నెపోలియన్గా మెగాస్టార్..? | chiranjeevi 150 movie title napoleon | Sakshi
Sakshi News home page

నెపోలియన్గా మెగాస్టార్..?

Jul 28 2016 8:10 AM | Updated on Sep 4 2017 6:46 AM

నెపోలియన్గా మెగాస్టార్..?

నెపోలియన్గా మెగాస్టార్..?

చిరు 150 సినిమాకు సంబందించిన వార్తలు రోజుకొకటి సందడి చేస్తూనే ఉంది.

చిరు 150 సినిమాకు సంబంధించిన వార్తలు రోజుకొకటి సందడి చేస్తూనే ఉంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై మరో ఆసక్తి కరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. తమిళ సూపర్ హిట్ సినిమా కత్తికి రీమేక్గా రూపొందుతున్న ఈ సినిమాకు ముందుగా కత్తిలాంటోడు అనే టైటిల్ను నిర్ణయించారన్న ప్రచారం జరిగింది.

అయితే చిత్ర నిర్మాత మెగా స్టార్ తనయుడు రామ్ చరణ్ సినిమాకు టైటిల్ నిర్ణయించలేదంటూ తేల్చేశాడు.  తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్ మెగా 150 విషయంలో ప్రచారంలోకి వచ్చింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నెపోలియన్ అనే టైటిల్ను ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. పోరాటం అతని నైజం అనే ట్యాగ్లో పాటు ఉన్న పోస్టర్ కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మరి ఇదే అఫీషియల్ టైటిలా..? లేదా అన్న విషయం తెలియాలంటే మెగా టీం ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement