
అఖిల్ కోసం కర్చీఫ్ వేసిన నిర్మాత
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న సినిమా అఖిల్.. అక్కినేని నట వారసుడు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ను వివి వినాయక్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. మరో యంగ్ హీరో నితిన్... శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ మీద ఉండగానే అఖిల్ చేయబోయే నెక్ట్స్ సినిమా చర్చ మొదలైంది.
కామెడియన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత బడానిర్మాతగా మారిన బండ్ల గణేష్ ఈ చర్చకు తెర తీశాడు. ఇప్పటికే అఖిల్ తన తదుపరి చిత్రానికి బండ్ల గణేష్కు డేట్స్ కూడా ఇచ్చాడన్న టాక్ వినిపిస్తుంది. అయితే సినిమా విడుదలకు ముందు భారీ బిజినెస్ చేయగలిగే క్రేజీ కాంబినేషన్లను సెట్ చేయటంలో గణేష్ స్పెషలిస్ట్. అందుకే రెండో చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మాణంలో అయితే ద్వితియ విఘ్నాన్ని ఈజీగా దాటేయవచ్చని ఫీల్ అవుతున్నాడట అఖిల్.
బండ్ల గణేష్ కూడా ఓ సక్సెస్ఫుల్ డైరెక్టర్తో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందించిన కొరటాల శివతో అఖిల్ సినిమాను డైరెక్ట్ చేయించాలని ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీమంతుడు తరువాత ఇంత వరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయని కొరటాల ఈ ప్రాజెక్ట్ మీద సుముఖంగానే ఉన్నాడట. మరి ప్రభాస్, మహేష్ల కోసం ఫ్యామిలీ యాక్షన్ కథలను సెట్ చేసిన శివ... అఖిల్ ఎలా చూపిస్తాడో చూడాలి.