రషీద్‌ఖాన్
హైదరాబాద్ : సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతుంతుంటే సొంత జట్టు అఫ్గానిస్తాన్‌కు ఆడుతున్నట్లే ఉందని ఆ జట్టు స్టార్ స్పిన్నర్ రషీద్‌ఖాన్ అభిప్రాయపడ్డాడు. శనివారం ఉప్పల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు పడగొట్టిన రషీద్ మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.
ఈ సందర్భంగా రషీద్ మాట్లాడుతూ..‘నాబౌలింగ్ శైలే నా ప్రధాన బలం. దీన్ని పసిగట్టలేక బ్యాట్స్‌మన్ తడబాటు గురవుతున్నారు. దీనికి తోడు గుడ్ లెంగ్త్ బంతులు వేయడంతో నా పని సులువవుతోంది. సన్‌రైజర్స్‌కు ఆడుతుంటే సొంతజట్టు అఫ్గానిస్థాన్‌కు ఆడుతున్నట్లే అనిపిస్తోంది. ఇక్కడి ప్రజలు చూపించే ప్రేమ, అభిమానం అత్యద్భుతం. ఇంత తక్కువ వయస్సులో ఎక్కువ మ్యాచ్‌లాడి వాటిలోనూ అద్భుతంగా రాణించడం ఎంతో ఆనందంగా ఉంది. రెండు మ్యాచ్‌లలో తడబడినా..తర్వాతి నుంచి కుదురుకొని ప్రతి మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. అదే నా బలం. నా బౌలింగ్ శైలే మ్యాచ్‌లో రాణించేలా తోడ్పాటునందిస్తోంది’ అని రషీద్ ఖాన్ పేర్కొన్నాడు. ఇక ఈ సీజన్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన రషీద్ 12 వికెట్లతో అత్యధిక బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment