దుబాయ్: సన్‌రైజర్స్‌తో ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో కోల్‌కత నైట్‌రైడర్స్ జట్టు సూపర్ విజయం సాధించింది. కోల్‌కత విజయంలో ప్రధాన పాత్ర పోషించిన లాకీ ఫెర్గూసన్ సూపర్ ఓవర్‌లో డేవిడ్ వార్నర్ వికెట్ తీయడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తొలుత 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌ను ఫెర్గూసన్ తన పదునైన బంతులతో హడలెత్తించాడు. నాలుగు ఓవర్లు వేసి 3 వికెట్లు తీసి 15 పరుగులే ఇచ్చాడు. అటు తర్వాత సూపర్ ఓవర్‌లోనూ సత్తా చాటాడు. 3 బంతుల్లో 2 పరుగులుచ్చి 2 వికెట్లు తీసిన ఈ న్యూజిలాండ్ పేసర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చుక్కలు చూపించాడు. ఇక రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మోర్గాన్ 1, దినేష్ కార్తీక్ 2 పరుగులు చేసి లాంఛనాన్ని పూర్తి చేశారు. కేకేఆర్‌కు అద్భుతమైన గెలుపునందించిన ఫెర్గూసన్ కేకేఆర్ తరపున తొలి మ్యాచ్‌లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
(చదవండి: షమీ నిర్ణయంపై ఆశ్చర్యపోయాం: రాహుల్)
తొలి బంతికి వార్నర్ క్లీన్ బౌల్డ్
సూపర్ ఓవర్ తొలి బంతికి ఫుల్ లెంగ్త్ డెలివరీతో వార్నర్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన ఫెర్గూసన్ రెండో బంతికి రెండు పరుగులిచ్చాడు. మూడో బంతికి చక్కని యార్కర్‌తో సమద్‌ను కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. సూపర్ ఓవర్ మొదటి బంతికి వార్నర్‌ను ఔట్ చేయడం మరచిపోలేని అనుభూతి అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ మీట్‌లో ఫెర్గూసన్ చెప్పుకొచ్చాడు. అది తన ఫేవరెట్ వికెట్లలో ఒకటి అని పేర్కొన్నాడు. ఇక మ్యాచ్‌లో తన బౌలింగ్ విషయానికి సంబంధించిన నిర్ణయాలన్నీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తనకే వదిలేశాడని ఫెర్గూసన్ వెల్లడించాడు. అటు మ్యాచ్‌లోనూ, ఇటు సూపర్ ఓవర్‌లోనూ మెరుగ్గా రాణించి జట్టుకు విజయాన్నందించిన ఫెర్గూసన్‌పై కెప్టెన్ మోర్గాన్ ప్రశంసలు కురిపించాడు. గత కొన్ని మ్యాచ్‌ల్లో పోరాడి ఓడిన కేకేఆర్ తాజా మ్యాచ్‌తో పోటీలోకి వచ్చిందని అన్నాడు.
(చదవండి: సూపరో... సూపరు)
Comments
Please login to add a commentAdd a comment