
పంద్రాగస్టుకి వస్తున్నారా?
ఆగస్టు 15... మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన రోజు. ఈ ఏడాది సరిగ్గా అదే తేదీన ‘నేనే రాజు – నేనే మంత్రి’ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారట దర్శకుడు తేజ. రానా, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం రాజకీయాల నేపథ్యంలో రూపొందుతోంది. అందుకే పంద్రాగస్టుకు రావాలనుకున్నారేమో. కేథరిన్ మరో కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రాయలసీమ రాజకీయాలను చూపించనున్నారు.
ప్రజాస్వామ్య దేశంలో రాజు ఎవరు? మంత్రి ఎవరు? పాలకులను నిర్ణయించే ప్రజలే రాజులు అంటుంటారు. కానీ, అంతిమంగా అధికారాన్ని ఆసరాగా చేసుకుని కొందరు రాజకీయ నాయకులు చక్రం తిప్పుతున్నారు. ఈ వ్యవస్థపై ఓ యువకుడు ఎలాంటి పోరాటం చేశాడనేది ఈ చిత్ర కథాంశమట! రానా, కాజల్, కేథరిన్... ముగ్గురి పాత్రలూ రాజకీయ కోణాల్లోనే ఉంటాయట. సరికొత్త కథ, కథనాలతో రూపొందుతోన్న ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని రానా నమ్మకంగా ఉన్నారు.