Breadcrumb
Live Updates
IPL 2022: సన్‌రైజర్స్ వర్సెస్ సీఎస్కే లైవ్ అప్డేట్స్
సీఎస్కే ఆల్‌రౌండ్ షో.. సన్‌రైజర్స్‌కు వరుసగా రెండో ఓటమి
సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో సీఎస్కే ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టింది. తొలుత రుతురాజ్ గైక్వాడ్ (57 బంతుల్లో 99; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), డెవాన్ కాన్వే (55 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) విజృంభించడంతో సీఎస్కే 202 పరుగుల భారీ స్కోర్ చేయగా, ఛేదనలో ముకేశ్ చౌదరీ (4/45) చెలరేగడంతో సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ఫలితంగా సీఎస్కే 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో పూరన్ (64 నాటౌట్), విలియమ్సన్ (47), అభిషేక్ శర్మ (39) రాణించినా ఫలితం లేకపోయింది.
ఓటమి దిశగా సన్‌రైజర్స్
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఓటమి దిశగా పయనిస్తుంది. 17.4వ ఓవర్లో శశాంక్ సింగ్ (15)ను ఔట్ చేసిన ముకేశ్ చౌదరీ.. అదే ఓవర్ ఆఖరి బంతికి వాషింగ్టన్ సుందర్ (2)ను క్లీన్ బౌల్డ్ చేసి సన్‌రైజర్స్ ఓటమిని దాదాపుగా ఖరారు చేశాడు. సన్‌రైజర్స్ గెలవాలంటే 12 బంతుల్లో 50 పరుగులు చేయాల్సి ఉంది.
నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్
సీఎస్కే బౌలర్ ప్రిటోరియస్ సన్‌రైజర్స్‌ను భారీ దెబ్బ కొట్టాడు. 15వ ఓవర్లో విలియమ్సన్ (47)ను ఎల్బీడబ్ల్యూ చేసి పెవిలియన్‌కు పంపాడు. 15 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 131/4. క్రీజ్‌లో పూరన్ (21), శశాంక్ సింగ్ (5) ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్
రెండు భారీ సిక్సర్లు బాది జోరుమీదున్నట్లు కనిపించిన మార్క్రమ్ (10 బంతుల్లో 17) ఆ మరుసటి బంతికే సాంట్నర్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 89/3. క్రీజ్‌లో విలియమ్సన్ (31), పూరన్ ఉన్నారు.
వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో వరుసగా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలుత అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి (0) ముకేశ్ చౌదరీ బౌలింగ్‌లో ఔటయ్యారు. 6 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 58/2.
తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్
భారీ టార్గెట్ ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్‌కు కూడా శుభారంభం లభించింది. అయితే ఇన్నింగ్స్ 6వ ఓవర్లో అభిషేక్ శర్మ (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, సిక్స్) అనవసర షాట్‌కు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. ముకేశ్ చౌదరీ బౌలింగ్‌లో ప్రిటోరియస్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ వెనుదిరిగాడు.
సీఎస్కేకు ధీటుగా బదులిస్తున్న సన్‌రైజర్స్
203 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ధీటుగా జవాబిస్తుంది. సన్‌రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ (17 బంతుల్లో 30; 5 ఫోర్లు, సిక్స్), విలియమ్సన్ (8 బంతుల్లో 15; ఫోర్, సిక్స్) సైతం సీఎస్కే ఓపెనర్ల తరహాలో విరుచుకుపడుతున్నారు. 4 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 46/0.
శివాలెత్తిన రుతురాజ్, కాన్వే.. సీఎస్కే భారీ స్కోర్
ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (57 బంతుల్లో 99; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), డెవాన్ కాన్వే (55 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) విజృంభించడంతో సీఎస్కే భారీ స్కోర్ సాధించింది. రుతురాజ్ ఒక్క పరుగు తేడాతో శతకం చేజార్చుకున్నాడు. సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్‌కు రెండు వికెట్లు దక్కాయి.
శతకం చేజార్చుకున్న రుతురాజ్
సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కేవలం ఒక్క పరుగు తేడాతో శతకం చేజార్చుకున్నాడు. ఇన్నింగ్స్ ఆధ్యాంతం వీర లెవెల్లో రెచ్చిపోయిన రుతురాజ్ 57 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఎండ్‌లో కాన్వే (50 బంతుల్లో 74; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా సన్‌రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 18 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 183/1.
శివాలెత్తిన రుతురాజ్, కాన్వే.. భారీ స్కోర్ దిశగా సీఎస్కే
ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (52 బంతుల్లో 94; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), డెవాన్ కాన్వే (44 బంతుల్లో 63; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ షాట్లతో విజృంభిస్తుండటంతో సీఎస్కే భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తుంది. ఈ ఇద్దరూ సీఎస్కే బౌలర్లను ఎడాపెడా వాయిస్తున్నారు. 16 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 166/0.
ఉతికి ఆరేస్తున్న రుతురాజ్
సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (43 బంతుల్లో 78; 5 ఫోర్లు, 6 సిక్సర్లు)పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త నిదానంగా ఆడిన ఈ యువ ప్లేయర్ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. సన్‌రైజర్స్ బౌలర్లందరినీ ఎడాపెడా వాయిస్తూ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. మరో ఎండ్‌లో కాన్వే (35 బంతుల్లో 38) కూడా గేర్ మార్చాడు. 13 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 123/0.
గేర్ మార్చిన రుతురాజ్.. హాఫ్ సెంచరీ పూర్తి
ఆరంభంలో నిదానంగా ఆడిన రుతురాజ్ (38 బంతుల్లో 66; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) క్రమంగా ధాటిగా ఆడటం ప్రారంభించాడు. మార్క్రమ్ వేసిన 9వ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్సర్ కొట్టిన అతను.. ఆతర్వాత ఉమ్రాన్ మాలిక్ వేసిన 10వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు, మార్క్రమ్ వేసిన 11వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో కాన్వే (28 బంతుల్లో 29) నిదానంగా ఆడుతున్నాడు. 11 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 100/0.
నిలకడగా ఆడుతున్న రుతురాజ్, కాన్వే
ఆరంభంలో నిదానంగా ఆడిన చెన్నై ఓపెనర్లు క్రమంగా వేగం పెంచారు. కాన్వే (19 బంతుల్లో 15)తో పోలిస్తే రుతురాజ్ (23 బంతుల్లో 28) కాస్త దూకుడుగా ఆడుతున్నాడు. 7 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 47/0.
నిదానంగా ఆడుతున్న సీఎస్కే ఓపెనర్లు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే.. ఓపెనర్లు నిదానంగా ఆడుతుండటంతో 3 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 18 పరుగులు మాత్రమే చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (9), డెవాన్ కాన్వే (7) క్రీజ్‌లో ఉన్నారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్
పూణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగనున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, మార్కో జన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, డెవాన్ కాన్వే, అంబటి రాయుడు, సిమ్రన్‌జీత్ సింగ్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్), మిచెల్ సాంట్నర్, డ్వైన్ ప్రిటోరియస్, ముఖేష్ చౌదరి, మహేశ్ తీక్షణ
Related News By Category
Related News By Tags
-
సీఎస్కే బౌలర్ సంచలన ప్రదర్శన
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో మహారాష్ట్ర ఆటగాడు, సీఎస్కే బౌలర్ రామకృష్ణ ఘోష సంచలన ప్రదర్శనలతో చెలరేగిపోతున్నాడు. హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్లతో విజృంభించిన ఈ రైట్ ఆర్మ్ మీడియం...
-
10 ఓవర్లలో 123 పరుగులు.. సీఎస్కే బౌలర్ అత్యంత చెత్త రికార్డు
దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పుదుచ్చేరి కెప్టెన్, ఆల్‌రౌండర్ అమాన్ ఖాన్ కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అయితే ఇది దురదృష్టవశాత్తూ చెప్పుకోవడానికి ఇష్టపడని అవమానకరమైన రికార్డు కావ...
-
7 వికెట్లతో చెలరేగిన సీఎస్కే ఫాస్ట్ బౌలర్
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర బౌలర్ రామకృష్ణ ఘోష్ చెలరేగిపోయాడు. 9.4 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 7 వికెట్లు తీశాడు. విజయ్ హజారే ట్ర...
-
నగలు, ప్లాట్లు, పొలం అమ్మేశారు.. ఇప్పుడిలా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తెచ్చింది. క్యాష్ రిచ్ లీగ్‌లోని ఫ్రాంఛైజీలు తమ జట్లను పటిష్ట పరచుకునే క్రమంలో మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసి....
-
మరోసారి ఐపీఎల్లో.. సర్ఫరాజ్ స్పందన ఇదే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎట్టకేలకు తిరిగి అడుగుపెట్టాడు టీమిండియా స్టార్ సర్ఫరాజ్ ఖాన్. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 2023లో చివరి సారిగా ఐపీఎల్ ఆడిన ఈ ముంబైకర్.. దాదాపు మూడేళ్ల విరామం త...


