వీడియో కాల్‌లో ప్రముఖ నటుడి కొడుకు నిశ్చితార్థం.. ఎందుకిలా? | Actor Napoleon's Son Dhanoosh Got Engaged Via Video Call | Sakshi
Sakshi News home page

Napoleon Son: కుర్చీకే పరిమితమైన నటుడి కొడుకు.. డిఫరెంట్‌గా ఎంగేజ్‌మెంట్

Published Sat, Jul 13 2024 5:54 PM | Last Updated on Sat, Jul 13 2024 6:02 PM

Actor Napoleon's Son Dhanoosh Got Engaged Via Video Call

ప్రముఖ తమిళ నటుడు, రాజకీయ నాయకుడు నెపోలియన్.. తన కుమారుడి నిశ్చితార్థం కాస్త డిఫరెంట్‌గా జరిపించారు. అబ్బాయేమో అమెరికాలో ఉంటే.. అమ్మాయి మాత్రం తమిళనాడులో ఉంది. అయితేనేం వీడియో కాల్‌లో అక్కడ ఇక్కడ కూర్చుని శుభకార్యం జరిపించారు. ఇంతకీ ఎందుకిలా చేశారు? అసలేంటి కారణం?

అప్పట్లో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు నెపోలియన్.. ఆ తర్వాత కాలంలో కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. కొన్నాళ్ల తర్వాత ఇండస్ట్రీ, సొంతూరిని విడిచిపెట్టి అమెరికాలో సెటిలైపోయారు. ఈయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీళ్లలో ఒకడే ధనుష్. ఇతడికి నాలుగేళ్ల వయసులోనే 'మస్క్యూలర్ డైస్ట్రోపి' అనే వ్యాధి వచ్చింది. దీంతో శరీరం అంతా చచ్చుబడి పోయింది. అలా అప్పటి నుంచి వీల్‌ఛైర్‌కే పరిమితమయ్యాడు.

(ఇదీ చదవండి: అంబానీ పెళ్లిలో ఐశ్వర్య రాయ్.. డిస్కషన్ మాత్రం విడాకుల గురించి!)

ఇప్పుడు ఈ కుర్రాడికే నిశ్చితార్థం జరిపించారు. ప్రస్తుతం ధనుష్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా విమానంలో రావడం కాస్త కష్టమైన విషయం. దీంతో నటుడు నెపోలియన్.. తమిళనాడులోని తిరునల్వేలి వచ్చారు. కాబోయే పెళ్లి కూతురు అక్షయ ఏమో ఇక్కడ.. కొడుకు అమెరికాలో ఉండగా వీడియో కాల్ ద్వారా నిశ్చితార్థం అనే శుభకార్యాన్ని నెపోలియన్ జరిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తనకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని నెపోలియన్ కొడుకు ధనుష్.. తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. త్వరలో పెళ్లి ఉండొచ్చు. తేదీ ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా పూర్తిగా అమెరికాకి షిఫ్ట్ అయిపోయిన నెపోలియన్.. అక్కడే సేంద్రీయ వ్యవసాయంతో పాటు వ్యాపారం కూడా చేస్తున్నారు.

(ఇదీ చదవండి: లావుగా ఉంటే పెళ్లి చేసుకోవద్దా.. జర్నలిస్ట్‌పై నటి రోహిణి ఫైర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement