ఐపీఎల్ 2024 సీజన్‌లో అత్యంత కీలక దశ నడుస్తుంది. లీగ్ మొత్తంలో 70 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. 54 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కేకేఆర్ టాప్‌లో కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలు (16 పాయింట్లు, 1.453 రన్‌రేట్) సాధించి అగ్రస్థానంలో నిలిచింది.
కేకేఆర్ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ (10 మ్యాచ్‌ల్లో 8 విజయాలు 16 పాయింట్లు 0.622 రన్‌రేట్),
సీఎస్‌కే (11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు 12 పాయింట్లు 0.700 రన్‌రేట్),
సన్‌రైజర్స్ (10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు 12 పాయింట్లు 0.072 రన్‌రేట్),
లక్నో (11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు 12 పాయింట్లు -0.371 రన్‌రేట్),
ఢిల్లీ (11 మ్యాచ్‌ల్లో 5 విజయాలు 10 పాయింట్లు -0.442 రన్‌రేట్),
ఆర్సీబీ (11 మ్యాచ్‌ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -0.049 రన్‌రేట్),
పంజాబ్ (11 మ్యాచ్‌ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -0.187 రన్‌రేట్),
గుజరాత్ (11 మ్యాచ్‌ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -1.320 రన్‌రేట్),
ముంబై ఇండియన్స్ (11 మ్యాచ్‌ల్లో 3 విజయాలు 6 పాయింట్లు -0.356 రన్‌రేట్) వరుసగా రెండు నుంచి పది స్థానాల్లో ఉన్నాయి.
ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇలా..
ప్రస్తుతమున్న పరిస్థితులను బట్టి ఏ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఎలా ఉన్నాయనే అంశంపై ఓ లుక్కేద్దాం. ప్రస్తుతానికి ఏ జట్టూ అధికారికంగా లీగ్ నుంచి ఎలిమినేట్ కానప్పటికీ.. ముంబై మాత్రం నిష్క్రమించే జట్ల జాబితాలో ముందువరుసలో ఉంది. ఈ జట్టు తదుపరి ఆడబోయే మూడు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించినా ప్లే ఆఫ్స్‌కు చేరదు. ఈ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు సున్నా అని చెప్పాలి.
ప్లే ఆఫ్స్ ఛాన్స్‌లు దాదాపుగా గల్లంతు చేసుకున్న జట్ల జాబితాలో ముంబై తర్వాతి స్థానంలో గుజరాత్ ఉంది. ఈ జట్టు కూడా తదుపరి ఆడే మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే ఇలా జరిగి మిగతా జట్లు తమతమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓడితే సమీకరణలు మారతాయి. ఈ జట్టుకు మినుకుమినుకు మంటూ ఒక్క శాతం ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి.
ఇక ముంబై, గుజరాత్ తర్వాత ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించేందుకు రెడీగా ఉన్న జట్ల జాబితాలో పంజాబ్, ఆర్సీబీ ఉన్నాయి. ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప ఈ జట్లు కూడా ప్లే ఆఫ్స్‌కు చేరలేవు. పంజాబ్‌కు 2 శాతం, ఆర్సీబీకి 3 శాతం ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి.
మిగతా జట్ల విషయానికొస్తే.. రాజస్థాన్, కేకేఆర్ జట్లు ఫైనల్ ఫోర్ బెర్త్‌లు దాదాపుగా ఖరారు చేసుకోగా.. సన్‌రైజర్స్, సీఎస్‌కే, లక్నో మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఢిల్లీకి సైతం ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నా ఆ జట్టుకు కేవలం 12 శాతం ఛాన్స్‌లు మాత్రమే ఉన్నాయి.
కేకేఆర్‌కు 99, రాజస్థాన్‌కు 98 శాతం ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉండగా.. సన్‌రైజర్స్‌కు 75, సీఎస్‌కేకు 60, లక్నోకు 50 శాతం అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి అత్యద్భుతాలు జరగకపోతే పై సమీకరణలన్నీ యధాతథంగా జరిగే అవకాశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment