చిరు సినిమా టైటిల్ అదేనా..?
మెగా స్టార్ అభిమానులను ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న మెగా మూవీ ఎట్టకేలకు పట్టాలెక్కింది. వినాయక్ దర్శకత్వం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ సినిమా కత్తికి రీమేక్గా రూపొందుతోంది. దీంతో తెలుగు వర్షన్కు కత్తిలాంటోడు అనే టైటిల్ను నిర్ణయించారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను చిత్ర నిర్మాత మెగాస్టార్ తనయుడు చరణ్ ఖండించాడు.
తాజాగా చిరు 150 టైటిల్కు సంబందించి మరో వార్త టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో చిరు ఖైదీగా కనిపిస్తాడు. ఈ సన్నివేశాల్లో షర్టు మీద 150 అనే నెంబర్ కనిపిస్తోంది. చిరు 150వ సినిమా కావటంతో ఆ సంఖ్యను ముద్రించారు. ఇదే బాగుందని ఫిక్స్ అయిన చరణ్ సినిమా టైటిల్గా ఖైదీ నెంబర్ 150 అనే పెట్టే ఆలోచనలో ఉన్నాడట.
గతంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఖైదీ, ఖైదీ నెంబర్ 786 చిత్రాలు ఘన విజయం సాధించాయి. అందుకే మరోసారి సెంటిమెంట్ కూడా కలిసొస్తుందన్న ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. మరి ఈ టైటిల్ అయిన కన్ఫామ్ చేస్తారో.. లేక మరోసారి రూమర్ అంటూ కొట్టి పారేస్తారో చూడాలి.