![IPL 2022 Mega Auction: Sunrisers Hyderabad Struggling to Retain Rashid Khan - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/26/Rashid-khan.jpg.webp?itok=vez24lwh)
Rashid Khan not willing to be SRHs second retained player ahead of IPL 2022: ఐపీఎల్ 15వ సీజన్ కోసం రిటైన్ ప్లేయర్స్ లిస్ట్‌ను సమర్పించడానికి సమయం ఆసన్నమవుతోంది. ఆ క్రమంలో ఆయా జట్లు తుది జాబితా సిద్దం చేసుకొనే పనిలో పడ్డాయి. ప్రతీ జట్టు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశముంది. అందులో ఒక విదేశీ ఆటగాడు తప్పనిసరిగా ఉండాలి. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఆజట్టు స్టార్ బౌలర్ రషీద్ ఖాన్‌ను వదులుకోవాలని సన్‌రైజర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఆ జట్టు కెప్టెన్ విలియమ్సన్‌ను రిటైన్ చేసుకొనే యోచనలో సన్ రైజర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. విలియమ్సన్, రషీద్ ఖాన్‌లో ఎవరని రిటైన్ చేసుకోవాలోనే సందిగ్ధంలో పడ్డ సన్‌రైజర్స్.. చివరగా విలియమ్సన్ వైపే మెగ్గు చూపునట్లు సమాచారం.
ఒక వేళ రషీద్ ఖాన్‌ను సన్ రైజర్స్ వదులు కున్నట్లయితే.. అతడికి ఈ మెగా వేలంలో భారీ ధర దక్కనుంది. ఎందుకంటే చాలా ఫ్రాంచైజీలు అతడి సేవలు పొందాలని భావిస్తున్నాయి. ఒకవేళ రషీద్ వేలంలో పాల్గొంటే.. తిరిగి మళ్లీ అతడిని దక్కించుకోవడం సన్‌రైజర్స్‌కు చాలా కష్టం అవుతుంది. ఇక ఐపీఎల్-2022లో లక్నో, అహ్మదాబాద్ రూపంలో కొత్త జట్లు చేరడంతో ఈ లీగ్ మరింత రసవత్తరంగా జరగనుంది. కాగా వచ్చే సీజన్ కోసం మెగా వేలం డిసెంబర్‌లో ప్రారంభం కానుంది.
చదవండి: IPL 2022 Auction: అప్పుడు 8 కోట్లు... ఇప్పుడు 14 కోట్లకు ఓకే అన్నాడట.. కెప్టెన్‌గానే!
Comments
Please login to add a commentAdd a comment