అఖిల్ అంత రిస్క్ చేస్తాడా..? | Akkineni akhil next movie with devakatta | Sakshi
Sakshi News home page

అఖిల్ అంత రిస్క్ చేస్తాడా..?

Published Tue, Dec 22 2015 5:45 PM | Last Updated on Sun, Sep 3 2017 2:24 PM

అఖిల్ అంత రిస్క్ చేస్తాడా..?

అఖిల్ అంత రిస్క్ చేస్తాడా..?

తొలి సినిమా వైఫల్యంతో ఆలోచనలో పడ్డ అఖిల్ రెండో సినిమా విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. స్టార్ డైరెక్ట్లతో సినిమా చేయడానికి ఎవరూ అందుబాటులో లేకపోవడంతో.. మరోసారి రిస్క్ చేయాలా..? లేక వెయిట్ చేయాలా అన్న డైలమాలో ఉన్నాడు. వి.వి. వినాయక్ దర్శకత్వంలో 'అఖిల్' సినిమాతో గ్రాండ్గా లాంచ్ అయిన అఖిల్ పర్సనల్గా మంచి మార్కులు సాధించినా.. కమర్షియల్‌గా మాత్రం ఆశించిన స్థాయిని అందుకోలేకపోయాడు.

తన రెండో సినిమాను త్రివిక్రమ్, సుకుమార్లలో ఒకరితో చేయాలని భావించినా, ఈ ఇద్దరు ఇప్పట్లో ఫ్రీ అయ్యే అవకాశం కనిపించటం లేదు. గౌతమ్ మీనన్ లాంటి క్లాస్ డైరెక్టర్తో సినిమా చేయాలని ప్లాన్ చేసినా, అది కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దీంతో  ఏ డైరెక్టర్తో సినిమా చేయాలా అనే ఆలోచనలో ఉన్నాడు అక్కినేని నట వారసుడు.

తాజాగా అఖిల్ నెక్ట్స్ సినిమాపై ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది. కెరీర్లో ఇప్పటివరకు ఒక్క భారీ కమర్షియల్ హిట్ కూడా లేని దేవ కట్ట దర్శకత్వంలో.. సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట అఖిల్. ఆటోనగర్ సూర్య, డైనమైట్ సినిమాలతో నిరాశపరిచిన దేవాతో అఖిల్ సినిమా చేయటం రిస్క్ అన్న టాక్ వినిపిస్తోంది. మరి అఖిల్ ఆ రిస్క్ చేయడానికి రెడీ అవుతాడో.. లేదో.. తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement