సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా మరోసారి వార్నర్‌ | David Warner Replaces Kane Williamson As Sunrisers Hyderabad Captain | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా మరోసారి వార్నర్‌

Feb 27 2020 12:04 PM | Updated on Feb 27 2020 12:19 PM

David Warner Replaces Kane Williamson As Sunrisers Hyderabad Captain - Sakshi

న్యూఢిల్లీ : ఐపీఎల్‌ 2020 సీజన్‌కు సంబంధించి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌గా మరోసారి డేవిడ్‌ వార్నర్‌ను నియమిస్తున్నట్లు జట్టు యాజమాన్యం గురువారం అధికారిక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో 2018, 2019 ఐపీఎల్‌ సీజన్లకు నాయకత్వం వహించిన కేన్‌ విలియమ్‌సన్‌ స్థానంలో వార్నర్‌ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టునున్నాడు. ఇదే విషయాన్ని దృవీకరిస్తూ సన్‌రైజర్స్‌ తన ఫేస్‌బుక్‌ పేజీలో వార్నర్‌నుద్ధేశించి వీడియో పోస్ట్‌ చేసింది.

ఈ సందర్భంగా వార్నర్‌ స్పందిస్తూ.. ' నా మీద నమ్మకంతో జట్టు యాజమాన్యం మరోసారి తనను కెప్టెన్‌గా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఐపీఎల్‌ 2020లో సన్‌రైజర్స్‌కు నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నా. 2018 ఐపీఎల్‌ సీజన్‌కు నేను అందుబాటులో లేనప్పుడు కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించిన కేన్‌ విలియమ్‌సన్‌తో పాటు భువనేశ్వర్‌ కుమార్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నా. మరోసారి కెప్టెన్‌గా జట్టును ముందుండి నడుపుతున్నా.. అందుకు మీ సహకారం ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నా. నాపై నమ్మకంతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మరోసారి నన్ను కెప్టెన్‌ను చేసింది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా జట్టును ముందుకు నడుపుతా. తనకు ఇంతకాలం మద్దతుగా ఉన్న సన్‌రైజర్స్‌ అభిమానులకు ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నా' అంటూ తెలిపాడు.
(మార్చి 2న మైదానంలోకి ధోని)

2018లో బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంతో క్రికెట్‌ ఆస్ర్టేలియా వార్నర్‌తో పాటు అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌పై ఏడాది నిషేదం, బౌలర్‌ బెన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేదం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2018 ఐపీఎల్‌ సీజన్‌కు కేన్‌విలియమ్‌సన్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.అయితే 2019లో పునరాగమనం తర్వాత వార్నర్‌ ఐపీఎల్‌ 2019 సీజన్‌లో ఒక ఆటగాడిగా కొనసాగుతూ తన ప్రదర్శనతో దుమ్మురేపాడు. మొత్తం 12  మ్యాచుల్లో 692 పరుగులు సాధించి లీగ్‌ టాపర్‌గా నిలవడం విశేషం. అందులో ఒక శతకం, 8 అర్థసెంచరీలు ఉన్నాయి. కాగా ఇంతకుముందు వార్నర్‌ నాయకత్వంలోనే 2016లో సన్‌రైజర్స్‌ జట్టు టైటిల్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. 
('నేను ఇంతలా మారడానికి నా భార్యే కారణం')
(‘డ్యాన్స్‌ బాగుంది.. ట్రోఫీ తెస్తే ఇంకా బాగుంటుంది’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement