కాజల్ అగర్వాల్
గతేడాది విడుదలైన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో కెరీర్‌లో 50 చిత్రాల మైలురాయిని దాటేశారు ఆ హుషారుతో ఇప్పుడు మరింత జోరుగా సినిమాలు చేస్తున్నారామె. ఈ ఏడాది ‘అ!, ఎమ్మెల్యే, కవచం’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాజల్ ఇటీవల ‘ఇండియన్ 2’ సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా రూపొందనున్న చిత్రం ‘ఇండియన్ 2’. 1996లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) చిత్రానికిది సీక్వెల్.
ఈ సినిమాలో చాన్స్ రావడం గురించి కాజల్ మాట్లాడుతూ– ‘‘ఇండియన్ 2’ చిత్రంలో నా భాగస్వామ్యం ఉండబోతున్నందుకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ సినిమాలోని నా పాత్ర కోసం నేర్చుకోవాల్సిన కొత్త స్కిల్స్ పట్ల ఎగై్జటింగ్‌గా ఉన్నాను. ఈ సినిమాకు సైన్ చేయడంతో నా కెరీర్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లిన ఫీలింగ్ కలుగుతోంది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘అందరి యాక్టర్స్‌లాగానే నా కెరీర్‌లో కూడా ఎత్తుపల్లాలు ఉన్నాయి. కానీ ‘మగధీర’ సినిమాకు సైన్ చేసిన తర్వాత నా గోల్డెన్‌టైమ్ స్టార్ట్ అయ్యింది.
ఆ సినిమా నా కెరీర్‌కు బాగా ప్లస్ అయ్యింది. ఆ సినిమా వల్ల నాకు లభించిన గుర్తింపును ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నాను’’ అన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. బెల్లంకొండసాయి సాయి శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందుతోన్న ఓ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కాజల్ తమిళంలో నటించిన ‘ప్యారిస్ ప్యారిస్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీ వుడ్ ‘క్వీన్’ చిత్రానికిది రీమేక్.
Comments
Please login to add a commentAdd a comment