
పరస్పరం ఆప్యాయంగా పలకరించుకున్న కమిన్స్- కోహ్లి (PC: SRH)
ఐపీఎల్-2024లో వరుస విజయాలతో సత్తా చాటుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. సొంతమైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం తలపడనుంది. ఇందుకోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది.
ఈ సీజన్‌లో ఇప్పటికే ఆర్సీబీని తమ సొంతగడ్డపైనే ఓడించిన సన్‌రైజర్స్ ఉప్పల్‌లోనూ ఆ సీన్‌ను రిపీట్ చేయాలని భావిస్తోంది. చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు(287) సాధించిన రైజర్స్... హైదరాబాద్‌లో తమ రికార్డును బ్రేక్ చేయాలని పట్టుదలగా ఉంది.
ప్యాట్ కమిన్స్ బృందం జోరు చూస్తుంటే ఇదేమీ అసాధ్యం కాకపోవచ్చనే అనిపిస్తోంది. మరోవైపు.. ఆర్సీబీ సైతం ఘోర పరాభవానికి బదులు తీర్చుకోవాలని భావిస్తున్న తరుణంలో ఇరుజట్ల మధ్య హోరాహోరీ ఖాయమంటూ ఈ మ్యాచ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
The crossover we all love to see 🤩 pic.twitter.com/nLlDlUcH7E
— SunRisers Hyderabad (@SunRisers) April 24, 2024
ఇదిలా ఉంటే.. ఈ కీలక పోరుకు ముందే సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌ను తన మాటలతో ఖుషీ చేశాడు. ‘‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను.
కమిన్స్ అంటే క్లాస్ అనుకుంటివా? మాస్.. ఊరమాస్.. ఎస్‌ఆర్‌హెచ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరూ’’ అంటూ తెలుగులో డైలాగ్స్ చెప్పి దుమ్ములేపాడు. తగ్గేదేలే అంటూ ఆర్సీబీకి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు స్పందించిన ఆరెంజ్ ఆర్మీ.. ‘‘కెప్టెన్ ఓ రేంజు.. మామ మనోడే.. సూపర్ కమిన్స్’’ అంటూ కామెంట్లతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాకతో సన్‌రైజర్స్ తలరాత మారిపోయింది. గత మూడేళ్లుగా వైఫల్యాలతో చతికిల పడ్డ రైజర్స్‌ను తన కెప్టెన్సీతో ఈ సీజన్‌లో హాట్ ఫేవరెట్‌గా మార్చాడు ఈ పేస్ బౌలర్.
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి హిట్టర్లకు తోడు బౌలర్లు కూడా రాణిస్తుండటంతో తన కెప్టెన్సీ వ్యూహాలకు మరింత పదును పెట్టి వరుస విజయాలు సాధిస్తున్నాడు. ఇక ఈ ఎడిషన్‌లో సన్‌రైజర్స్ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఐదు గెలిచి పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. ఆర్సీబీ ఎనిమిదింట ఏడు ఓడి అట్టడుగున ఉంది.
చదవండి: IPL 2024: అన్ని జట్లు ఓడాయి.. ఒక్క సన్‌రైజర్స్ మాత్రమే..!
ఓవైపు కెప్టెన్‌గా #OrangeORangeu అనిపిస్తున్నాడు 💪
అది సరిపోదు అన్నట్టు.. ఈ Mass డైలాగ్స్ 💥@patcummins30 మామ.. నువ్వు సూపర్ అంతే! 🤩
చూడండి#TATAIPL
Hyderabad v Bengaluru | రేపు 6 PM నుంచి
మీ #StarSportsTelugu లో#IPLonStar #OrangeORangeu #ProudToBeTelugu pic.twitter.com/wv5IzPZhFe— StarSportsTelugu (@StarSportsTel) April 24, 2024