గత కొద్ది రోజులుగా భారత మీడియాలో వస్తున్న వార్తలు నన్ను చాలా బాధపెడుతున్నాయి. ఒక రనౌట్‌ను ‘మన్కడ్’ పేరుతో జత చేసి మన దిగ్గజ క్రీడాకారుడిని అవమానిస్తున్నారు. ఎప్పుడో 70ల్లో జరిగిన మ్యాచ్‌లో నాన్‌స్ట్రైకర్‌గా ఉన్న ఆస్ట్రేలియన్ క్రీజ్ వదలి బాగా ముందుకు వెళ్లటంతో వినూ మన్కడ్ అతడిని ఔట్ చేశాడు. ఒక బద్ధకస్తుడైన విదేశీ జర్నలిస్ట్ ‘మన్కడెడ్’ అని రాస్తే ఇప్పటికీ అదే స్థిరపడిపోయింది.బ్రౌన్‌ను అప్పటికే రెండు సార్లు మన్కడ్ హెచ్చరించినా కూడా అతను మారలేదు. మన్కడ్ చేసిన పనిలో తప్పేమీ లేదని సర్ డాన్‌బ్రాడ్‌మన్ కూడా అభిప్రాయపడినా దానిని ఇప్పటికీ మన్కడింగ్‌గానే పిలుస్తున్నారు. బ్యాట్‌కు బంతి తగిలిందని తెలిసినా క్రీజ్ వదలకుండా నిలబడే ఆటగాడిని ‘డబ్ల్యూజీ’ పేరుతో గుర్తు చేసుకోవడం లేదు కదా! అలాగే బ్రియాన్ లారా ఇచ్చిన క్యాచ్‌ను నేలకు తాకిన తర్వాత అందుకొని ఔట్‌గా అప్పీల్ చేసినప్పుడు దానిని ‘స్టీవ్ వా’ పేరుతో పిలవడం లేదు కదా! అలాంటప్పుడు హద్దు దాటిన నాన్‌స్ట్రైకర్‌ను రనౌట్ చేస్తే దానికి మన్కడ్ పేరు ఎందుకు తగిలించాలి.
అలాంటప్పుడు పైన చెప్పిన ఘటనలను ఎలా చూడాలి. అవి క్రీడా స్ఫూర్తికి అనుగుణంగా ఉన్నాయా. కనీసం ఇప్పుడు భారత మీడియా అయినా అలాంటి ఔట్‌ను ‘బ్రౌన్డ్’ పేరుతోనన్నా పిలవాలి లేదా మామూలుగా రనౌట్ అని చెబితే చాలు. ఈ రోజు మ్యాచ్‌లు ఆడబోతున్న నాలుగు జట్లకు కూడా ఇవి కీలక సమరాలు అనడంలో సందేహం లేదు. ముంబై చేతిలో ఓటమినుంచి కోలుకున్నామని చెన్నై చూపించాల్సి ఉంది. అదే విధంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్‌ను కూడా నిలువరించాలని ముంబై కోరుకుంటోంది. రైజర్స్ ఓపెనర్లు వార్నర్, బెయిర్‌స్టో పవర్‌ప్లేలోనే ప్రత్యర్థినుంచి మ్యాచ్‌ను లాక్కుంటున్నారు. వారిద్దరిని తొందరగా ఔట్ చేయడం ముఖ్యం. ఎందుకంటే తర్వాత వచ్చేవారికి ఇప్పటి వరకు పెద్దగా ఆడే అవకాశం రాలేదు కాబట్టి ఒత్తిడిలో కుప్పకూలిపోవచ్చు. చెన్నై టాపార్డర్ బాగా తడబడుతోంది. ధోని జాగ్రత్తగా ఆడి జట్టును గెలిపించగలడని భావించినా...అది ప్రతిసారీ సాధ్యం కాదని వాంఖడేలో రుజువైంది.
భారత దిగ్గజాన్ని అవమానిస్తున్నారు!
Published Sat, Apr 6 2019 1:48 AM | Last Updated on Sat, Apr 6 2019 1:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment