ICC Cricket World Cup 2023- New Zealand vs Pakistan: వన్డే వరల్డ్‌కప్-2023 సెమీస్ రేసులో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్- పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది.
అందుకే తొలుత బౌలింగ్
సెమీ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం మాట్లాడుతూ.. ‘‘పిచ్ తేమగా ఉంది. కాబట్టి తొలుత బౌలింగ్ చేస్తే మాకు సానుకూలంగా ఉంటుంది. మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయడం సాధ్యపడుతుంది’’ అని తన నిర్ణయానికి గల కారణం వెల్లడించాడు.
టాస్ గెలిచిన పాకిస్తాన్ (PC: ICC)
హసన్ అలీ తుదిజట్టులోకి
అదే విధంగా కివీస్‌తో మ్యాచ్‌లో తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు బాబర్ పేర్కొన్నాడు. ఉసామా మిర్ స్థానంలో హసన్ అలీ తుదిజట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. ఇక వ్యక్తిగతంగా తన ఫామ్ పట్ల సంతృప్తిగానే ఉన్నానన్న బాబర్ ఆజం.. భారీ స్కోర్లు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు.
కివీస్‌కు గుడ్‌న్యూస్
ఇక పాకిస్తాన్‌తో కీలక మ్యాచ్ నేపథ్యంలో న్యూజిలాండ్‌కు శుభవార్త అందింది. బొటనవేలి గాయం కారణంగా గత నాలుగు మ్యాచ్‌లకు దూరమైన కెప్టెన్ కేన్ విలియమ్సన్ తిరిగి జట్టుతో కలిశాడు. టాస్ సందర్భంగా కేన్ మామ మాట్లాడుతూ.. తమ తుదిజట్టులో రెండు మార్పులు చేశామని తెలిపాడు. విల్ యంగ్ స్థానంలో తాను.. మ్యాచ్ హెన్రీ స్థానంలో ఇష్ సోధి వచ్చినట్లు వెల్లడించాడు.
తుది జట్లు:
పాకిస్తాన్:
అబ్దుల్లా షఫీక్, ఫకార్ జమాన్, బాబర్ అజామ్(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), ఇఫ్తికార్ అహ్మద్, సౌద్ షకీల్, ఆఘా సల్మాన్, షాహీన్ అఫ్రిది, హసన్ అలీ, మహ్మద్ వసీం జూనియర్, హారిస్ రౌఫ్
న్యూజిలాండ్:
డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్.
చదవండి: WC 2023: కీలక సమయంలో టీమిండియాకు భారీ షాక్.. ఐసీసీ ప్రకటన! అతడికి మాత్రం..
Comments
Please login to add a commentAdd a comment