్ బౌలర్‌గా వచ్చాడు.. అతనిలో టాలెంట్ ఉందని ముందే పసిగట్టాను: రోహిత్ శర్మ
ఐపీఎల్ 2023లో భాగంగా నిన్న (మే 24) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నోపై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. పేసర్ ఆకాశ్ మధ్వాల్ (3.3-0-5-5) అద్భుతమైన బౌలింగ్ విన్యాసాలతో ముంబైని గెలిపించాడు. ఐపీఎల్ చరిత్రలో ఐదో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసి, లక్నో బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేసిన ఆకాశ్‌పై మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. యువ పేసర్‌ను ఆకాశానికెత్తాడు. గత సీజన్లో ఆకాశ్ సపోర్ట్ బౌలర్‌గా జట్టులో చేరాడని, అతనిలో టాలెంట్‌ను ముందే పసిగట్టానని, జోఫ్రా ఆర్చర్ మధ్యలో వెళ్లిపోయాక ఆకాశ్ అతని లోటును భర్తీ చేయగలడనే నమ్మకం ముందే కలిగిందని, ఆకాశ్.. ముంబైని గెలిపించగలడని ముందే నమ్మానని రోహిత్ చెప్పుకొచ్చాడు. అనూహ్య పరిణామాల మధ్య ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించి, ఆపై ఎలిమినేటర్ మ్యాచ్‌లో నెగ్గడంపై రోహిత్ స్పందిస్తూ.. చాలా సీజన్లుగా చేస్తున్నదే తాము ఈ సీజన్లోనూ చేశాం. అయితే ఈ సారి కాస్త వైవిధ్యంగా చేశామని అన్నాడు. జట్టులో యువ ఆటగాళ్ల (భారత ఆటగాళ్లు) గురించి మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా ముంబై ఇండియన్స్ కుర్రాళ్లు చాలామంది భారత్‌కు ఆడటం చూశాం. వారు తమకు ప్రత్యేకమనే అనుభూతిని కలిగించడం ద్వారా ఫలితాలు రాబట్టగలిగాం. ఈ ప్రదర్శనలే వారిని టీమిండియాకు ఆడేలా చేస్తున్నాయని తెలిపాడు. మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. జట్టుగా మేము ఫీల్డింగ్‌ను బాగా ఆస్వాదించామని, ఫీల్డ్‌లో ప్రతి ఒక్కరూ చురుగ్గా ఉండటం చాలా ఆనందాన్ని కలిగించిందని తెలిపాడు. చెన్నైలో ఆడటంపై స్పందిస్తూ.. ఇది మాకు రెండో హోం టౌన్ లాంటిదని, ఇక్కడ ఆడినప్పుడుల్లా వాంఖడేలో ఆడిన ఫీలింగే కలుగుతుందని చెప్పుకొచ్చాడు. అంతిమంగా.. సమష్టిగా రాణించడం వల్లే తాము లక్నోపై విజయం సాధించగలిగామని తెలిపాడు. కాగా, లక్నోపై డూ ఆర్ డై మ్యాచ్‌లో గెలవడం ద్వారా ముంబై క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. క్వాలిఫయర్-2లో రోహిత్ సేన.. గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొంటుంది. ఇందులో గెలిచిన జట్టు మే 28న జరిగే ఫైనల్లో సీఎస్కేతో తలపడుతుంది. చదవండి: #LSG: ఎలిమినేటర్ గండం దాటలేక.. ఓటమికి కారణాలెన్నో!