katthilantodu
-
నెపోలియన్‌గా మెగాస్టార్..?
చిరు 150 సినిమాకు సంబంధించిన వార్తలు రోజుకొకటి సందడి చేస్తూనే ఉంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై మరో ఆసక్తి కరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. తమిళ సూపర్ హిట్ సినిమా కత్తికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు ముందుగా కత్తిలాంటోడు అనే టైటిల్‌ను నిర్ణయించారన్న ప్రచారం జరిగింది. అయితే చిత్ర నిర్మాత మెగా స్టార్ తనయుడు రామ్ చరణ్ సినిమాకు టైటిల్ నిర్ణయించలేదంటూ తేల్చేశాడు. తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్ మెగా 150 విషయంలో ప్రచారంలోకి వచ్చింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నెపోలియన్ అనే టైటిల్‌ను ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. పోరాటం అతని నైజం అనే ట్యాగ్‌లో పాటు ఉన్న పోస్టర్ కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మరి ఇదే అఫీషియల్ టైటిలా..? లేదా అన్న విషయం తెలియాలంటే మెగా టీం ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
చిరు సినిమా టైటిల్ అదేనా..?
మెగా స్టార్ అభిమానులను ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న మెగా మూవీ ఎట్టకేలకు పట్టాలెక్కింది. వినాయక్ దర్శకత్వం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ సినిమా కత్తికి రీమేక్‌గా రూపొందుతోంది. దీంతో తెలుగు వర్షన్‌కు కత్తిలాంటోడు అనే టైటిల్‌ను నిర్ణయించారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను చిత్ర నిర్మాత మెగాస్టార్ తనయుడు చరణ్ ఖండించాడు. తాజాగా చిరు 150 టైటిల్‌కు సంబందించి మరో వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో చిరు ఖైదీగా కనిపిస్తాడు. ఈ సన్నివేశాల్లో షర్టు మీద 150 అనే నెంబర్ కనిపిస్తోంది. చిరు 150వ సినిమా కావటంతో ఆ సంఖ్యను ముద్రించారు. ఇదే బాగుందని ఫిక్స్ అయిన చరణ్ సినిమా టైటిల్‌గా ఖైదీ నెంబర్ 150 అనే పెట్టే ఆలోచనలో ఉన్నాడట. గతంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఖైదీ, ఖైదీ నెంబర్ 786 చిత్రాలు ఘన విజయం సాధించాయి. అందుకే మరోసారి సెంటిమెంట్ కూడా కలిసొస్తుందన్న ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. మరి ఈ టైటిల్ అయిన కన్ఫామ్ చేస్తారో.. లేక మరోసారి రూమర్ అంటూ కొట్టి పారేస్తారో చూడాలి. -
చిరు కోసం వినాయక్ రీసెర్చ్
ఇంతవరకు పట్టాలెక్కకపోయినా... చిరంజీవి 150 సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తూనే ఉంది. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని, గతంలో ఇదే కాంబినేషన్ లో వచ్చిన ఠాగూర్ సినిమాను మించే స్థాయిలో రూపొందించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా ఠాగూర్ సినిమాలో చిరు చెప్పిన డైలాగ్స్ అప్పట్లో సెన్సేషన్. అందుకే ఈ తాజా చిత్రంలోనూ అలాంటి డైలాగ్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రైతు సమస్యల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా ఠాగూర్ తరహా డైలాగ్ ను ప్లాన్ చేస్తున్నాడు వినాయక్. అందుకోసం భారీగా రీసెర్చ్ చేస్తున్నాడు. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ల అప్పుడు, ఆత్మహత్యలు, వ్యవసాయ రంగానికి ప్రభుత్వ కేటాయింపులు లాంటి విషయాలతో ఓ లెంగ్తీ డైలాగ్ ను రెడీ చేస్తున్నారు. మరీ డైలాగ్ కత్తిలాంటోడికి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి. -
దసరాకే 'ధృవ'
యంగ్ హీరో రామ్ చరణ్ రెండు పడవల మీద ప్రయాణానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే చెర్రీ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ సినిమా పట్టాలెక్కింది. తమిళ సూపర్ హిట్ సినిమా తనీ ఒరువన్కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు చెర్రీ. బ్రూస్ లీ సినిమాతో నిరాశపరిచిన చరణ్ వీలైనంత త్వరగా అభిమానులను సక్సెస్‌తో పలకరించాలని భావిస్తున్నాడు. అయితే అదే సమయంలో చిరు 150 సినిమా నిర్మాణ బాధ్యతలను కూడా భుజాల మీద వేసుకున్నాడు. వినాయక్ దర్శకత్వంలో చిరు హీరోగా తెరకెక్కుతున్న కత్తి లాంటోడు సినిమాను అల్లు అరవింద్‌తో కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి ప్లాన్ చేశాడు. తన సినిమాలో హీరోగా నటిస్తూనే, తండ్రి సినిమాకు నిర్మాతగా వ్యవహరించడానికి పక్కాగా స్కెచ్ వేస్తున్నాడు. మరి చెర్రీ రెండు పడవల ప్రయాణం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.