ఆశల పల్లకిలో కాజల్‌ | nene raja nene manthri release in the second week of the month of August month | Sakshi
Sakshi News home page

ఆశల పల్లకిలో కాజల్‌

Published Mon, Jul 31 2017 2:22 AM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

ఆశల పల్లకిలో కాజల్‌ - Sakshi

ఆశల పల్లకిలో కాజల్‌

తమిళసినిమా: నటి కాజల్‌ సినీ పయనం జోర్‌ధార్‌గా సాగిపోతోందనే చెప్పాలి. నటిగా 10 ఏళ్ల నిరంతర పయనంలో అప్రహతంగా 50 చిత్రాల మైలురాయిని టచ్‌ చేసినట్లు ఈ అమ్మడు ఇటీవల కాస్త గర్వంగానే చెప్పుకొచ్చింది. అదేవిధంగా కోలీవుడ్‌లో టాప్‌ హీరోలు విజయ్, అజిత్‌లతో ఏకకాలంలో నటిస్తున్న అరుదైన క్రెడిట్‌ను కొట్టేసిన నటి కాజల్‌అగర్వాల్‌.

వీటితో పాటు, హిందీ, తెలుగు చిత్రాల్లోనూ నటిస్తూ బిజీబిజీగా ఉంది. కాగా అజిత్‌తో రొమాన్స్‌ చేసిన వివేగం చిత్రం ఆగస్ట్‌ నెల రెండవ వారంలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఆయనతో నటించిన తొలి చిత్రం కావడంతో చాలా ఎగ్జైట్‌గా ఎదురుచూస్తోంది.అదే విధంగా తెలుగులో తనకు తొలి అవకాశం కల్పించిన దర్శకుడు తేజ దర్శకత్వంలో తాజాగా నటించిన తెలుగు చిత్రం నేనే రాజా నేనేమంత్రి తమిళంలోనూ నాన్‌ ఆణైయిట్టాళ్‌ పేరుతో విడుదలకు సిద్ధం అవుతోంది.

దీంతో ఆ ఏడాది తనకు చాలా స్పెషల్‌ అంటున్నా కాజల్‌అగర్వాల్‌ కొత్తగా ఒక టార్గెట్‌ పెట్టుకుందట. నటి సమంత అంగీకరించిన చిత్రాలను చకచకా పూర్తి చేసి ప్రియుడు నాగచైతన్యతో మూడుముళ్లకు సిద్ధం అవుతుండడంతో ఆమె కోసం ఎదురుచూస్తున్న అవకాశాలను రాబట్టుకునే ప్రయత్నంలో ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్‌లో విజయ్, అజిత్, సూర్య, కార్తీ, ధనుష్‌ అంటూ ప్రముఖ కథానాయకులందరితోనూ నటించేసింది. ఇప్పుడు ఈ అమ్మడి చూపు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌పై పడిందట.ఆయనతో నటించడమే టార్గెట్‌గా పెట్టుకుందట. త్వరలోనే అలాంటి అవకాశం వస్తుందనే ఆశలపల్లకిలో కలలు కంటోందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement