
మరో మెగా హీరోతో వినాయక్ 'దుర్గ'..?
ఖైదీ నంబర్ 150 సినిమాతో వంద కోట్ల వసూళ్లు సాధించిన స్టార్ డైరెక్టర్ వివి వినాయక్, ఇంత వరకు తన నెక్ట్స్ సినిమాను ఎనౌన్స్ చేయలేదు. అయితే చాలా రోజులుగా మెగా హీరోతోనే వినాయక్ సినిమా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇదే విషయానికి సంబంధించిన మరో అప్ డేట్ టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. మెగా హీరోగా సాయిధరమ్ తేజ్తో వినాయక్ సినిమా చేయనున్నాడన్న వార్త చాలా రోజులుగా ప్రచారంలో ఉంది.
అయితే ఈ సినిమా కోసం దుర్గ (వర్కింగ్ టైటిల్) అనే పవర్ ఫుల్ మాస్ కథను వినాయక్ సిద్ధం చేశాడట. కథ, మాటల రచయిత ఆకుల శివతో కలిసి వినాయక్, ఈ కథకు తుది మెరుగులు దిద్దుతున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ బీవీయస్ రవి దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్న సాయిధరమ్ తేజ్ తదుపరి ప్రాజెక్ట్ను ఫైనల్ చేయలేదు.