ఇషాన్ కిష‌న్ సూప‌ర్‌ సెంచ‌రీ.. రాజ‌స్తాన్‌పై స‌న్‌రైజ‌ర్స్ ఘ‌న విజ‌యం | Ishan Kishan Super Century Sets Up Hyderabads Win vs Rajasthan | Sakshi
Sakshi News home page

IPL 2025: ఇషాన్ కిష‌న్ సూప‌ర్‌ సెంచ‌రీ.. రాజ‌స్తాన్‌పై స‌న్‌రైజ‌ర్స్ ఘ‌న విజ‌యం

Published Sun, Mar 23 2025 8:19 PM | Last Updated on Mon, Mar 24 2025 10:50 AM

Ishan Kishan Super Century Sets Up Hyderabads Win vs Rajasthan

ఐపీఎల్-2025లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ శుభారంభం చేసింది. రాజీవ్‌గాంధీ అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 44 ప‌రుగుల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఘ‌న విజ‌యం సాధించింది. 287 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజ‌స్తాన్ వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేయగలిగింది. 

ధ్రువ్ జురేల్(70), సంజు శాంసన్(66) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన‌ప్ప‌టికి ఈ భారీ టార్గెట్‌ను రాజ‌స్తాన్ అందుకోలేక‌పోయింది. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో సిమర్జీత్ సింగ్, హ‌ర్ష‌ల్ ప‌టేల్ త‌లా రెండు వికెట్లు ప‌డగొట్టగా.. షమీ, జంపా చెరో వికెట్ సాధించారు.

ఇషాన్ సూప‌ర్ సెంచ‌రీ..
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 286 పరుగులు భారీ స్కోర్ చేసింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో ఇషాన్ కిష‌న్ అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. హెడ్‌తో క‌లిసి స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ రెండో వికెట్ కు 39 బంతుల్లో 85 పరుగులు జోడించారు. 

కిష‌న్ కేవలం 47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 106 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కిష‌న్‌కు ఇదే తొలి ఐపీఎల్ సెంచ‌రీ. ట్రావిస్‌ హెడ్‌(67) హాఫ్‌ సెంచరీతో మెరవగా.. క్లాసెన్‌(34), నితీశ్‌ కుమార్‌(30) పరుగులతో రాణించారు. 

రాజస్తాన్‌ బౌలర్లలో తుషార్‌ దేశ్‌పాండే మూడు వికెట్లు పడగొట్టగా.. థీక్షణ రెండు, సందీప్‌ శర్మ ఒక్క వికెట్‌ సాధించారు. సెంచ‌రీ హీరో ఇషాన్ కిష‌న్‌కు ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. ఇక ఎస్ఆర్‌హెచ్ త‌మ త‌దుప‌రి మ్యాచ్‌లో  మార్చి 27న ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది.
చ‌ద‌వండి: IPL 2025: ముంబై ఇండియ‌న్స్ వదిలేసింది.. క‌ట్ చేస్తే! తొలి మ్యాచ్‌లోనే భారీ సెంచ‌రీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement