Napoleon
-
వీడియో కాల్లో ప్రముఖ నటుడి కొడుకు నిశ్చితార్థం.. ఎందుకిలా?
ప్రముఖ తమిళ నటుడు, రాజకీయ నాయకుడు నెపోలియన్.. తన కుమారుడి నిశ్చితార్థం కాస్త డిఫరెంట్‌గా జరిపించారు. అబ్బాయేమో అమెరికాలో ఉంటే.. అమ్మాయి మాత్రం తమిళనాడులో ఉంది. అయితేనేం వీడియో కాల్లో అక్కడ ఇక్కడ కూర్చుని శుభకార్యం జరిపించారు. ఇంతకీ ఎందుకిలా చేశారు? అసలేంటి కారణం?అప్పట్లో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు నెపోలియన్.. ఆ తర్వాత కాలంలో కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. కొన్నాళ్ల తర్వాత ఇండస్ట్రీ, సొంతూరిని విడిచిపెట్టి అమెరికాలో సెటిలైపోయారు. ఈయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీళ్లలో ఒకడే ధనుష్. ఇతడికి నాలుగేళ్ల వయసులోనే 'మస్క్యూలర్ డైస్ట్రోపి' అనే వ్యాధి వచ్చింది. దీంతో శరీరం అంతా చచ్చుబడి పోయింది. అలా అప్పటి నుంచి వీల్‌ఛైర్‌కే పరిమితమయ్యాడు.(ఇదీ చదవండి: అంబానీ పెళ్లిలో ఐశ్వర్య రాయ్.. డిస్కషన్ మాత్రం విడాకుల గురించి!)ఇప్పుడు ఈ కుర్రాడికే నిశ్చితార్థం జరిపించారు. ప్రస్తుతం ధనుష్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా విమానంలో రావడం కాస్త కష్టమైన విషయం. దీంతో నటుడు నెపోలియన్.. తమిళనాడులోని తిరునల్వేలి వచ్చారు. కాబోయే పెళ్లి కూతురు అక్షయ ఏమో ఇక్కడ.. కొడుకు అమెరికాలో ఉండగా వీడియో కాల్ ద్వారా నిశ్చితార్థం అనే శుభకార్యాన్ని నెపోలియన్ జరిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తనకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని నెపోలియన్ కొడుకు ధనుష్.. తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. త్వరలో పెళ్లి ఉండొచ్చు. తేదీ ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా పూర్తిగా అమెరికాకి షిఫ్ట్ అయిపోయిన నెపోలియన్.. అక్కడే సేంద్రీయ వ్యవసాయంతో పాటు వ్యాపారం కూడా చేస్తున్నారు.(ఇదీ చదవండి: లావుగా ఉంటే పెళ్లి చేసుకోవద్దా.. జర్నలిస్ట్‌పై నటి రోహిణి ఫైర్) View this post on Instagram A post shared by Dhanoosh Nepoleon (@dhanoosh98) -
రూ.కోటి రూపాయలు విరాళం ప్రకటించిన ప్రముఖ నటుడు
దక్షిణ భారత నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణాన్ని ప్రారంభించి చాలా కాలమే అయ్యింది. అయితే నిధుల కొరత కారణంగా భవన నిర్మాణ కార్యక్రమాలు నిలిచిపోయాయి. అయితే దీన్ని పూర్తి చేయడానికి ప్రస్తుత కార్యవర్గం నడుం బిగించింది. భవన నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రూ.40 కోట్ల వరకూ అవసరం అవుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. అందుకోసం నిధుల సేకరణకు శ్రీకారం చుట్టారు. బ్యాంకు నుంచి కొంత రుణం తీసుకుంటున్నట్లు సంఘం కార్యదర్శి విశాల్ ఇటీవల తెలిపారు. కాగా సంఘం నూతన భవన నిర్మాణం కోసం సినీ ప్రముఖులు పలువురు పెద్ద మొత్తంలో నిధిని విరాళంగా అందిస్తున్నారు. నటుడు, నిర్మాత, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ఉదయనిధిస్టాలిన్ ఇటీవల కోటి రూపాయలను విరాళంగా అందించారు. అదే విధంగా నటుడు, మక్కల్ నీతి మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్, నటుడు విజయ్ కూడా కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు. కాగా ఇటీవల నటుడు శివకార్తికేయన్ రూ. 50 లక్షలు విరాళం అందించారు. కాగా తాజాగా ప్రముఖ నటుడు నెపోలియన్ రూ.కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈయన 2000 నుంచి 2006 వరకూ నడిగర్ సంఘానికి ఉపాధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహించారన్నది గమనార్హం. ఇప్పుడు కోటి రూపాయలను నూతన భవన నిర్మాణానికి విరాళంగా అందించడంతో ఆయనకు సంఘ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలుపుతూ మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. కాగా ఇటీవలే నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. రాజకీయ జీవితంనెపోలియన్ తన మామ, డిఎంకె నాయకుడు కెఎన్ నెహ్రూకి సహాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి 2001లో విల్లివాకం నియోజకవర్గం నుంచి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన 2006లో జరిగిన ఎన్నికల్లో మైలాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయి అనంతరం 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పెరంబలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచి ఎంపీగా గెలిచారు. 2009 నుంచి 2013 వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. నెపోలియన్ 2014లో డీఎంకే పార్టీకి రాజీనామా చేసి అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. -
మొండికేస్తున్న సోమాలియన్లు...
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అక్రమంగా నివాసం ఉంటూ పోలీసులకు పట్టుబడిన సోమాలియన్లలో ఒకరు ఇంకా నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని డిపోర్టేషన్ సెంటర్లోనే ఉండిపోయారు. ఇతడితో సహా మొత్తం ఎనిమిది మంది తమ స్వదేశానికి వెళ్లడానికి విముఖత చూపడంతో సిటీ అధికారులు ఐక్యరాజ్య సమితి సహాయం కోరారు. యూనైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ (యుఎన్‌హెచ్‌ఆర్‌సీ) జోక్యంతో ఏడుగురికి వివిధ స్కాండెనేవియన్ దేశాలు శరణార్థులుగా ఆశ్రయం కల్పించగా.. ఒకరికి మాత్రం ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో అతను ఇక్కడే ఉండిపోయాడు. అతడికి తోడు మరో ఇద్దరు బంగ్లాదేశీయులు ప్రస్తుతం ఈ డిపోర్టేషన్ సెంటర్లో ఉన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో దాదాపు రెండు నెలలుగా వీరి డిపోర్టేషన్ ప్రక్రియ ఆగిపోయింది. సక్రమంగా వచ్చి అక్రమంగా మారి... నగరం విద్య, వైద్య, వృత్తి, వ్యాపార, పర్యాటక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలతో పాటు దేశాలకు చెందిన వారు ఇక్కడికి వస్తున్నారు. స్టడీ, విజిట్, బిజినెస్, మెడికల్ వీసాలపై వచ్చిన వారిలో కొందరు అక్రమంగా ఇక్కడే