
బిల్లీ స్టాన్‌లేక్ (ఫైల్ ఫొటో)
ముంబై : సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే జట్టు సీనియర్ ఆటగాళ్లంతా గాయాలతో ఇబ్బంది పడ్తుంటే.. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ బిల్లీ స్టాన్‌లేక్ గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. వేలు విరగడంతో స్టాన్‌లేక్ టోర్నీకి దూరమవుతున్నాడని, అతను త్వరంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. సన్‌రైజర్స్ ట్వీట్ చేసింది. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన స్టాన్ లేక్ 5 వికెట్లు పడగొట్టి సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
సన్‌రైజర్స్ తరపున బౌలింగ్ జాబితాలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయితే గత ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ ఈ ఆసీస్ బౌలర్ గాయపడ్డాడు. సర్జరీ చేయించుకోవాలని డాక్టర్లు సూచించడంతో ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు దూరమయ్యాడు. భువనేశ్వర్‌కు అండగా రాణిస్తాడని భావించిన సన్ యాజమాన్యానికి నిరాశే మిగిలింది. వేలంలో ఈ ఆసీస్ ఆటగాడిని సన్‌రైజర్స్ రూ.50 లక్షలకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
Billy Stanlake has been ruled out of the remainder of IPL 2018 owing to a fractured finger. The #OrangeArmy wishes him a speedy recovery.
— SunRisers Hyderabad (@SunRisers) 24 April 2018
Comments
Please login to add a commentAdd a comment