
వృద్దిమాన్ సాహా
కోల్‌కతా : ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ ఈ సీజన్ ఐపీఎల్‌కు దూరమైనా తమ జట్టు రాణించగలదని సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అభిప్రాయపడ్డాడు. ఇక గత రెండు సీజన్ల నుంచి డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. వార్నర్ కెప్టెన్సీలోనే సన్‌రైజర్స్ 2016లో ఐపీఎల్ టైటీల్‌ను సైతం నెగ్గింది. అయితే తాజా ట్యాంపరింగ్ వివాదంతో ఈ స్టార్ క్రికెటర్ ఐపీఎల్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా చర్యల తీసుకున్న తర్వాతే తమ నిర్ణయం ప్రకటిస్తామని సన్‌రైజర్స్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సాహా మీడియాతో మాట్లాడుతూ.. ‘కెప్టెన్‌ను దృష్టిలో పెట్టుకునే జట్టు సన్నాహకాలు ప్రారంభిస్తోంది. కానీ అతనిక్కడ లేడు. ఈ ప్రభావం మాజట్టుపై కొంత ఉంటుంది. అతని స్థానం భర్తీ చేయగల ఆటగాళ్లు కూడా మా జట్టులో ఉన్నారు. ఒక వేళ వార్నర్ ఉంటే అది మాకు అదనపు బలం. అతనో అద్భుత ఆటగాడు. గత సీజన్లలో హైదరాబాద్ సారథిగా మంచి ప్రదర్శన కనబర్చాడు. అయినప్పటికీ అతని స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం ఉన్న ఆటగాళ్లున్నారు. మా జట్టు రిజర్వ్ బెంచ్ చాలా బలంగా ఉంది. ’ అని సాహా తెలిపాడు.
ఇక ట్యాంపరింగ్‌పై స్పందిస్తూ.. దేశం తరుఫున, ప్రతి ఒక్క ఆటగాడు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఏ ఆటలోనైనా నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించవద్దు. అది క్రీడాస్పూర్తికే విరుద్ధం. ఇది అందరి ఆటగాళ్లు వర్తిస్తుంది. వారు క్రీడాస్పూర్తిని మరచి బాల్ ట్యాంపరింగ్‌కు ప్రయత్నించారు. ఇది ముమ్మాటికి తప్పే. తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే. ఈ విషయంలో అందరిని ఒకలే చూడాలి తప్ప ఒక్కో కేసును ఒకలా చూడవద్దు. ’అని సాహా అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment