చిరు కోసం వినాయక్ రీసెర్చ్ | chiranjeevi vinayak katthilantodu details | Sakshi
Sakshi News home page

చిరు కోసం వినాయక్ రీసెర్చ్

Published Wed, Jun 22 2016 12:11 PM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM

చిరు కోసం వినాయక్ రీసెర్చ్

చిరు కోసం వినాయక్ రీసెర్చ్

ఇంతవరకు పట్టాలెక్కకపోయినా... చిరంజీవి 150 సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తూనే ఉంది. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని, గతంలో ఇదే కాంబినేషన్ లో వచ్చిన ఠాగూర్ సినిమాను మించే స్థాయిలో రూపొందించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా ఠాగూర్ సినిమాలో చిరు చెప్పిన డైలాగ్స్ అప్పట్లో సెన్సేషన్. అందుకే ఈ తాజా చిత్రంలోనూ అలాంటి డైలాగ్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

రైతు సమస్యల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా ఠాగూర్ తరహా డైలాగ్ ను ప్లాన్ చేస్తున్నాడు వినాయక్. అందుకోసం భారీగా రీసెర్చ్ చేస్తున్నాడు. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ల అప్పుడు, ఆత్మహత్యలు, వ్యవసాయ రంగానికి ప్రభుత్వ కేటాయింపులు లాంటి విషయాలతో ఓ లెంగ్తీ డైలాగ్ ను రెడీ చేస్తున్నారు. మరీ డైలాగ్ కత్తిలాంటోడికి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement