ICC WC 2023- Pak vs NZ: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టులోకి తిరిగి వచ్చీ రాగానే అరుదైన రికార్డుతో మెరిశాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా ప్రపంచకప్ టోర్నీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా బెంగళూరు వేదికగా న్యూజిలాండ్- పాకిస్తాన్ పోటీకి దిగాయి.
సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే రెండు జట్లకూ శనివారం నాటి మ్యాచ్ కీలకంగా మారింది. ఈ క్రమంలో చిన్నస్వామి స్టేడియంలో పైచేయి సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్‌తో న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ రీఎంట్రీ ఇచ్చాడు.
ఓపెనర్ డెవాన్ కాన్వే(35) అవుట్ కావడంతో పదకొండవ ఓవర్లో క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో పద్నాలుగో ఓవర్ మొదటి బంతికి.. హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో ఫోర్ బాదిన విలియమ్సన్.. మరుసటి బాల్‌కు సింగిల్ తీశాడు. తద్వారా ప్రపంచకప్ చరిత్రలో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
కివీస్ తరఫున సరికొత్త చరిత్ర.. తొలి బ్యాటర్‌గా
న్యూజిలాండ్ తరఫున అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. వరల్డ్‌కప్‌లో 24 ఇన్నింగ్స్‌లోనే కేన్ విలియమ్సన్ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇక ఓవరాల్‌గా ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.
కాగా బొటనవేలి గాయం కారణంగా కేన్ ఇన్నాళ్లూ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో కివీస్ 16 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 103 పరుగులు సాధించింది.
వరల్డ్‌కప్ టోర్నీలో తక్కువ ఇన్నింగ్స్‌లోనే 1000 పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్లు
19 - డేవిడ్ వార్నర్/ రోహిత్ శర్మ
20 - సచిన్ టెండూల్కర్/ ఏబీ డివిలియర్స్
21 - వివ్ రిచర్డ్స్/ సౌరవ్ గంగూలీ
22 - మార్క్ వా / హెర్షల్ గిబ్స్
23 - తిలకరత్నే దిల్షాన్
24 - కేన్ విలియమ్సన్*.
చదవండి: అయ్యర్ భారీ సిక్సర్! ఆమె రావడం మంచిదైంది.. కానీ! ప్రతిభను గుర్తించరా?
Comments
Please login to add a commentAdd a comment