ఉండిపోతున్నారు. మరికొందరు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా వివిధ మార్గాల్లో నగరానికి చేరుకుంటున్నారు. హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న వారిలో ఆఫ్రికన్ దేశాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. ప్రధానంగా సూడాన్, సోమాలియా, నైజీరియా, యమన్, కెన్యా, జిబౌటీ తదితర దేశాల నుంచి వస్తున్న వారితోనే ఇబ్బంది ఎక్కువగా ఉంటోంది. ఆయా దేశాల్లో ఉన్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడే అక్రమంగా స్థిరపడాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం వివిధ రకాలైన వీసాలపై ఇక్కడికి వచ్చేస్తున్నారు. మొండికేస్తున్న సోమాలియన్లు... ఈ ఏడాది జనవరిలో చిక్కిన సోమాలియా తదితర దేశాలకు చెందిన వారు డిపోర్టేషన్ సెంటర్‌కు చేరారు. మిలిగిన వారు తమ దేశాలకు వెళ్లిపోగా.. సోమాలియా దేశానికి చెందిన ఎనిమిది మంది మాత్రం తమ స్వదేశానికి వెళ్లేందుకు విముఖత చూపారు. దీంతో వారి విషయంలో అధికారులు యుఎన్‌హెచ్‌ఆర్‌సీ సహాయం తీసుకున్నారు. ఏడుగురి వద్ద సోమాలియా జాతీయులుగా నిరూపించడానికి అవసరమైన పత్రాలు లభించాయి. దీంతో యుఎన్‌హెచ్‌ఆర్‌సీ వీరికి వివిధ స్కాండినేవియన్ దేశాల్లో శరణార్థులుగా ఆశ్రయం కల్పించింది. ఒకరు మాత్రం దాదాపు 13 ఏళ్ల క్రితమే సోమాలియా నుంచి నగరానికి వచ్చేయడంతో ఇతడికి సంబంధించి ఆ దేశ రాయబార కార్యాలయం ఎలాంటి ధ్రువీకరణలు ఇవ్వలేకపోయింది. ఫలితంగా శరణార్థిగా మారే అర్హత లేక డిపోర్టేషన్ సెంటర్లోనే ఉండిపోయాడు. ఇతడితో పాటు దాదాపు రెండున్నర నెలల క్రితం చిక్కిన ఇద్దరు బంగ్లాదేశీయులు కూడా డిపోర్టేషన్ కోసం ఇక్కడికి వచ్చారు. లాక్డౌన్ నేపథ్యంలో డిపోర్టేషన్ ప్రక్రియలు జరగట్లేదు. ఇవి ఎప్పుడు ప్రారంభం అవుతాయో చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు. అప్పటి వరకు వారు సీసీఎస్ ఆ«ధీనంలోనే ఉండాల్సి ఉంది. డిపోర్టేషన్ సెంటర్‌గా సీసీఎస్... అక్రమంగా నివసిస్తూ పట్టుబడిన విదేశీయులతో పాటు వివిధ నేరాల్లో చిక్కిన వారినీ పోలీసులు అరెస్టు చేయడం, తమ ఆధీనంలోకి తీసుకోవడం చేస్తారు. వీరిపై సంబంధిత కేసులు నమోదు చేసిన తర్వాత దాని తీరును బట్టి తదుపరి చర్యలు తీసుకుంటారు. వీరిని ఆయా దేశాలకు బలవంతంగా తిప్పి పంపడానికి (డిపోర్టేషన్) ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అప్పటి వరకు డిపోర్టేషన్ సెంటర్లో వారిని ఉంచుతారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ సెంటర్ విశాఖపట్నంలో ఉండేది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సీసీఎస్ డిపోర్టేషన్ సెంటర్‌గా మారింది. విదేశీయులు పట్టుబడితే వారిని వెంటనే వారి దేశాలకు పంపడం సాధ్యం కాదు. చిక్కిన వారి వివరాలను ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు (ఎఫ్ఆర్ఆర్ఓ) పంపి, అక్కడి నుంచి ఆయా దేశాలకు చెందిన ఎంబసీలకు సమాచారం ఇవ్వడం ద్వారా వివరాలు పొంది, వారి సాయంతోనే డిపోర్ట్ చేయాలి. -
నెపోలియన్ రీమేక్‌లో వరలక్ష్మి?
తమిళ సినిమా: నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ నటుడు, నిర్మాత ఆర్కే.సురేశ్‌తో జత కట్టనున్నారా? ఇందుకు అవుననే సమాధానమే కోలీవుడ్ నుంచి వస్తోంది. విశేషం ఏమిటంటే ఇంతకు ముందు వీరిద్దరూ తారాతప్పట్టై చిత్రంలో విలన్, హీరోయిన్గా నటించారు. తాజాగా హీరోహీరోయిన్లుగా నటించడానికి రెడీ అవుతున్నారని సమాచారం. నిర్మాతగా రంగప్రవేశం చేసిన ఆర్కే.సురేశ్ ఆ తరువాత ప్రతి నాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎదుగుతూ తాజాగా కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయనిప్పుడు తనీముగం, బిల్లాపాండి, వర్గన్ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. మరో పక్క విలన్‌గానూ నటిస్తున్న ఆర్కే.సురేశ్ తెలుగు చిత్రం నెపోలియన్ చిత్ర రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారన్నది తాజా వార్త. తెలుగులో ఆనంద్ రవి స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఈ చిత్రాన్ని చూడమని ఒక మిత్రుడు చెప్పారని, చిత్రం చూసిన తరువాత తనకు బాగా నచ్చిందని ఆర్కే.సురేశ్ తెలిపారు. తాను స్టూడియో 9 పతాకంపై విజయ్‌సేతుపతి హీరోగా ధర్మదురై చిత్రం నిర్మించిన తరువాత చాలా కథలు విన్నా సంతృప్తి కలిగించలేదన్నారు. అలాంటిది నెపోలియన్ తెలుగు చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తే బాగుందని భావించానన్నారు.ఈ చిత్రం కోలీవుడ్‌కు చాలా కొత్తగా ఉంటుందని తెలిపారు.ఇందులో తాను హీరోగా నటిస్తూ నిర్మించనున్నానని, ఒక ముఖ్య పాత్రలో నటుడు సముద్రఖని నటించనున్నారని, మరో కీలక పాత్రను బాలీవుడ్ నటుడు పోషించనున్నారని తెలిపారు. ఇందులో హీరోయిన్ పాత్రను నటి వరలక్ష్మీశరత్‌కుమార్ పోషించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి. -
నానీడ దొరికిందా ?
-
నువ్వు హీరోనా...? అన్నారు
– ఆనంద్ రవి ఆనంద్ రవి డైరెక్ట్ చేసిన ‘పేరెంట్స్’ మూవీ చూసిన రోజే ఇతను మంచి దర్శకుడు అవుతాడనుకున్నా. తను ‘నెపోలియన్’ సినిమాలో నటిస్తున్నాడని తెలియగానే ఎందుకు నటన పట్ల ఆసక్తి చూపుతున్నాడనిపించింది. ట్రైలర్, పోస్టర్స్ చూడగానే ఈ సినిమాను తనే డైరెక్ట్ చేసి, హీరోగా చేయడం కరెక్ట్ అనిపించింది’’ అని నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ అన్నారు. ఆనంద్ రవి, కోమలి, రవివర్మ, కేదార్ శంకర్, మధుమణి, అల్లు రమేశ్ ప్రధాన పాత్రల్లో ఆనంద్ రవి దర్శకత్వంలో బోగేంద్ర గుప్త మడుపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘నెపోలియన్’. ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్, హీరో సందీప్‌కిషన్ విడుదల చేశారు. ఆనంద్ రవి మాట్లాడుతూ– ‘‘నేనీ కథతో చాలా మందిని కలిశా. ‘నీడపోయింది’ అనే పాయింట్ చెప్పగానే షార్ట్ మూవీయా? అన్నారు. హీరోగా నేనే చేయబోతున్నా అనగానే.. ‘నువ్వు హీరోనా! ప్రొడ్యూసర్ ఎవరు?’ అనడిగారు. అందరి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చుకుంటూ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. థ్రిల్లర్ జోనర్ సినిమా అయినా, కొత్త కాన్సెప్ట్‌తో ఉంటుంది. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా’’ అన్నారు. ఈ సందర్భంగా నిర్మాత బోగేంద్ర గుప్తాకు చెందిన ట్రిపుల్ ఎస్ అనే ఎన్.జి.ఒ సంస్థ అనారోగ్యంతో బాధపడుతున్న సినిమా జర్నలిస్ట్ వరప్రసాద్‌కు 25,000 చెక్‌ను సీనియర్ పాత్రికేయులు బీఏ రాజు, పసుపులేటి రామారావులకు అందజేశారు. -
నెపోలియన్‌గా మెగాస్టార్..?
చిరు 150 సినిమాకు సంబంధించిన వార్తలు రోజుకొకటి సందడి చేస్తూనే ఉంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై మరో ఆసక్తి కరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. తమిళ సూపర్ హిట్ సినిమా కత్తికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు ముందుగా కత్తిలాంటోడు అనే టైటిల్‌ను నిర్ణయించారన్న ప్రచారం జరిగింది. అయితే చిత్ర నిర్మాత మెగా స్టార్ తనయుడు రామ్ చరణ్ సినిమాకు టైటిల్ నిర్ణయించలేదంటూ తేల్చేశాడు. తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్ మెగా 150 విషయంలో ప్రచారంలోకి వచ్చింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నెపోలియన్ అనే టైటిల్‌ను ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. పోరాటం అతని నైజం అనే ట్యాగ్‌లో పాటు ఉన్న పోస్టర్ కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మరి ఇదే అఫీషియల్ టైటిలా..? లేదా అన్న విషయం తెలియాలంటే మెగా టీం ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
బీజేపీలో చేరిన నెపోలియన్
అమిత్‌షా సమక్షంలో చేరిక చెన్నై: సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి డి. నెపోలియన్ ఆదివారం బీజేపీలో చేరారు. శనివారమిక్కడ డీఎంకేకు రాజీనామా చేసిన నెపోలియన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. డీఎంకేలో అంతర్గత ప్రజాస్వామ్యం అనేదే లేదని ఆయన అన్నారు. . ప్రధాని మోదీ పనితీరు అద్భుతమని కొనియాడారు. అమిత్ రెండు రోజుల తమిళనాడు పర్యటనలో బీజేపీలో చేరిన మూడో ప్రముఖుడు నెపోలియన్. గేయ రచయిత గంగై అమరన్, కొరియోగ్రాఫర్ గాయత్రీ రఘురామ్ శనివారం బీజేపీలో చే రారు. డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరికి నెపోలియన్ సన్నిహితుడు. ఆయన 2009-2012 మధ్య యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అయితే అళగిరికి మద్దతుగా నిలవడంతో డీఎంకేలో నెపోలియన్‌కు ప్రాధాన్యం తగ్గింది. -
నేతృత్వం మాదే!
* సీఎం అభ్యర్థి ప్రకటించాకే ఎన్నికల్లోకి... * బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టీకరణ * పీఎంకే, డీఎండీకేలకు షాక్ * ‘చో’తో భేటీలో ఆంతర్యమేమిటో... * కమలం గూటికి నెపోలియన్ సాక్షి, చెన్నై : ‘‘మా నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూటమి బరిలోకి దిగుతుంది. సీఎం అభ్యర్థి ప్రకటనతో ఎన్నికల్లోకి వెళ్తాం.’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో కాస్త పీఎంకే, డీఎండీకేలకు షాక్ తగిలింది. తుగ్లక్ పత్రిక సంపాదకుడు చో రామస్వామితో అమిత్ షా భేటీ కావడంలో ఆంతర్యాన్ని వెతికే పనిలో విశ్లేషకులు పడ్డారు. డీఎంకే నుంచి బయటకు వచ్చిన సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి నెపోలియన్ కమలం కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో బలమైన శక్తిగా అవతరించడం లక్ష్యంగా తన వ్యూహాలకు పదును పెట్టేందుకు అమిత్ షా సిద్ధం అయ్యారు. తన