మెగా మూవీ డబ్బింగ్ మొదలైంది
ప్రస్తుతం మెగా అభిమానులతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ ఆసక్తి ఎదురుచూస్తున్న సినిమా మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా, ఇది చిరు రీ ఎంట్రీ సినిమా కూడా కావటంతో మేకింగ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కథ ఎంపిక విషయంలోనే ఏళ్లకు ఏళ్లు ఎదురుచూసిన మెగా టీం ఇప్పుడు మేకింగ్లో మాత్రం జెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు.
ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. షూటింగ్తో పాటు ఎడిటింగ్ డబ్బింగ్ లాంటివి కూడా ఒకేసారి పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు చిరంజీవి కూడా తన పాత్రకు డబ్బింగ్ చెప్పటం స్టార్ట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్నట్టుగా, సంక్రాంతికి ఖైదీ నంబర్ 150ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అల్లు అరవింద్తో కలిసి ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మాస్ కమర్షియల్ సినిమాల కేరాఫ్ అడ్రస్ వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా అందాల భామ కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. తమిళ సూపర్ హిట్ సినిమా కత్తికి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో చిరు ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.