
నాకేం కావాలో నాకు తెలుసు!
లైఫ్ ఎలా ఉండాలి? అనే విషయంలో క్లారిటీ ఉన్నవాళ్లకు ఏ చీకూ చింతా ఉండదు. తమకేం కావాలో స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. అందుకు తగ్గట్టుగా లైఫ్‌ని ప్లాన్ చేసుకుంటారు. కాజల్ అగర్వాల్ ఇలాంటి అమ్మాయే. ‘బ్యూటీ విత్ బ్రెయిన్’ అనాలి. తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ విషయం గురించి కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ – ‘‘కన్‌ఫ్యూజన్ అనే పదం నా డిక్షనరీలో ఉండదు. ఫుల్ క్లారిటీతో ఉంటాను. ఆల్‌మోస్ట్ తెలివిగానే నిర్ణయాలు తీసుకుంటాను. నాకేం కావాలో నాకు బాగా తెలుసు. కరెక్ట్‌గా చెప్పాలంటే స్ట్రాంగ్ గర్ల్‌ని’’ అన్నారు. విచిత్రం ఏంటంటే... తన మనస్తత్వానికి దగ్గరగా ఉన్న పాత్రను ‘నేనే రాజు నేనే మంత్రి’లో కాజల్ చేస్తున్నారు.
ఆ పాత్ర గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘ఇందులో నేను స్ట్రాంగ్ గర్ల్‌గా నటిస్తున్నాను. రియల్ లైఫ్‌లో నాకేం కావాలో నాకు బాగా తెలుసు. ఈ సినిమాలో నా పాత్ర కూడా అంతే. ఇలాంటి స్ట్రాంగ్ రోల్స్ చేసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ మధ్య సవాల్ అనిపించే పాత్రలనే సెలక్ట్ చేసుకుంటున్నాను. ఈ పాత్ర అలాంటిదే. ఈ సినిమా విషయంలో ఇంకో విశేషం ఏంటంటే.. నన్ను కథానాయికను చేసిన తేజగారి దర్శకత్వంలో మళ్లీ సినిమా చేస్తున్నాను. చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అన్నారు.