
తాతయ్య జయంతికి టీజర్
తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసి, అత్యధిక భాషల్లో చిత్రాలు నిర్మించి ‘గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో స్థానం పొందిన ఏకైక నిర్మాత డి.రామానాయుడు.
తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసి, అత్యధిక భాషల్లో చిత్రాలు నిర్మించి ‘గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో స్థానం పొందిన ఏకైక నిర్మాత డి.రామానాయుడు. ఈనెల 6న ఆయన జయంతి. ఆ రోజున ఆయన మనవడు రానా తాజా చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ టీజర్‌ను విడుదల చేయనున్నారు. రానా, కాజల్ జంటగా తేజ దర్శకత్వంలో సురేశ్ బాబు, కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి ఈ చిత్రం నిర్మించారు.
రానా మాట్లాడుతూ– ‘‘తాతగారి జయంతిన ‘నేనే రాజు నేనే మంత్రి‘ టీజర్ విడుదల చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నేను పోషిస్తున్న జోగేంద్ర పాత్ర స్వభావాన్ని టీజర్‌లో పరిచయం చేస్తున్నాం’’ అన్నారు. ‘రానా పర్సనాలిటీని మాత్రమే కాదు. అతడిలోని నటుణ్ణి పూర్తి వైవిధ్యంగా ఈ చిత్రంలో రీ ప్రజెంట్ చేస్తున్నా’’ అన్నారు తేజ. ‘రానా కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచిపోయే చిత్రమిది’ అన్నారు సురేశ్‌బాబు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: వెంకట్ సి. దిలీప్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: అభిరామ్ దగ్గుబాటి, వివేక్ కూచిబొట్ల, సమర్పణ: డి. రామానాయుడు.