చెన్నై పర్యటనలో తొలి రోజు శనివారం మరై మలై నగర్ వేదికగా జరిగిన బహిరంగ సభలో ఆకట్టుకునే ప్రసంగం చేసిన అమిత్ షా రెండో రోజు తన వ్యూహాల్ని అమలు చేసేందుకు కమలనాథుల్ని సిద్ధం చేసే పనిలో పడ్డారు. ‘మా నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి’ అన్న విషయాన్ని కుండబద్దలు కొట్టారు. అమిత్ షా పర్యటన ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీబిజీగా సాగింది. ‘చో’తో భేటీ : అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీ కాంత్‌కు తుగ్లక్ పత్రిక సంపాదకుడు చో రామస్వామి సన్నిహితులు. ఈ పరిస్థితుల్లో చెన్నైకు వచ్చిన అమిత్ షా ఉదయాన్నే ఆర్యపురంలోని చో ఇంటికి వెళ్లారు. అక్కడ సుమారు గంట పాటుగా ఇద్దరు భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రజనీ కాంత్‌కు గాలం వేయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. చో ద్వారా అందుకు తగ్గ రాయబారాలు ఏవైనా సాగిస్తోందా..? అన్న చర్చ బయలు దేరింది. అయితే, చో అనారోగ్యంతో ఉన్న దృష్ట్యా, మర్యాద పూర్వక పరామర్శ సాగినట్టు కమలనాథులు పేర్కొంటున్నారు. వ్యూహాల అమలు : టీ నగర్‌లోని కమలాలయం చేరుకున్న అమిత్ షాకు పార్టీ వర్గాలు ఘన స్వాగతం పలికారుు. రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. ఇందులో కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మురళీ ధరరావు, నేతలు ఇల గణేషన్, హెచ్ రాజా, సీపీ రాధాకృష్ణన్, మోహన్ రాజులు తదితరులు పాల్గొన్నారు. సుమారు రెండు గంటల పాటుగా ఈ సమావేశం సాగింది. పార్టీ బలోపేతం లక్ష్యంగా, ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే రీతిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇందులో చర్చ సాగినట్టు కమలనాథులు పేర్కొంటున్నారు. మా నేతృత్వంలోనే కూటమి: మీడియా సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ నేతృత్వంలోనే కూటమి ఆవిర్భవిస్తుందని స్పష్టం చేశారు. సీఎం అభ్యర్థి ఎవరన్నది ప్రకటించాకే ఎన్నికలకు వెళ్తామన్నారు. అంతలోపు పార్టీ బలోపేతం లక్ష్యంగా దూసుకెళతామన్నారు. డీఎంకే, అన్నాడీఎంకేలను ఢీ కొట్టే శక్తిగా అవతరించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. 2014 బీజేపీకి కలసి వచ్చిన సంవత్సరంగా పేర్కొన్నారు. 30 ఏళ్లుగా పడ్డ శ్రమకు ఫలితంగా ఎవరి మద్దతు లేకుండా కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టగలిగామని గుర్తు చేశారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ధరల కట్టడి లక్ష్యంగా ముందుకు సాగుతున్నదన్నారు. అందువల్లే, తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పది సార్లు పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించ గలిగామని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో, స్మార్ట్ సిటీల పథకంతో ముందుకు దూసుకెళుతున్నామన్నారు. తమిళనాడులో సభ్యత్వ నమోదు ప్రక్రియ ఆరంభమైందని 60 లక్షల మందిని చేర్పించి బలమైన శక్తిగా తమ సత్తాను చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. అధికారాలు లేవు: సుబ్రమణ్య స్వామి పార్టీలో ఓ సభ్యుడు అని, నాయకుల్లో ఒకరు అని పేర్కొంటూ, ఆయనకు పార్టీ సిద్ధాంతాల పరంగా ఎలాంటి అధికారాలు ఇవ్వలేదని ఓ ప్రశ్నకు స్పష్టం చేశారు. తమిళ జాలర్లకు భద్రత కల్పించే విధంగా చర్యలు వేగవంతం చేశామని, కర్ణాటకలో సాగుతున్న డ్యాం నిర్మాణ వ్యవహారాల్లో ఆ రాష్ర్టం, తమిళనాడు అధికారుల్ని ఒక చోట చేర్చి చర్చించి నిర్ణయాలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా క్రోం పేటలోని ఓ కల్యాణ మండపంలో జరిగిన పార్టీ జిల్లాల కార్యదర్శుల సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు వేగవంతం లక్ష్యంగా ఉపదేశాలు ఇచ్చి ఢిల్లీకి తిరుగు పయనమయ్యారు. నెపోలియన్ తీర్థం : డీఎంకే నుంచి బయటకు వచ్చిన కేంద్ర మాజీ మంత్రి నెపోలియన్ కమలం కండువా కప్పుకున్నారు. అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. డీఎంకేలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, అందుకే తాను బీజేపీలోకి చేరినట్టు నెపోలియన్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలన అద్భుతంగా ఉందని, ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తున్నదని పేర్కొన్నారు. డీఎంకేలో అసంతృప్తి వాదులు కోకొల్లలుగా ఉన్నారని, త్వరలో వీరంతా బీజేపీలో చేరబోతున్నారని నెపోలియన్ ప్రకటించడం గమనార్హం. -
నీ ప్రవర్తన అంతటిమీద ఆయనకు అధికారమిస్తే ఆయన నీ త్రోవనుసరళం చేస్తాడు
దేవునికి ప్రథమ స్థానాన్నిచ్చి నష్టపోయినవారు, ఆ స్థానం ఆయనకివ్వకుండా లాభపడినవారు లోకంలో ఉండరు. దేవునికి ప్రథమ స్థానాన్నిచ్చిన వారెవ్వరూ జీవితంలో చివరిస్థానంలో ఉండరు. ప్రసిద్ధ జర్మన్ శిల్పి జోహాన్ హెన్రిచ్ 18వ శతాబ్దంలో రెండేళ్లు శ్రమించి యేసుక్రీస్తు శిల్పాన్ని చెక్కాడు. దాన్ని ముందుగా ఒక వ్యక్తికి చూపిస్తే, ఎవరీయన? గొప్ప చక్రవర్తా? అనడిగాడు. తన వైఫల్యాన్ని గ్రహించి ఈసారి ఆరేళ్ల శ్రమతో మరో శిల్పాన్ని చెక్కాడు. అది చూసిన ప్రజల కళ్లలో తెలియకుండానే నీళ్లు తిరిగాయి. ‘‘మొదటిసారి నా నైపుణ్యాన్ని నమ్మాను. రెండవసారి ఆ యేసునే న మ్మాను. ఆయనే నా దగ్గరుండి నాతో చెక్కించారు’’ అంటూ హెన్రిచ్ సాక్ష్యం చెప్పాడు. ఆ శిల్పాన్ని నియంత నెపోలియన్ మెచ్చుకుని తాను ఆరాధించే వీనస్ దేవత బొమ్మను చెక్కమని ఆదేశిస్తే, యేసుక్రీస్తు రూపాన్ని చెక్కిన ఈ చేతులతో మరే రూపాన్నీ చెక్కలేనని నిరాకరించి ఆయన ఆగ్రహానికి గురయ్యాడు. బైబిలులోని ప్రకటన గ్రంథంలో దేవుడు ప్రస్తావించిన ఏడు చర్చిల్లో చివరికి ఫిలడెల్ఫియా, లవొదికయ. ఈ రెండింటికీ అసలు పోలికే లేదు. ఫిలడెల్ఫియా చర్చిలో ఎత్తి చూపడానికి దేవునికి ఒక్క లోపమూ కనపడలేదు. లవొదికయ చర్చిలో మెచ్చుకొనడానికి ఒక్క లక్షణమూ కనపడలేదు. దేవుడే సర్వస్వంగా జీవించిన చర్చి ఫిలడెల్ఫియా కాగా, ధనవృద్ధి బాటలో పడి దేవుణ్ణి దూరం పెట్టిన చర్చి లవోదికయ. అయితే దేవుణ్ణి పూర్తిగా విస్మరించలేదు, చర్చి తలుపు బయట నిలబెట్టిందంతే! చర్చి వెలుపల ఉండాల్సిన ధనానికి అంటే లోకానికి లోపల ప్రధానాసనం వేసి చర్చిలో ప్రధానాసనంలో ఉండాల్సిన దేవుణ్ణి తలుపు బయట నిలబెట్టింది. ధనాన్ని హత్తుకుని యేసుక్రీస్తును నిరాదరించిన దేవుడు లేని డబ్బు చర్చి అది. అందువల్ల నీవు చల్లగానైనా, వెచ్చగానైనా లేవు, నులివెచ్చగా ఉన్నావంటూ యేసుప్రభువు అత్యంత తీవ్రమైన పదజాలంతో లవొదికయ చర్చిపై అభియోగాలు మోపాడు. అయితే అంత నిరాదరణకు గురై కూడా యేసుక్రీస్తు తానింకా తలుపు వెలుపలే నిలబడి తనను లోపలికి రానివ్వడం కోసం, తలుపు తడుతున్నానని చెప్పడం తిరుగులేని ఆయన ప్రేమకు, కృపకు, క్షమాపణకు నిదర్శనం (ప్రకటన 3:7-22). చాలామంది విశ్వాసుల సమస్య దేవుడు లేకపోవడం కాదు. దేవునికి దూరంగా, లోకానికి దగ్గరగా ఉండటమే వారి ప్రధాన సమస్య. ఈ జోడు గుర్రాల స్వారీలోనే విశ్వాసులు బొక్కబోర్లా పడి చేదు అనుభవాలు పొందుతుంటారు. మన జీవితాల్లో, కుటుంబాల్లో దేవుడు ప్రథమస్థానాన్ని కోరుకుంటాడు. దేవుడూ లోకమూ కావాలనుకునే తప్పుడు ప్రాధాన్యతాక్రమంలో ఆయన అసలు ఇమడడు. మన జీవితంలో, కుటుంబంలో ఆయన మొదటి స్థానంలో లేకుంటే దేవుడసలు లేనట్టే!! దేవునికి ప్రథమ స్థానాన్నిచ్చి నష్టపోయినవారు, ఆ స్థానం ఆయనకివ్వకుండా లాభపడినవారు లోకంలో ఉండరు. దేవునికి ప్రథమ స్థానాన్నిచ్చిన వారెవ్వరూ జీవితంలో చివరిస్థానంలో ఉండరు. నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారమిస్తే ఆయన నీ త్రోవను సరళం చేస్తాడన్నది దేవుని వాగ్దానం (సామెతలు 3:6). ఆయన అధికారానికి లోబడటంలోని అపారమైన ఆశీర్వాదాలను అడ్డుకోవడానికే సాతాను మనల్ని ప్రలోభపెట్టి దేవుని స్థానంలో ధనాన్ని, లోకాన్ని తెచ్చి మన జీవితంలో ప్రతిష్టిస్తూంటాడు. దేవుని రాజ్యనిర్మాణం జరుపవలసిన వారితో సాతాను ఆ విధంగా తన రాజ్యాన్ని నిర్మింప జేసుకుంటున్నాడు. ‘‘మీరు బైబిలు మాత్రమే ఉపదేశిస్తారెందుకు?’’ అని ప్రసిద్ధ బాప్టిస్టు ప్రబోధకుడు పాస్టర్ ఎడ్రియన్ రోజర్స్‌ను ఇక ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే, ‘ై‘బెబిలు తప్ప మరొకటి అర్థం చేసుకునేంత తెలివితేటలు నాకు లేవు. అయితే జీవితాల్ని, కుటుంబాల్ని కట్టగల శక్తి బైబిలుకే ఉందన్న సత్యాన్ని గ్రహించేంత తెలివి మాత్రం నాకుంది’’ అన్నాడాయన. బైబిలు తప్ప డబ్బు మాటే ఎత్తని ఆయన ప్రసంగాలు వినడానికి వేలాదిమంది 30 ఏళ్లపాటు ఆయన పాస్టరుగా ఉన్న చర్చిలో వారం వారం నిండిపోయేవారు. దేవుడంటే మాకు చాలా అభిమానం అంటారు చాలామంది. అభిమానులు సినీతారలకు, క్రికెటర్లకు కావాలి. దేవునికి సంపూర్ణ విధేయత చూపించే అనుచరులు కావాలి. దేవునితో సాన్నిహిత్యం పెరిగేకొద్దీ విశ్వాసి లోకానికి దినదినం దూరమవుతాడు. తేనెను ఆస్వాదించిన నోటికి మరేదీ రుచినివ్వనట్టే, దేవుని ప్రేమను, కృపను రుచి చూసిన విశ్వాసికి ‘ధనవృద్ధి’ చాలా తుచ్ఛమైనదిగా కనిపిస్తుంది. - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్