![Daniel Wyatt Wants To Hit Rashid Khan For A Six - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/13/rashid%20khan.jpg.webp?itok=d71RAMpa)
ఇంగ్లండ్ క్రికెటర్ డానియెల్ వ్యాట్, సన్‌రైజర్స్ బౌలర్ రషీద్ ఖాన్
సాక్షి, హైదరాబాద్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ గురువారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో జట్టును గెలిపించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు పొందిన విషయం తెలిసిందే. రషీద్ ప్రదర్శనకు ఫిదా అయిన సన్‌రైజర్స్ జట్టు.. ‘4 ఓవర్లు బౌలింగ్ చేసి 18 డాట్ బాల్స్ వేసి వికెట్ తీసిన బౌలర్ రషీద్ ఖాన్‌కు అభినందనలు’ అంటూ ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్‌కు స్పందించిన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియల్ వ్యాట్... ‘బాగా బౌలింగ్ చేశావు మాంత్రికుడా’ అంటూ ట్వీట్‌తో అతడిని అభినందించింది. రషీద్ ఖాన్.. ‘ఇంగ్లీషు కౌంటీలో నీకు కూడా బౌలింగ్ చేస్తాను. సిద్ధంగా ఉండు’ అంటూ ఆమెను చాలెంజ్ చేశాడు. అతడి సవాల్‌కు దీటుగా స్పందించిన డానియల్ ‘ఓకే’ అంటూ #6runsతో ట్యాగ్ చేసింది.
‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ప్రపోజ్ చేసి వార్తల్లో నిలిచిన డానియల్ ప్రస్తుతం.. భారత్‌లో ఉంది. టి20 ట్రైసిరీస్, వన్డే సిరీస్‌లో ఆడింది.
Comments
Please login to add a commentAdd a comment